![మనిషి మృతదేహాన్ని పీక్కుతిన్నాయి..](/styles/webp/s3/article_images/2017/09/4/81464693581_625x300.jpg.webp?itok=JyL9JVi3)
మనిషి మృతదేహాన్ని పీక్కుతిన్నాయి..
న్యూయార్క్: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం దక్షిణప్రాంతంలో పోలీసులకు భయంకరమైన దృశ్యం కనిపించింది. మొసలి జాతికి చెందిన రెండు ఎలిగేటర్లు ఓ మనిషి మృతదేహాన్ని పీక్కుతింటున్నాయి. పోలీసులు అతికష్టమ్మీద వాటిని అక్కడ నుంచి తోలేసి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
సోమవారం రాత్రి జాలర్లు మొదట ఈ దృశ్యాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని చర్యలు చేపట్టారు. కొంతకాలంగా అక్కడ నీటిలో ఓ వ్యక్తి మృతదేహం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. మృతిచెందిన వ్యక్తి ఆ ప్రాంతానికి ఎందుకు వచ్చారు? ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఎవరైనా హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సిఉందని డేవీ పోలీస్ అధికారులు పాబ్లో కాస్తనెడా, కెప్టెన్ డేల్ ఈంగల్ చెప్పారు.