పుట్లూరు: బంగారు తల్లిని ముళ్లపొదలో విసిరేశారు. అప్పుడేపుట్టి.. కనీసం నిండుగా శ్వాసైనా పీల్చుకోని ఆడశిశువు చెట్ల పొదల్లో కనిపించిన సంఘటన శుక్రవారం తెల్లవారుజామున అనంతపురం జిల్లా పుట్లూరు మండల కేంద్రంలో చోటుచేసుకుంది.
పుట్లూరులోని కస్తూర్భా పాఠశాల విద్యార్థినులు ఈ రోజు తెల్లవారు జామునే పాఠశాల భవనానికి సమీపంలోని చెట్ల పొదల్లో ఒక శిశువు పడిఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనాస్థలికి వచ్చిన పోలీసులు.. పాపను ఆసుపత్రికి తీసుకెళ్లారు. పాప ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ దారుణానికి ఒడిగట్టింది ఎవరనేది ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగులకోసం గాలిస్తున్నారు.
ముళ్లపొదలో బంగారు తల్లి..!!
Published Fri, Aug 28 2015 8:56 AM | Last Updated on Fri, Jun 1 2018 8:31 PM
Advertisement
Advertisement