Burma
-
ఆత్మీయతను పంచిన బర్మా హౌజ్!
దేశ రాజకీయాలను అనుసరించేవాళ్లకు న్యూఢిల్లీలోని ‘24, అక్బర్ రోడ్’ అనగానే అది కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం అని గుర్తొస్తుంది.అయితే దాదాపు ఐదు దశాబ్దాల పాటు అక్కడ కార్యకలాపాలు నెరిపిన అనంతరం ఆ పార్టీ అక్కడినుంచి కొత్త చిరునామాకు మారడంతో ఇది వార్తల్లో నిలిచింది. కానీ దానికంటే ముందు ఆ చిరునామాను ‘బర్మా హౌజ్’ అనేవారని చాలామందికి తెలియదు. అప్పుడు అది భారత్‌లో బర్మా (మయన్మార్) రాయబారి ఇల్లుగా ఉండేది. ఆమె భర్త సాక్షాత్తూ బర్మా జాతిపిత; ఆమె కూతురు తర్వాత్తర్వాత ఆ దేశ గొప్ప నాయకురాలిగా ఎదిగిన ఆంగ్ సూన్ సూ కీ. అందుకే ఆ ఇంట్లో బర్మా వాతావరణం, వాళ్ల ఆత్మీయతలు వెల్లివిరిసేవి.న్యూఢిల్లీలోని ‘24, అక్బర్ రోడ్’ చిరునామా గురించి మీకు తెలుసా? సుమారుగా యాభై ఏళ్లపాటు కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఇక్కడే ఉండేది. ఈ మధ్యే మారిపోయిందనుకోండి! అంతకంటే ముందు దీని పేరు ‘బర్మా హౌజ్’. బర్మా (తర్వాత మయన్మార్‌గా పేరు మారింది) దేశపు రాయబారి నివాస స్థానం అది. ‘24, అక్బర్ రోడ్’ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం కాక మునుపు ఈ ఇంట్లో ‘డా ఖిన్ కీ’ ఉండే వారు. ఆమె బర్మా స్వాతంత్య్ర సమర యోధుడు ఆంగ్ సాన్ (బర్మా జాతిపితగా పిలుస్తారు) పత్ని. భర్త హత్యకు గురైన తరువాత ఆ దేశపు మంత్రిగానూ ఆమె పనిచేశారు. 1960లో ఇండియాకు బర్మా రాయబారిగా నియమితులయ్యారు. ఢిల్లీకి వచ్చి, ఏడేళ్ల పాటు ‘24, అక్బర్ రోడ్’లో నివసించారు. డా ఖిన్ కీ నా తల్లిదండ్రులకు స్నేహితురాలైతే... ఆమె కూతురు ఆంగ్ సాన్ సూ కీ (మయన్మార్ ప్రతిపక్ష నేత; నోబెల్ శాంతి బహు మతి గ్రహీత) మా అక్క కిరణ్‌కు ఫ్రెండ్. లేడీ శ్రీరామ్ కాలేజీలో ఆంగ్ సాన్ సూ కీ, కిరణ్ కలిసి చదువుకున్నారు. 1964లో మా అమ్మ, నాన్న ఇద్దరూ ఉద్యోగ రీత్యా కాబూల్(అఫ్గానిస్తాన్ రాజధాని)కి వెళ్లాల్సి వచ్చినప్పుడు, తన చివరి ఏడాది చదువు ఇంకా మిగిలి ఉండటంతో కిరణ్ ఆరు నెలల పాటు ‘24, అక్బర్ రోడ్’లో ఉండింది. డా ఖిన్ కీ పెద్ద పొడగరి ఏమీ కాదు. పైగా కొంచెం లావుగా ఉండేది. బర్మీస్ మహిళల్లో అధికుల మాదిరి లుంగీ కట్టుకునేది. వెంట్రుకలన్నీ పూలతో అలంకరించిన బన్‌లో ఒద్దికగా ఇమిడి పోయేవి. ఆమె ముఖంలో ఒక రకమైన దయ వ్యక్తమయ్యేది. ఎల్ల ప్పుడూ చిరునవ్వుతో కళకళలాడే మోము. మృదుభాషి!మొదటిసారి ఆమెను కలిసినప్పుడు నాకు ఆరేళ్లు ఉంటా యేమో! కొడుకు దగ్గర లేని కారణంగా ఆమె నన్ను తల్లిలా చూసుకునేది. డైనింగ్ రూమ్‌లో బోలెడంత ‘ఖో సూయి’ (చికెన్ నూడుల్స్) తినడం ఇప్పటికీ గుర్తుంది. అయితే నా ఫేవరెట్ మాత్రం ‘బ్లాక్ రైస్ పుడ్డింగ్’. బర్మీస్ ఇళ్లల్లో దీన్ని బాగా చేస్తారు. మిగతావాళ్ల మాటేమో కానీ నాకు మాత్రం చాలా ఇష్టమీ వంటకం. పిసరంత వదలకుండా తినే వాడినేమో... మిగిలిన వాళ్లు రుచి చూసేందుకు కూడా ఉండేది కాదనుకుంటా! అప్పట్లో చాలా బొద్దుగా ఉండేవాడిని. అందుకే సూ కీ నన్ను ‘రోలీ – పోలీ’ అని ఆటపట్టిస్తూండేది. చాలామంది దౌత్యవేత్తల మాదిరిగానే బర్మా రాయబారికి మెర్సిడెస్ కారు ఉండేది. వాళ్ల డ్రైవర్ పేరు ‘విల్సన్ ’. వారాంతాల్లో కుతుబ్ మీనార్ దాటుకుని అవతల ఉండే బౌద్ధారామాలకు ఆమె వెళ్లేది. అక్కడి భిక్షువులకు ఆహారం అందించేది. చాలాసార్లు నేనూ ఆమెతో వెళ్లేవాడిని. ఎప్పుడు మళ్లీ ‘24, అక్బర్ రోడ్’కు వస్తామా అని ఎదురుచూసేవాడిని. ఎందుకంటే... తిరిగి వచ్చిన తరువాతే భోజ నాల వడ్డన జరిగేది.ఆంగ్ సాన్ సూ కీ సుమారు ఏడేళ్లు భారత్‌లో ఉంది. ముందు జీసస్ అండ్ మేరీ కాన్వెంట్లో, ఆ తరువాత లేడీ శ్రీరామ్ కాలేజ్‌లో చదివింది. యుక్త వయసులో ఉండగానే రాజకీయాల్లో చేరాలని గట్టిగా నిర్ణయించుకుంది. ఎప్పటికైనా ఉన్నత స్థానానికి చేరుకో గలనన్న నమ్మకం కూడా తనలో ఉండేది. సుమారు 18 ఏళ్ల వయసు ఉండేదేమో అప్పుడు. ఒకరోజు కిరణ్ పెన్సిల్ డ్రాయింగ్ గీసింది. దాని కింద, ‘కిరణ్ థాపర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు బర్మా రావొచ్చు’అని రాసింది.దశాబ్దాల తరువాత నేను ‘డా ఖిన్ కీ’ని లండన్ లో కలిశాను. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కూతురు ఆంగ్ సాన్ సూ కీతో కలిసి నివసిస్తూండేది. అప్పుడామె వయస్సు ఎనభైల్లో ఉంది. నేను ముప్ఫైలలో ఉన్నాను. నన్ను చూడగానే... అనారోగ్యం, తన వయసు ఏదీ గుర్తు రాలేదు. బోసినవ్వుతో భళ్లున నవ్వుతూ, ‘వీడు సన్న బడ్డాడు’ అంది. కళ్లు మిలమిలా మెరుస్తున్నాయి. నవ్వుతో ముఖమంతా నిండిపోయింది. ‘‘ఇంత సన్నబడతాడని అనుకోనే లేదు’’ అంది. ‘‘ఖో–సూయి అంటే ఇప్పటికీ బాగా ఇష్టమట. వచ్చి నప్పుడల్లా కావాలని అడుగుతూంటాడు’’ అని చెప్పింది ఆంగ్ సాన్ సూ కీ. ఆక్స్‌ఫర్డ్‌లో ఉండగా సూ కీ ఎప్పుడూ బ్లాక్ రైస్ పుడ్డింగ్ చేసేది కాదు. అందుకేనేమో... నాకు అది ఎలా ఉంటుందో లీలగా గుర్తుంది కానీ, రుచి ఎలా ఉంటుందన్నది మాత్రం గుర్తు లేకుండా పోయింది. కొబ్బరి తురుముతో కప్పిన నల్ల బియ్యంతో చేసే తీపి పదార్థం అది.నేను మళ్లీ 2015లో రంగూన్ లో ఆంగ్ సాన్ సూ కీని కలిశాను. ‘24, అక్బర్ రోడ్’ నాటి ఆప్యాయత ఏమాత్రం తగ్గలేదని చూడగానే అర్థమైంది. ‘‘నా మరో ఇంటికి స్వాగతం. 24, అక్బర్ రోడ్ గురించి నీకు తెలుసు కదా... ఇది అమ్మ మరో ఇల్లు’’ అంది. ఢిల్లీ ఇంట్లో ఓ భారీ పియానో ఉండేది. సూ కీ పియానో వాయించేది కూడా! గత వారం ‘24, అక్బర్ రోడ్’కు సంబంధించి పత్రికలు బోలెడన్ని వార్తలు రాశాయి. అప్పుడే నాకూ గుర్తుకొచ్చింది... ఆ ఇంటి గురించి నాకు ముందే తెలుసు అని! రాజకీయ పార్టీ కేంద్రం కాక మునుపు ఆ ఇంటి పొడవాటి నడవాలో ప్రేమ, ఆప్యాయతలు అల్లుకునిపోయి ఉండేవి. అది లూట్యెన్స్ ఢిల్లీలో భాగమని అస్సలు అనిపించేది కాదు. అది ‘డా ఖిన్ కీ’ ఇల్లు అన్నది మాత్రమే నాకు లెక్క. ఎప్పుడైనా వెళ్లగలిగే... ప్రేమ ఆప్యాయతలు అందుకోగల ఇల్లు!డా ఖిన్ కీ, ఆంగ్ సాన్ సూ కీ భారత్‌లో గడిపిన రోజులు చాలా ప్రత్యేకమని చెప్పాలి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోనూ సూ కీ తరచూ ఆ రోజులను గుర్తు చేసుకునేది. దీన్ని బట్టే వాళ్లు ‘24, అక్బర్ రోడ్’లో చాలా సంతోషంగా ఉండేవారు అనిపించేది. ఆ భవనం గోడలిప్పుడు మాట్లాడగలిగితే ఆ రోజుల ఊసులు ఇంకెన్ని చెప్పేవో... ప్చ్!కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
అది విద్వేష ప్రసంగమే.. ప్రధానిపై చర్య తీసుకోండి: కాంగ్రెస్
న్యూఢిల్లీ: రాజస్తాన్‌లోని బర్మేర్‌లో బుధవారం ఎన్నికల ప్రచారంలో విద్వేష పూరిత ప్రసంగం చేసిన ప్రధాని మోదీపై చర్య తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘం(ఈసీ)ని కోరింది. కాంగ్రెస్‌కు మరణ శాసనం లిఖించేందుకు కమలం బటన్‌పై నొక్కాలంటూ ఓటర్లకు పిలుపునిచ్చారని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ తెలిపారు. ప్రధాని అహంకారానికి ప్రజలు తగు గుణపాఠం చెబుతారన్నారు. ‘కాంగ్రెస్ నేతలను మోదీ ఎంతగా ద్వేషిస్తున్నారో ఆయన ప్రసంగాన్ని చూస్తేనే తెలుస్తుంది. ప్రధానమంత్రి వంటి బాధ్యతాయుత పదవిలో ఉన్న వ్యక్తి ఇటువంటివి మాట్లాడొచ్చా? ఆయన ప్రజాస్వామ్యం గొంతు పిసికేస్తున్నారు. ఇది కచ్చితంగా విద్వేష ప్రసంగమే’అని జైరాం రమేశ్ గురువారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ప్రధానిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. బీజేపీ ఎన్నికల గుర్తు కమలం అన్న విషయం తెలిసిందే. -
సింగిల్ ‘టేక్’ శిల్పం
కంటోన్మెంట్ (హైదరాబాద్): ప్రపంచంలోనే అతిపెద్ద అనంత శేష శయన శ్రీ మహా విష్ణుమూర్తి ఏకాండీ బర్మా టేకు శిల్పాన్ని శనివారం మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. దీనికి బోయిన్‌పల్లిలోని అనూరాధ టింబర్ ఎస్టేట్స్ వేదికైంది. 21 అడుగుల పొడవు, ఎనిమిదిన్నర అడుగుల ఎత్తు, 20 అడుగుల కైవారం కలిగిన బర్మా టేకు దుంగతో చేసిన ‘అనంత శేషశయన శ్రీ మహా విష్ణుమూర్తి’ కళా ఖండానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అప్పటి బర్మా (మయన్మార్) దేశ అడవుల్లో సుమారు 1,500 ఏళ్ల క్రితం బర్మా టేకు దుంగను ఆ దేశ ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం వేలం వేసింది. అనూరాధ టింబర్స్ భారీ మొత్తం చెల్లించి ఈ దుంగను దక్కించుకుంది. చిత్రకారుడు గిరిధర్ గౌడ్‌తో పలు రేఖా చిత్రాలను రూపొందించి.. మయన్మార్ దేశ ప్రభుత్వం అనుమతితో అక్కడి శిల్పులతో కళాఖండాన్ని చెక్కించింది. అనంతరం కళాఖండాన్ని భారత్‌కు రప్పించి తుది మెరుగులు దిద్దించింది. భగవద్గీతలోని 11వ అధ్యాయం 6వ శ్లోకం ఆధారంగా అనంత శేషశయన శ్రీ మహావిష్ణువుతో పాటు, శ్రీదేవి, భూదేవి చిత్రాలతో పాటు 84 చిన్న కళాఖండాల కలయికతో ఈ భారీ శిల్పాన్ని రూపొందించారు. కళాఖండాన్ని ఆవిష్కరించిన మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు మాట్లాడుతూ అనురాధ టింబర్స్ నిర్వాహకులు చదలవాడ సోదరులు బర్మా టేకుతో అద్భుత కళాఖండాన్ని రూపొందించడం అభినందనీయమన్నారు. -
మొసలిని అమాంతం మింగేసింది కొండచిలువ..పాపం ఆ తర్వాత..
ఓ కొండచిలువ అమాంతం ఓ మొసలిని మింగేసింది. ఆ తర్వాత అదిపడ్డ బాధ అంతా ఇంతా కాదు. చివరికి కక్కలేక మింగలేక నానాపాట్లు పడి.. విగతజీవిగా మారింది. అదే సమయంలో కొండచిలువ పొట్టలో ఉన్న మొసలి సైతం ఊపిరాడక చనిపోయింది. ఈ షాకింగ్ ఘటన బర్మాలో చోటు చేసుకుంది. కానీ వైద్యులు ఆ రెండు జీవుల్లో ఒక్కదాన్నైనా రక్షించాలనుకున్నారు. అందులో భాగంగానే వైద్యులు కొండచిలువ పొట్టకోసి మొసలిని తీసే యత్నం చేశారు. ఐతే అది అప్పటికే చనిపోయింది. ఆ కొండచిలువ సుమారు ఐదడుగుల మొసలిని మింగేసినట్లు వైద్యులు పేర్కొన్నారు. దాన్ని అరగించుకోలేక ప్రాణాలు విడిచినట్లు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై స్పందించిన నెటిజన్లు తనకు మించి భారీగా ఉన్నవాటిని మింగితే వాటిని కొండచిలువలు ఉమ్మేస్తాయని కొందరూ చెబుతున్నారు. మరికొందరూ కొండచిలువ అలా చేయగలిగే అవకాశం ఉన్న చేయలేక చనిపోయిందని ట్వీట్ చేశారు. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి: (చదవండి: ఏం స్వారీ చేశాడు భయ్యా! అర్థరాత్రి తాగిన మైకంలో ఎద్దుపైకి ఎక్కి..) -
ఆభరణమూ చరిత్ర చెబుతుంది
పొన్నియిన్ సెల్వన్... అది ఒక చరిత్ర పుస్తకం. అది ఒక సాహిత్య సుమం. అది ఒక సామాజిక దృశ్యకావ్యం. వీటన్నింటికీ దర్పణాలు ఈ ఆభరణాలు. ఆభరణం చరిత్రను చెబుతుంది. ఆభరణం కూడా కథను నడిపిస్తుంది. ఆ ఆభరణాలకు రూపమిచ్చిన డిజైనర్... ప్రతీక్ష ప్రశాంత్ పరిచయం ఇది. ప్రతీక్ష ప్రశాంత్... ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ సినిమాలో ఆమె కీలకమైన బాధ్యతలు నిర్వర్తించారు. తన క్రియేటివిటీతో తెరకు కళాత్మకతను పొదిగారామె. ఆ సినిమాలో నటీనటులు ధరించిన ఆభరణాలను రూపొందించిన ప్రతీక్ష ప్రశాంత్... సినిమా కోసం తనకు ఏ మాత్రం అవగాహన లేని చోళ రాజుల గురించి తెలుసుకున్నారు. వారి జీవన శైలి, వారికి ఇతర దేశాలతో ఉన్న వర్తక వాణిజ్యాలు, ఆచారవ్యవహారాలు, ధార్మికజీవనం... అన్నింటినీ ఔపోశన పట్టారు ప్రతీక్ష. ఆ అనుభవాలు ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. ‘‘మాకు సినిమా ప్రపంచంతో ఏ మాత్రం పరిచయం లేదు. మా ఇంట్లో వాళ్లు మహా బిడియస్థులు. మా పూర్వికులు నిజాం కుటుంబాలకు ఆభరణాలు తయారు చేశారు. హైదరాబాద్ లో ఆరు దశాబ్దాలుగా ఆభరణాల తయారీ, అమ్మకాల వ్యాపారంలో ఉన్నారు. కానీ వాళ్ల ఫొటోలు కూడా ఎక్కడా కనిపించవు. అలాంటిది ఒక్కసారిగా నేను సినిమా కోసం పని చేయడం ఊహించని మలుపు అనే చెప్పాలి. సినిమాకు ఆర్నమెంట్ డిజైనర్‌గా కంటే ముందు నా గురించి చెప్పాలంటే... మాది గుజరాతీ కుటుంబం. నేను పుట్టింది, పెరిగింది మాత్రం ముంబయిలో. మా నాన్నలాగే ఆర్కిటెక్చర్ చేశాను. పెళ్లితో కిషన్‌దాస్ ఆభరణాల తయారీ కుటుంబంలోకి వచ్చాను. నాకు ఉత్తరాది కల్చర్‌తోపాటు హైదరాబాద్ కల్చర్ తో మాత్రమే పరిచయం. అలాంటిది తమిళనాడుకు చెందిన ఒక పీరియాడికల్ మూవీకి పని చేయవలసిందిగా ఆహ్వానం అందడం నిజంగా ఆశ్చర్యమే. ఆ సినిమాకు డ్రెస్ డిజైనర్‌గా పనిచేసిన ‘ఏకా లఖానీ’కి నాకు కామన్ ఫ్రెండ్ సినీ నటి అదితి రావు హైదరీ. ఆమె ఆర్నమెంట్ డిజైనింగ్‌లో నా స్కిల్ గురించి ఏకా లఖానీకి చెప్పడంతో నాకు పిలుపు వచ్చింది. మణిరత్నం గారితో మాట్లాడిన తరవాత నేను చేయాల్సిన బాధ్యత ఎంత కీలకమైనదో అర్థమైంది. కొంచెం ఆందోళన కూడా కలిగింది. ఎందుకంటే నాకు చోళుల గురించి తెలియదు. ఆభరణాలు అర్థం కావడానికి కొన్ని పెయింటింగ్స్ చూపించారు. వాటిని చూసి యథాతథంగా చేయడం నాకు నచ్చలేదు. అందుకే చోళుల గురించి అధ్యయనం చేశాను. విదేశీ మణిమాణిక్యాలు చోళులు ధరించిన ఆభరణాల్లో ఉన్న మాణిక్యాలు మామూలు మాణిక్యాలు కాదు. అవి బర్మా రూబీలు. బర్మాతో చోళులకు ఉన్న వర్తక వాణిజ్యాల గురించి తెలిస్తేనే నేను ఆభరణంలో బర్మా రూబీ వాడగలుగుతాను. టాంజానియా, గోల్కొండతో కూడా మంచి సంబంధాలుండేవి. మరకతాలు, వజ్రాల్లో ఆ మేరకు జాగ్రత్త తీసుకున్నాం. అలాగే చోళులు శివభక్తులు, చేతికి నాగ వంకీలను ధరిస్తారు. తలకు పెద్ద కొప్పు పెట్టి, ఆ కొప్పుకు సూర్యవంక, చంద్రవంక, నాగరం వంటి ఆభరణాలను ధరిస్తారు. ఆభరణాల్లో కమలం వంటి రకరకాల పూలు– లతలు, నెమలి, రామచిలుక వంటి పక్షులు, దేవతల రూపాలు ఇమిడి ఉంటాయి. ముక్కు పుడక నుంచి చేతి వంకీ, ముంజేతి కంకణం, వడ్డాణం, తల ఆభరణాలు... వేటికవి తనవంతుగా కథను చెబుతాయి, కథకు ప్రాణం పోస్తాయి. రంగస్థలం అయితే తల వెనుక వైపు ఆభరణాల మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉండక పోవచ్చు. కానీ సినిమాలో ముఖ్యంగా మణిరత్నం మూవీలో కెమెరా పాత్ర చుట్టూ 360 డిగ్రీల్లో తిరుగుతుంది. కాబట్టి ఎక్కడా రాజీ పడడానికి వీల్లేదు. పైగా ఇప్పుడు ప్రేక్షకులు ఒకప్పటిలాగ సినిమా చూసి బాగుందనో, బాగోలేదనో ఒక అభిప్రాయంతో సరిపుచ్చడం లేదు. పాత్ర అలంకరణ నుంచి, సన్నివేశం నేపథ్యం వరకు ప్రతిదీ నిశితంగా గమనిస్తున్నారు, పొరపాటు జరిగితే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి ఆటపట్టిస్తారు. అలాగే ఒకసారి ఐశ్వర్య ధరించిన ఆభరణాన్ని మరోసారి పారపాటున త్రిషకు అలంకరించామంటే ఇక అంతే. అప్పట్లో కోర్సుల్లేవు ఇక నా ఆర్నమెంట్ డిజైనర్ కెరీర్ విషయానికి వస్తే... నేను ఇందులో ఎటువంటి కోర్సూ చేయలేదు. ఇప్పటిలాగ పాతిక– ముప్పై ఏళ్ల కిందట కోర్సులు లేవు కూడా. మా మామగారికి సహాయంగా స్టోర్‌లోకి అడుగుపెట్టాను. నిపుణులైన మా కారిగర్స్ తమ అనుభవంతో పని నేర్పించారు. ప్రతి పనినీ ఆసక్తితో నేర్చుకున్నాను. ఇప్పటికీ రోజూ మధ్యాహ్నం వరకు నా ఆర్కిటెక్చర్ ఆఫీస్, మధ్యాహ్నం నుంచి ఆర్నమెంట్ స్టోర్ చూసుకుంటూ ఉంటాను. ఈ సినిమాకి పని చేయడం నా జీవితంలో ఒక విశిష్టమైన ఘట్టం’’ అన్నారామె. చారిత్రక దృశ్యమాలిక ఈ సినిమా కోసం మూడేళ్లు పనిచేశాను. నాలుగు వందల మంది డాన్సర్స్‌తో చిత్రీకరించిన విజయగీతం చాలా పెద్దది. సినిమా కోసం 450 ఆభరణాలు బంగారంతో చేశాం. ఐశ్వర్యారాయ్, త్రిష, విక్రమ్, జయం రవి, కార్తి, శోభిత... వంటి ముఖ్యపాత్రలతోపాటు మరికొన్ని ప్రధాన పాత్రలకు బంగారు ఆభరణాలు, చిన్న పాత్రలకు గిల్టు ఆభరణాలు చేశాం. దర్బార్ సన్నివేశాలు, యుద్ధఘట్టాలు, డాన్సులు... సన్నివేశాన్ని బట్టి ఆభరణం మారుతుంది. అలాగే ఒక్కో పాత్ర హెయిర్ స్టయిల్ ఒక్కో రకంగా ఉంటుంది. తలకు అలంకరించే ఆభరణాలు కూడా మారుతాయి. ప్రతి ఆభరణమూ చోళుల కాలాన్ని స్ఫురింపచేయాలి. చోళుల రాజ చిహ్నం పులి. రాజముద్రికల మీద పులి బొమ్మ ఉంటుంది. ఉంగరం మీద కొంత కథ నడుస్తుంది. కాబట్టి ఆ సీన్లో చిన్న డీటెయిల్ కూడా మిస్ కాకుండా పులితోపాటు పామ్ ట్రీ కూడా ఉండేటట్లు దంతంతో ఆభరణాన్ని రూపొందించాం. కల్కి కృష్ణమూర్తి రాసిన ప్రఖ్యాత తమిళ నవలకు, చారిత్రక ఘట్టాలకు దృశ్యరూపం ఇచ్చే ప్రయత్నంలో ఎక్కడా లోపం జరగకూడదనేది మణిరత్నం గారి సంకల్పం. ఆ ప్రయత్నంలో సక్సెస్ అయ్యాననే అనుకుంటున్నాను. – ప్రతీక్ష ప్రశాంత్, ఆర్నమెంట్ డిజైనర్ – వాకా మంజులారెడ్డి ఫొటోలు: నోముల రాజేశ్ రెడ్డి -
ఒకే దేశం రెండు పేర్లు
బాంకాక్: మయన్మార్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూల్చివేసి, అధికారాన్ని హస్తగతం చేసుకున్న సైన్యం, అక్కడ తిరిగి సైనిక పాలనకు అంకురార్పణ చేయడమే కాక గత నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైన ఆంగ్‌సాంగ్ సూకీ, ఆమె అనుచరులను గృహనిర్భంధంలో ఉంచింది. పైగా మయన్మార్‌లో సైనిక పాలన విధించడం సబబేనని, ఆంగ్‌సాంగ్ సూకీ ప్రభుత్వం నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడడమే అందుకు కారణమని తన చర్యలను మయన్మార్ సైన్యం సమర్థించుకుంది. సుదీర్ఘ సైనిక పాలన అనంతరం నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఆంగ్‌సాంగ్ సూకీ ప్రభుత్వం విజయ దుందుభి మోగించిన విషయం తెలిసిందే. మయన్మారా? బర్మానా? నిజానికి ఈ సైనిక తిరుగుబాటు ఎక్కడ జరిగింది? అధికారికంగా ఈ దేశాన్ని మయన్మార్ అనాలా? లేక ఇప్పటికీ అమెరికా సంభోదిస్తున్నట్టు బర్మా అని పిలవాలా? దీనికి సమాధానం క్లిష్టమైన విషయమే. మయన్మార్‌లో ప్రతిదీ రాజకీయమే. భాషతో సహా. ఒకే దేశానికి రెండు పేర్లు ఎందుకు? ► ఆధిపత్య జుంటాలు, బర్మన్ జాతి ప్రజల ప్రజాస్వామిక తిరుగుబాటుని అణచివేసిన తరువాత, 1989లో ఈ దేశం పేరుని బర్మాకి బదులుగా మయన్మార్‌గా మార్చారు. అక్కడి ప్రభుత్వాన్ని సైనిక పాలకులు ‘‘యూనియన్ ఆఫ్ బర్మా’’కి బదులుగా ‘‘యూనియన్ ఆఫ్ మయన్మార్’’గా మార్చారు. పాత పేరు అనేక పురాతన జాతులెన్నింటినో విస్మరించిందన్న విమర్శలున్నాయి. ► నిజానికి ఈ పేరులో పెద్ద తేడా ఏమీ లేదు. అయితే సాహిత్యపరంగా చిన్న తేడా వుంది. ‘మయన్మార్’ ‘బర్మా’ అధికారిక వర్షన్. రెండు పేర్లూ అంతిమంగా అతిపెద్ద జాతి సమూహమైన బామర్ ప్రజలు మాట్లాడే భాషకి సంబంధించినవే. ఒకటి రెండు బామర్ కాని సమూహాలు ముఖ్యంగా బామర్ మైనారిటీలు ఇందులో మినహాయింపు. మన్మా అనే శబ్దం ఎలా ఉద్భవించింది అనే విషయంలో స్పష్టత లేదు. అయితే 9వ శతాబ్దంలో సెంట్రల్ ఇర్వాడి నదీ లోయలోకి ప్రవేశించిన ‘‘బామాస్’’ పాగన్ రాజ్యాన్ని స్థాపించారు. అలాగే తమని తాము మన్మా అని సంభోదించుకున్నారు. ఆ తరువాత 1989లో ఈ దేశం పేరుని ఇంగ్లీషులో మయన్మార్‌గా మార్చారు. ప్రపంచంలోని చాలా మంది ఈ పేరుతో పిలవడాన్ని తిరస్కరించారు. ఈ మార్పు ఎప్పుడు జరిగింది? ► దేశం ప్రజాస్వామ్యం వైపు అడుగులు వేస్తోన్న తరుణంలో దశాబ్దం క్రితం ఈ పేరుని మార్పు చేశారు. బర్మాలో సైన్యం అధికారాన్ని హస్తగతం చేసుకొని, అత్యధిక రాజకీయాధికారాలను దక్కించుకుంది. అయితే ప్రతిపక్ష నాయకులు జైలు నుంచి విడుదలై గృహనిర్భంధంలో ఉన్నారు. ఈ సందర్భంలో ఎన్నికలకు అనుమతిచ్చారు. సుదీర్ఘకాలంగా ప్రజాస్వామ్యం కోసం పోరాడుతోన్న ఆంగ్‌సాంగ్ సూకీ ఈ ఎన్నికల్లో దేశానికి నాయకురాలయ్యారు. ► చాలా ఏళ్ళ పాటు చాలా దేశాలు, అసోసియేషన్ ప్రెస్‌తో సహా మీడియా అంతా ఈ దేశాన్ని అధికారికపు పేరుతోనే పిలవడం ప్రారంభించారు. నిర్భంధం, ఆంక్షలు తగ్గి, మిలిటరీ పాలనకు అంతర్జాతీయంగా పెద్దగా వ్యతిరేకత లేకపోవడంతో ‘‘మయన్మార్’’ పేరు కామన్‌గా మారిపోయింది. దేశంలోని ప్రతిపక్షాలు మాత్రం తమకు ఈ విషయంలో పెద్ద పట్టింపు లేదని తేల్చి చెప్పారు. అయితే మొత్తం ప్రపంచానికి భిన్నంగా అమెరికా ప్రభుత్వం మాత్రం ఈ దేశాన్ని ‘బర్మా’ పేరుతోనే పిలుస్తూండడం విశేషం. ► 2012లో అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా ఈ దేశాన్ని సందర్శించినప్పుడు బర్మా, మయన్మార్ రెండు పేర్లతో సంభోదించారు. మయన్మార్ అధ్యక్షులు దీన్ని చాలా అనుకూలంగా భావించారు. ఇప్పుడేంటి? సైనిక తిరుగుబాటుపై అమెరికా విమర్శలు కురిపిస్తోంది. అమెరికా స్టేట్ సెక్రటరీ ఆంటోనీ బ్లింకెన్, అధ్యుడు జో బైడెన్లు దేశం యొక్క చట్టబద్దమైన పేరుని కావాలనే విస్మరిస్తున్నారని భావిస్తున్నారు. బర్మాలో ప్రజాస్వామ్య పురోగతి నేపథ్యంలో బర్మాపై దశాబ్ద కాలంగా అమెరికా ఆంక్షలను సడలించింది. అయితే తిరిగి ఆ ఆంక్షల కొనసాగింపు అవసరాన్ని అమెరికా పునరాలోచిస్తోంది. -
నల్లగొండలో 17 మంది బర్మా దేశీయులు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : నల్లగొండలో 17మంది బర్మా దేశీయులను మంగళవారం రాత్రి పోలీసులు గుర్తించారు. వీరంతా మార్చి 17న నల్లగొండకు మత ప్రచార నిమిత్తం వచ్చారు. వీరిని కరోనా పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. వీరి కరోనా పరీక్షల రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లాకు విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు తమ సమాచారాన్ని వెల్లడించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. కరోనా నియంత్రణకు ప్రభుత్వం చర్యలు.. కరోనా (కోవిడ్ –19) వైరస్ వ్యాధి నిరోధానికి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. జిల్లా అధికార యంత్రాంగం ఈ పనుల్లో పూర్తిస్థాయిలో నిమగ్నమై ఉంది. విదేశాల నుంచి వచ్చిన వారు స్వచ్ఛందంగా ముందుకు రావాలని, పరీక్షలు చేయించుకుని గృహ నిర్బంధంలోనే ఉండాలని పదేపదే కోరుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళ నృత్యానికి వేలాది మంది బలవుతున్నారు. దేశంలో, రాష్ట్రంలో వ్యాధిని అరికట్టేందుకు చేస్తున్న హెచ్చరికలు కొందరి చెవికి ఎక్కడం లేదన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. మంగళవారం రాత్రి జిల్లా పోలీసులు నల్లగొండలో మరికొందరు విదేశీయులను గుర్తించారు. జిల్లాలో మొదట వియత్నాం నుంచి మత ప్రచారానికి వచ్చిన çపన్నెండు మంది, వారికి గైడ్లుగా వచ్చిన మరో ఇద్దరు.. వెరసి పధ్నాలుగు మంది గుట్టుచప్పుడు కాకుండా ఆయా ప్రార్థనా మందిరాల్లో తలదాచుకున్నారు. పోలీసు నిఘా విభాగం వీరిని గుర్తించి కరోనా వైరస్ పరీక్షల నిర్వహణకు హైదరాబాద్‌కు తరలించింది. ఈ సమయంలో జిల్లా ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కాగా, వీరందరికీ పరీక్షల్లో నెగెటివ్ రిపోర్టు రావడంతో అటు అధికారులు, ఇటు జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వీరికి కరోనా లక్షణాలు లేకున్నా.. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో ఐసోలేషన్‌లోనే ఉంచి వైద్య సేవలు అందించారు. ఇది మరచిపోక ముందే.. ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన సమావేశాలకు వెళ్లి వచ్చిన వారి ఉదంతం సంచలనం సృష్టించింది. వీరెవరూ తాము బయటి ప్రాంతాలకు వెళ్లివచ్చామని స్వచ్ఛందంగా ముందుకు రాలేదు. నిజాముద్దీన్‌లో సమావేశాలకు వెళ్లి వచ్చిన వారిలో హైదరాబాద్, ఇతర జిల్లాల్లో మొ త్తంగా ఆరుగురు మృత్యువాత పడడంతో అసలు ఎవరెవరు నిజాముద్దీన్‌కు వెళ్లివచ్చారని పోలీసులు జల్లెడ పట్టారు. నల్లగొండ పట్టణం నుంచే ఏకంగా 44 మంది వెళ్లివచ్చారని గుర్తించి మంగళవారం వా రందరినీ అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు పరీ క్షలకోసం పంపించారు. మంగళవారం రాత్రి జిల్లా కేంద్రంలో మరో పదిహేడు మంది బర్మా దేశస్తులు ఉన్నారని తేలడం సంచలన వార్తగా మారింది. మార్చి 17వ తేదీన నల్లగొండకు చేరుకున్న బర్మా దేశస్తులు.. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి, కరోనా వైరస్ తీవ్రతను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా బర్మా దేశం నుంచి వచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచారు. అయితే, ఢిల్లీలోని నిజాముద్దీన్‌కు వెళ్లివచ్చిన వారిని గుర్తించడంలో భాగంగా పోలీసులు ఆయా ప్రార్థన మందిరాల్లో ఎవరెవరు ఉంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేశారు. బర్మా దేశం నుంచి మత ప్రచారం కోసం నల్లగొండకు వచ్చిన 17 మందిని నల్లగొండ పోలీసులు మంగళవారం అర్థ్దరాత్రి గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వీరికి నార్కట్‌పల్లిలోని ఒక ఫంక్షన్ హాలులో వసతి కల్పించి బుధవారం కరోనా వైద్య పరీక్షల కోసం హైదరాబాద్‌కు తరలించారు. బర్మా దేశం నుంచి హైదరాబాద్‌లోని బాలాపూర్ ప్రాంతంలోని బాబానగర్‌కు చేరుకున్న వీరు మార్చి 17వ తేదీన మత ప్రచారం కోసం నల్లగొండకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. పట్టణంలోని మక్కా, జమ, కువా మసీదుల్లో బర్మా దేశీయులు ఉండి మతప్రచారం చేపట్టారని పోలీసులు పేర్కొన్నారు. ఆందోళన కలిగిస్తున్న గోప్యత.. కరోనా వైరస్ వ్యాప్తి చెందిన ప్రదేశాల్లో తిరిగి వచ్చిన వారు, లేదా కరోనా పీడితులతో కలిసి గడిపిన వారు తమకు తాముగా అధికారులకు సమాచారం అందించి పరీక్షలు జరిపించుకుని క్వారంటైన్‌కు వెళ్లకుండా గోప్యత పాటిస్తుండడం ఆందోళన కలిగిస్తోందని జిల్లా ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. వియత్నాం నుంచి వచ్చిన వారి గురించి, బర్మా నుంచి వచ్చిన వారి గురించిన సమాచారం స్థానిక ప్రజల నుంచి అందకపోవడాన్ని ఉదహరిస్తున్నారు. చివరకు ఢిల్లీలోని నిజాముద్దీన్‌కు వెళ్లి వచ్చిన వారు కూడా తమ ‘ఐడెంటిటీ ’ని బయట పెట్టలేదని, పోలీసులే వారందరినీ గుర్తించారని చెబుతున్నారు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారిగురించి, లేదా బయటి రాష్ట్రాలకు వెళ్లి వచ్చిన వారి గురించిన సమాచారం జిల్లా అధికారులకు తెలియజేయాలని కోరుతున్నారు. ఆ.. 44 మందికి కరోనా లక్షణాలు లేవు.. నిజాముద్దీన్ మర్కజ్లో ప్రార్థనలకు నల్లగొండ నుంచి వెళ్లి వచ్చిన 44 మందికి ఎలాంటి కరోనా లక్షణాలు లేవు. వీరిని మంగళవారం జిల్లా కేంద్రం నుంచి వైద్య పరీక్షల కోసం హైదరాబాద్ తరలించారు. కాగా వీరికి కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్‌గా రిపోర్ట్ వచ్చింది. వీరిని నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లకు తరలించనున్నారు. అక్కడ కొద్ది రోజులపాటు పర్యవేక్షణలో ఉంచనున్నారు. -
బర్మాలో పెద్ద నోట్లను రద్దు చేస్తే ఏమైంది?
మయన్మార్ (బర్మా)లో నల్లడబ్బును సమూలంగా నిర్మూలించాలనే సదాశయంతో 1987లో అప్పటి దేశ నాయకుడు నే విన్ దేశ కరెన్సీ కియత్‌లోని పెద్ద నోట్లను రద్దు చేశారు. సరైన ముందస్తు చర్యలు లేకపోవడం వల్ల దేశంలో ఒక్కసారి వ్యవసాయ రంగం కుప్పకూలి పోయింది. గ్రామీణ ప్రాంతాల ప్రజల చేతుల్లో పెద్ద నోట్లు చెల్లకుండా పోవడంతోపాటు చేతుల్లో చిల్లిగవ్వ లేకుండా పోయింది. రోజువారి కూడు కోసం కావాల్సిన ఉప్పు, పప్పుల కొనుగోలు కూడా కష్టమైంది. పదివేల మంది కాల్చివేత..! అప్పటికే వరి పంట చేతికి రావడంతో గ్రామీణ ప్రజలకు వస్తుమార్పిడి విధానం (బార్టర్) అమలు చేయాలనే ఆలోచన వచ్చింది. అప్పుడు అక్కడి ప్రజలు తమకు కావాల్సిన నిత్యావసర వస్తువులను బియ్యం ఇవ్వడం ద్వారా కొనుక్కోవడం ప్రారంభించారు. పర్యవసానంగా బియ్యం, అలాగే కూరగాయల ఎగుమతులు పట్టణాలకు నిలిచిపోయి అక్కడ తీవ్ర ఆహారం కొరత ఏర్పడింది. దీంతో దేశంలోని పట్టణ ప్రాంతంలో సరకుల దోపిడీలు, అల్లర్లు చెలరేగాయి. అల్లర్లను అదుపు చేయడానికి సైనికులు జరిపిన కాల్పుల్లో పదివేలకు మందికిపైగా ప్రజలు మరణించారు. ఎన్నో మంచి పనులు చేశారు..! అంతకుముందు దేశాధ్యక్షుడిగా పనిచేసిన నే విన్ 1987లో యాభై, వంద రూపాయల కియత్ నోట్లను రద్దు చేసినప్పుడు పాలకపక్ష ‘బర్మ సోషలిస్ట్ ప్రోగ్రామ్ పార్టీ’కి చైర్మన్‌గా కొనసాగుతూ దేశ ఆర్థిక వ్యవస్థను పర్యవేక్షిస్తున్నారు. పాలకపక్ష సోషలిస్ట్ పార్టీని ఏర్పాటు చేసిన ఆయన ఆర్మీ చీఫ్ కమాండర్‌గా, పార్టీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ప్రధాన మంత్రిగా కూడా పనిచేశారు. సోషలిజం కార్యక్రమం కింద ఆయన ఎన్నో మంచి ప్రజా సంక్షేమ పనులు చేశారు. ప్రైవేటు ఆస్పత్రులను జాతీయం చేయడంతోపాటు పలు ప్రభుత్వ ఆస్పత్రులను ఏర్పాటు చేసి ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించారు. ప్రభుత్వ విద్యాలయాలను ఏర్పాటు చేస్తూ కొత్త విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. భూ సంస్కరణలను తీసుకొచ్చి పేదలకు మేలు చేశారు. నల్లకుబేరుల పని పట్టాలి.. ఇలాంటి సోషలిస్టు భావాలు కలిగిన ఆయన నల్ల కుబేరుల పీచమణచాలనే ఉద్దేశంతో యాభై, వంద కియత్ నోట్లను అనూహ్యంగా రద్దు చేసి వాటి స్థానంలో 49, 90 కియత్ నోట్లను తీసుకొచ్చారు. ఈ కారణంగా దేశంలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడడం వల్ల నే విన్‌కు చెడ్డ పేరు వచ్చింది. 1963లో ఆయన దేశ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఈ 50, 100 నోట్లను రద్దు చేశారు. అప్పడు కూడా ఆయన ఆశించిన ఫలితాలు కాకుండా ప్రతికూల ఫలితాలు వచ్చాయి. అప్పటిలాగా కాకూడదనే ఉద్దేశంతో 1987లో సంఖ్యా శాస్త్రం విశ్వసించే నే విన్ ఓ సంఖ్యాశాస్త్ర జ్యోతిష్యుడిని సంప్రతించారు. తొమ్మిదో నెంబర్ కలిసి వస్తుందని జ్యోతిష్యుడు చెప్పడంతో 50, 100 నోట్ల స్థానాల్లో 49, 90 నోట్లను ప్రవేశపెట్టారు. దాంతో దేశంలో నియత ఆర్థిక వ్యవస్థ 50 శాతం దెబ్బతింది. అనియత వ్యవస్థ అంటే ప్రజల్లో నగదు సర్కులేషన్ సరిగ్గా 86 శాతం పడిపోయి, జాతీయ స్థూల ఉత్పత్తి దారుణంగా తగ్గిపోయి దేశంలో కల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. చివరికి రాజీనామా! కేవలం జ్యోతిష్యుడు మాట నమ్మి దేశ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేశారంటూ ప్రతిపక్ష పార్టీల నుంచే కాకుండా పాలకపక్ష పార్టీల నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తడంతో 1988, జూలై 23వ తేదీన పార్టీ చైర్మన్ పదవికి నే విన్ రాజీనామా చేశారు. -
ఆమె ఓ ఉత్తుంగ తరంగం
ఆమె ఒక ఉత్తుంగ తరంగం. వజ్రసంకల్పంతో నిలిచిన ఉక్కు మహిళ. రెండు దశాబ్దాలపాటు ఓ రాజకీయ ఖైదీ. అయితేనేం బాధిత జనాలకు ఆమె విజయ పతాక. విశ్వవ్యాప్తంగా ఉన్న స్వేచ్చాకాముకులకు ఆమె ఓ స్ఫూర్తి ప్రదాత. తన దేశ ప్రజల స్వేచ్చా, స్వాతంత్ర్యాల కోసం వ్యక్తిగత జీవితాన్ని పణంగా పెట్టి, సుదీర్ఘ యుద్ధం చేసిన అలుపెరుగని పోరాట యోధురాలు ఆమె. ఆమే మయన్మార్ ప్రతిపక్ష నేత, నోబెల్ అవార్డు గ్రహీత ఆంగ్ సాన్ సూకీ. మయన్మార్ (బర్మా)లో ప్రజాస్వామ్య సాధన కోసం నిత్యం తపిస్తూ, తాను నమ్మిన సిద్ధాంతాల కోసం చిత్తశుద్ధిగా, దృఢ సంకల్పంతో ముందుకు సాగిన జనహృదయనేత ఆంగ్ సాన్ సూకీ. నవంబర్ 8న మయన్మార్ లో సాధారణ ఎన్నిల జరగనున్న నేపథ్యంలో సూకీ ప్రస్థానాన్ని ఓ సారిచూద్దాం. జూన్ 19వ తేదీ 1945లో బర్మా రాజకీయ, సామాజిక హీరో ఆంగ్ సాన్ - డా ఖిన్ కీ లకు జన్మించింది సూకీ. రెండేళ్ళున్నపుడే ఆమె తండ్రి ఆంగ్ సాన్ హత్యకు గురయ్యాడు . తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ధీశాలి ఆమె. ఢిల్లీ యూనివర్శిటీలో పాలిటిక్స్ , బర్మా, భారత్ , యూకేలో విద్యాభ్యాసం చేసిన సూకీ, ఐక్యరాజ్య సమితిలో కూడా పని చేసింది. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ లో పరిచయం అయిన టిబెట్ స్కాలర్ మైఖేల్ ఆరిస్ ను 1972లో వివాహమాడింది. వారికి అలెగ్జాండర్ ,కిమ్ కొడుకులు. తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న తన తల్లికి సేవ చేయడానికి స్వదేశానికి తిరిగి వచ్చిన సూకీ, సైనిక ప్రభుత్వం వందలాదిమంది విద్యార్థులను కాల్చి చంపిన ఘటనతో చలించిపోయారు. అంతే స్వదేశ ప్రజాస్వామ్య పోరాటంలో మునిగిపోయింది. అప్పటినుంచి సూకీ వెన్ను చూపిందిలేదు. ఎంత అణచివేత ఎదురైనా , సైనిక ప్రభుత్వం ఎలాంటి క్రూర అకృత్యాలకు పాల్పడినా లక్ష్యాన్ని వీడలేదు. ఈ పట్టుదలే 1988 లో సెప్టెంబరు 24న ప్రో డెమాక్రెటిక్ పార్టీ అయిన నేషనల్ లీగ్ ఫర్ డెమాక్రసీ ఆవిర్భావానికి నాంది పలికింది. పార్టీకి జనరల్ సెక్రటరీగా ఆంగ్ సాన్ సూకీ ఎన్నికయ్యారు. దేశవ్యాప్తంగా స్వేచ్చ, ప్రజాస్వామ్యాల కోసం రాజకీయ ఉద్యమాలు ఉధృతమయ్యాయి. ఎంత హింస చెలరేగినా, ఎన్ని వేలమందిని మిలటరీ ప్రభుత్వం పొట్టనపెట్టుకున్నా ప్రజలు ఆమెకు వెన్నుదన్నుగా నిలిచారు. 1990 ఎన్నికల్లో సూకీకి ఘన విజయాన్నందించారు. ప్రజల్లో ఆమెకున్న అపూర్వ ఆదరణకు ఇదే నిదర్శనం. దీన్ని జీర్ణించుకోలేని మిలిటరీ ప్రభుత్వం సూకీని గృహనిర్బంధంలో ఉంచింది. 1995లో గృహనిర్బంధం నుండి విడుదల చేయబడినా, ఆమె ప్రయాణం చేయడాన్ని నిషేధించింది ప్రభుత్వం. ఆమె సంపూర్ణంగా, బర్మాను విడిచిపెట్టి వెళ్ళిపోతే స్వేచ్చగా వెళ్ళనిస్తామని తెలిపింది. ఈ ప్రతిపాదనను సూకీ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ఫలితం మళ్లీ గృహనిర్బంధం. ఇంతలో ఆమె భర్త మైఖేల్ ఏరిస్ మార్చి 27, 1999న కేన్సర్ తో మరణించాడు. మరణించే ముందు భార్యను ఒకసారి కలవనివ్వమని ఎంతగా ప్రాధేయపడినా, బర్మా ప్రభుత్వం కర్కశంగా వ్యవహరించి అనుమతిని నిరాకరించింది. ఐక్యరాజ్యసమితి జోక్యంతో 2002 మే 6 న దేశ పర్యటన చేయడానికి అనుమతితో విడుదలైన సంవత్సరానికే 2003లో మళ్లీ దాడిచేసి ఆమెను బందీని చేసింది బర్మా ప్రభుత్వం. తిరిగి రంగూన్ ఇంసేయిన్ జైలులో బంధించబడింది. 2010లో నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీని సైతం నిషేధించారు. చివరికి వివిధ అంతర్జాతీయ సంస్థలు, ప్రపంచ దేశాల ఒత్తిళ్లు, నిరసనల నేపథ్యంలో 2010 నవంబరు 13 ఆమె నిర్బంధం నుంచి బయటకు వచ్చింది. అనంతరం ప్రజాస్వామ్య పరిరక్షణలో వివిధ దేశాల మద్దుత కోసం నిర్విరామంగా తన పోరాటాన్ని కొనసాగిస్తోంది. మయన్మార్‌లో బలమైన ప్రజాస్వామ్యం కోసం వివిధ దేశాల మద్దుతను కూడగట్టే పనిలో భాగంగా భారత్ లాంటి దేశాల్లో పర్యటించారు. దాదాపు 50 ఏళ్లపాటు సైనిక పాలనలో మగ్గిన మయన్మార్‌లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో అనేక సవాళ్లు, ప్రతిసవాళ్ల మధ్య సూకీ బృందం ఎన్నికల బరిలోకి దిగుతోంది. వారి ముందున్న సవాళ్ళు అనేకం. ప్రజాప్రయోజనాలకు అనుకూలంగా కార్యాచరణ రూపొందించుకోవాలి. సంస్కరణల దిశగా అడుగులు వేయాలి. అంతర్జాతీయ మీడియా, దేశాలు ఆమె కార్యాచరణపై కచ్చితంగా దృష్టి సారిస్తాయి. ఈ క్రమంలో 'నేనెపుడూ ఆశావాదినే ... కాలమే చెప్తుంది' అన్న ఆమె మాటల ప్రకారం మయన్మార్ ప్రజలకు మంచి రోజులు వస్తాయని... రావాలని ఆశిద్దాం. అటు పొరుగు దేశం నేపాల్ లో మహిళ దేశాధినేతగా అధికార పగ్గాల చేపట్టిన తరుణంలో మయన్మార్ ఎన్నికలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. నోబెల్ పీస్ ప్రైజ్, యూరోపియన్ పార్లమెంటు నుండి సఖరోవ్ ప్రైజ్, యునైటెడ్ స్టేట్స్ నుంచి ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ మొదలైన అంతర్జాతీయ అవార్డులెన్నో ఆమెను వరించాయి. -
నేడు అంతర్జాతీయ కాందిశీకుల దినోత్సవం
-
తెలుగు వణిజులు
గణపతిదేవుని జైత్రయాత్రల వల్ల 12వ శతాబ్దిలో కోస్తాంధ్ర కాకతీయుల ఆధిపత్యంలోకి వచ్చింది. వరంగల్లు ఆంధ్రనగరి అయింది. 5వ శతాబ్దంలో అడుగంటిన విదేశీ వాణిజ్యం 10వ శతాబ్దికి మళ్ళీ పుంజుకుంది. కళింగపట్టణం (ముఖలింగం), భీమునిపట్టణం, కోకండిపర్రు (కాకినాడ), నరసాపురం, హంసలదీవి, మోటుపల్లి, కాల్పట్టణం (ఒంగోలు వద్ద పాదర్తి), కృష్ణపట్నం, గండగోపాలపట్టణం (పులికాట్) మొదలైనవి ప్రముఖ ఓడరేవులుగా ఎదిగాయి. ఆంధ్రవర్తకులు సంఘాలుగా ఏర్పడి బర్మా, థాయ్‌లాండ్, మలేసియా, ఇండోనేసియా, వియెత్నాం, చైనా దేశాలతో నౌకా వాణిజ్యం సాగించారు. ఎర్రసముద్రం, గల్ఫ్ దేశాల నుండి వచ్చే అరబీ వర్తకులు గుర్రాలు, తగరం, దంతం, ఆయుధాలు ఆంధ్రరేవులకి తెచ్చి ఇక్కడి నుంచి సుగంధ ద్రవ్యాలు, నూలు, పట్టువస్త్రాలు కొనుగోలు చేసేవారు. ఆంధ్రతీరాన్ని పరిపాలించిన రాజులకు రేవు వర్తకం నుంచి కస్టమ్స్, సేల్స్ టాక్స్ ద్వారా వచ్చే ఆదాయం చాలా ముఖ్యమైనది. అడ్డపట్టం, చీరాను, గండం, పవడం, పట్టి అనే పేర్లతో అనేక పన్నులు ఉండేవి. బంగారం విలువ నిర్ణయించేందుకు పొన్ను వెలగాళ్ళనే అధికారులు ఉండేవారు. ప్రతి రేవు వద్దా సుంకాధికారులతో కూడిన అధికార యంత్రాంగం ఉండేది. వర్తకులకు పన్నుల వివరాలు, వర్తకాన్ని ప్రోత్సహించే స్కీముల వివరాలు తెలిపే శాసనాలు రేవు పట్టణాలలో కనిపిస్తాయి. క్రీ.శ. 1150లో కాకతీయ గణపతిదేవుడు, 1280లో రెడ్డిరాజు అనపోతయరెడ్డి మోటుపల్లిలో వేయించిన శాననాలు వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు వర్తకులకు ఇచ్చిన సదుపాయాలు, హామీలు, పన్నులపై మినహాయింపులు తెలుపుతాయి. మోటుపల్లికి వచ్చిన వర్తకులకి ఉచితంగా గృహాలు, గిడ్డంగులకి భూములూ ఇచ్చి ప్రోత్సహించారు. హరవిలాసం అంకితం తీసుకున్న అవచి తిప్పయశెట్టి గురించి శ్రీనాథుడు చెప్పిన ఈ పద్యం ఆనాటి వైశ్యులు సాగించిన విదేశీ వాణిజ్యానికి అద్దం పడుతుంది. తరుణాసీరి తవాయి గోప రమణా స్థానంబులం జందనా గరు కర్పూర హిమంబు కుంకుమ రజఃకస్తూరికా ద్రవ్యముల్ శరధిస్ కల్పలి, జోంగు, వల్లి వలికా సమ్మన్ల, దెప్పించు నే ర్పరియై వైశ్యకులోత్తముం డవచి తిప్పండల్పుడే యిమ్మిహన్ ఇందులో తరుణసీరి బర్మాలోని తెన్నసెరిం, తవాయి థాయ్‌లాండ్, రమణా అంటే బర్మాలో రామన్న దేశం అనే రంగూన్ ప్రాంతం. ఇవేగాక, పంజారం అంటే సుమత్రాదీవిలోని పాన్సార్, యాంప అంటే శ్రీలంకలోని జాఫ్నా, బోట అంటే భూటాన్, హరుమూజి అంటే గల్ఫ్‌లోని హోర్ముజ్; ఇలా అనేక విదేశీ రేవుల ప్రస్తావన హరవిలాసంలో కనిపిస్తుంది. కప్పలి, జోంగు మొదలైనవి ఆనాటి ఓడల్లో రకాలు. కప్పలి నేటి తమిళనాడులో కనిపించే కప్పళ్, జోంగ్ ఇంగ్లిష్‌లో జన్క్ అనబడే చైనా నౌక, వల్లీ, వలికా అనేవి వణిజ అనే పదం నుండి వచ్చిన తెలుగు వర్తకుల నావలు. సమ్మన్ అంటే చైనావాళ్ళ చిన్న నౌక సాంపాంగ్. క్రీ.శ. 1194లో రుద్రమదేవి పాలనలో ఉన్న మోటుపల్లిలో దిగిన వెనిస్ యాత్రికుడు మార్కోపోలో, చైనా రేవుల్లో ఇండియా నౌకలే అతి పెద్దవి అన్నాడు. అప్పు ఎగవేస్తే అది వసూలు చేసుకునేందుకు దొరికిన వాడి చుట్టూ గిరిగీసి వీధిలో నిలబెట్టడం అనే ఆచారాన్ని మోటుపల్లిలో చూసినట్లు మార్కోపోలో రాశాడు. ఎంతటి రాజయినా సరే అప్పు తీర్చడమో లేదా ఏదైనా పరిష్కారమో చూపి ఋణదాత ఒప్పుకుంటేనే తప్ప ఆ గీసిన గీత దాటలేడని చెప్పాడు.