చంటి బిడ్డ‌లా మొస‌లిని మోస్తున్నాడు | Watch: Man Carries Alligator Like a Kid In Florida | Sakshi
Sakshi News home page

చంటి బిడ్డ‌లా మొస‌లిని మోస్తున్నాడు

Jun 12 2020 8:25 PM | Updated on Mar 21 2024 4:31 PM

ఫ్లోరిడా: పామును ప‌ట్టాలంటే ధైర్యం ఉండాలి, మ‌రి మొస‌లిని ప‌ట్టాలంటే.. అంత‌కు రెట్టింపు గుండె ధైర్యం అవ‌స‌రం. అలాంటిది.. ఓ వ్య‌క్తి చంటిపిల్లాడిని చంకనేసుకుని వెళ్లిన‌ట్లుగా మొస‌లిని భుజానికేసున్నాడు. ఓ టిక్‌టాక్ యూజ‌ర్ ఈ వీడియోను షేర్ చేయ‌గా విప‌రీతంగా వైరల్ అవుతోంది. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన‌ ఓ వ్య‌క్తి మొస‌లిని పెంచుకుంటున్నాడు. దానికి ముద్దుగా స్వీటీ అని పేరు పెట్టుకున్నాడు. అందంగా క‌నిపించేందుకు ఎల్లో టీ ష‌ర్ట్ కూడా వేసాడండోయ్‌. దాన్ని ఎత్తుకోగానే అది కూడా ఆనందంగా తోకూపుతూ బుద్ధిగా న‌డుచుకుంది. అనంత‌రం అత‌డు దాన్ని తీసుకుని రెస్టారెంట్ లోప‌లికి వెళ్లాడు. 

కాగా ఈ స్వీటీ అడ‌విలో గాయ‌ప‌డ్డ స్థితిలో మోర్ హెడ్ అనే వ్య‌క్తి కంట ప‌డింది. దీంతో అత‌డు దాన్ని ర‌క్షించి సాయం అందించాడు. అదే స‌మ‌యంలో మొస‌లికి క‌ళ్లు క‌నిపించ‌వు అని తెలిసింది. అలాంటి దీన స్థితిలో మొస‌లిని అడ‌విలో వ‌దిలిపెట్టడానికి అత‌నికి మ‌న‌సొప్ప‌లేదు. దీంతో దాన్ని ఇంటికి తీసుకు వ‌చ్చి క‌న్న‌బిడ్డ‌లా పెంచుకుంటున్నాడు. టిక్‌టాక్‌లో లైకుల వ‌ర్షం కురిపిస్తున్న ఈ వీడియోను చూసి కొంద‌రు అబ్బుర‌ప‌డుతుంటే మ‌రికొంద‌రేమో భ‌యంతో వ‌ణికిపోతున్నారు. 

Advertisement
 
Advertisement

పోల్

Advertisement