పిచ్చికుక్క స్వైరవిహారం
పిచ్చికుక్క స్వైరవిహారం
Published Sun, Aug 21 2016 7:32 PM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM
కరీంనగర్‌రూరల్: కరీంనగర్ మండలం చెర్లభూత్కుర్‌లో ఆదివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఓ పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. గ్రామంలో కనిపించిన వారిపైనా దాడి చేసింది. ఈ ఘటనలో ఎనిమిది మందితోపాటు ఆవుకు గాయాలయ్యాయి. కుక్కదాడిలో ఒంటెల యశోద అనే వృద్ధురాలు తీవ్రంగా గాయపడగా.. ఆమెను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అరుణ్‌సాయి, ఆదిత్య, శ్రీలత, సుహాసిని, నరేందర్‌లను 108 సిబ్బంది కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందించారు. గ్రామస్తులు పిచ్చికుక్కను చంపివేశారు.
Advertisement
Advertisement