సాధారణంగా అరుదుగా కనిపించే ఓ అతి పెద్ద మమొసలి రోడ్డు సమీపంలో తిరుగుతూ కనిపించింది. ఫ్లోరిడాలోని కోలియర్ కౌంటీ సమీపంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం అంతర్జాతీయ రహదారి 75 పక్కన ఉన్న ఆర్మీ కంచె వద్ద మొసలి చక్కర్లు కొడుతూ స్థానికంగా ఉన్న సైనికులను ఆశ్చర్యానికి గురిచేసింది. కంచెకు ఆనుకొని మోసలి సంచరిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో దాదాపు 7వేల మంది దీన్ని వీక్షించారు. (టీవీ నటుల ఛాలెంజ్.. నెటిజన్ల మండిపాటు)
Troopers met this large🐊on Alligator Alley in Collier County this morning! Way to atleast stay in the grass shoulder and out of the travel lanes! pic.twitter.com/L9SsC63mDI
— FHP SWFL (@FHPSWFL) April 26, 2020
‘కోలియర్ కంటి సమీపంలో ఈ అలిగేటర్ కనిపించింది. రోడ్డుపై వాహనాలకు అడ్డురాకుండా గడ్డిలో వెళ్లుతూ ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తోంది.’ అంటూ అధికారులు మొసలి వీడియోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోను చూసిన అనేక మంది మోసలిని చూసి భయభ్రాంతులకు గురవుతున్నారు. మొసలి భారీ స్థాయిలో ఉందని కామెంట్ చేస్తున్నారు. కాగా ఇటీవల ఫ్లోరిడా అధికారులు మోసళ్లను వెతకాలని పౌరులను హెచ్చరించారు. ‘ఇది మోసళ్లకు సంభోగం కాలం. ఈ సమయంలో అవి చాలా చురుకుగా ఉంటాయి’ అని తెలిపిన అధికారులు తొమ్మిది అడుగుల పొడవైన మోసలి ఫోటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.(నేను అతన్ని ప్రేమిస్తున్నాను: హీరోయిన్)
Comments
Please login to add a commentAdd a comment