Shock power
-
టీడీపీ నేత తోట కంచెకు విద్యుత్ సరఫరా.. షాక్‌తో మహిళ మృతి
వి.కోట(చిత్తూరు జిల్లా): టీడీపీ నాయకుడికి చెందిన మామిడి తోటకు వేసిన కంచెకు విద్యుత్ సరఫరా కావడంతో షాక్‌కు గురై ఓ మహిళ మృతిచెందారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా వి.కోట మండలం కేపీ బండ గ్రామంలో సోమవారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం... వి.కోట మండలంలోని యాలకల్లు గ్రామ పంచాయతీ కేపీ బండ గ్రామంలో అహ్మద్ జాన్ తన భార్య ఆసిఫా (35), ఇద్దరు కుమార్తెలతో కలిసి నివాసం ఉంటున్నారు. వారి ఇంటి బాత్రూమ్కు అత్యంత సమీపంలో టీడీపీ నాయకుడు, సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు చక్రపాణి నాయుడుకు చెందిన మామిడి తోట ఉంది.దానికి చుట్టూ ఇనుప కంచెను ఏర్పాటుచేశారు. తోటలోని విద్యుత్ మోటర్‌కు సంబంధించిన స్టార్టర్‌ను ఆ ఇనుప కంచెకు అమర్చారు. వైర్లను పక్కనున్న స్తంభానికి చుట్టారు. ఈ క్రమంలో ఆసిఫా స్నానం చేసి బయటకు వస్తూ మామిడి తోట ఇనుప కంచెను తగిలారు. ఆ కంచెకు కరెంటు సరఫరా కావడంతో ఆమె షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందారు. స్టార్టర్కు సంబంధించిన వైర్లు తెగి ఇనుప కంచెపై పడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు భావిస్తున్నారు. తోట యజమానిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. -
విద్యుత్ స్తంభంపైనే ఆగిన ఊపిరి
ఆదిలాబాద్ రూరల్: ఓ ఇంటికి విద్యుత్ సరఫరాలో సమస్య తలెత్తడంతో మరమ్మతులు చేసేందుకు కరెంట్ స్తంభం ఎక్కిన ప్రైవేటు ఎలక్ట్రీషియన్.. దానిపైనే షాక్‌కు గురై మృతిచెందాడు. ఆదిలాబాద్ జిల్లా రాములుగూడలో ఈ ఘటన జరిగింది. ఆదిలాబాద్ రూరల్ మండలం యాపల్‌గూడ గ్రామ పంచాయతీ పరిధిలోని రాములుగూడ గ్రామానికి చెందిన దడంజే మోతీరాం (35) కొన్నేళ్లుగా ప్రైవేట్ ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం ఓ ఇంటికి విద్యుత్ సరఫరా లేకపోవడంతో మోతీరాంను పిలిచారు. ఆయన వచ్చి సరఫరాను పునరుద్ధరించేందుకు విద్యుత్ స్తంభం ఎక్కాడు.అయితే పైనుంచి వెళ్తున్న త్రీఫేజ్ విద్యుత్ తీగలు తగలడంతో షాక్‌కుగురై అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మోతీరాం మృతితో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు ఘటనాస్థలికి చేరుకుని ఆందోళన చేశారు. తమకు పరిహారం చెల్లించే వరకు మృతదేహాన్ని కిందకు దించొద్దని డిమాండ్ చేశారు. విద్యుత్ అధికారులు అక్కడికి రావడం ఆలస్యం కావడంతో మోతీరాం మృతదేహం స్తంభంపైనే నాలుగు గంటలపాటు ఉండిపోయింది. పోలీసులు, విద్యుత్ అధికారులు బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.మోతీరాం కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా మోతీరాం మృతికి.. తమకు ఎలాంటి సంబంధం లేదని మండల విద్యుత్ శాఖ అధికారి తిరుపతిరెడ్డి తెలిపారు. విద్యుత్ స్తంభంపైకి ఎక్కిన మోతీరాం తమ లైన్‌మన్, జూనియర్ లైన్‌మన్‌కు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని పేర్కొన్నారు. -
కాటేసిన కరెంటు తీగ
కృష్ణరాజపురం: బెస్కాం అధికారుల నిర్లక్ష్యం వల్ల కరెంటు తీగ తెగి పడి ఉండగా, దానిని తొక్కిన తల్లీ, బిడ్డ ఇద్దరు విద్యుత్ షాక్‌తో ప్రాణాలు వదిలారు. ఈ ఘోరం ఎక్కడో మారుమూల గ్రామంలో కాదు, సిలికాన్ సిటీలో జరిగింది. మహాదేవపుర నియోజకవర్గంలోని వైట్‌ఫీల్డ్‌లో ఉన్న హోప్ ఫార్మ్ సర్కిల్లో చోటు చేసుకుంది. మృతులు సౌందర్య (23), ఆమె కూతురు సుభిక్ష లియా(9 నెలలు). నడిచి వెళ్తుండగా వివరాలు.. సౌందర్య భర్త సంతోష్ ప్రైవేటు ఉద్యోగి, సంతోష్ స్వస్థలం తమిళనాడులోని ఊటీ కావడంతో అక్కడే ఉంటున్నారు. సౌందర్య ఆదివారం డిప్లొమా పరీక్ష రాయాల్సి ఉండడంతో భర్త, కూతురితో కలిసి బెంగళూరుకు వచ్చారు. ఉదయం 5 గంటలప్పుడు ఏకేజీ కాలనీలో ఉండే సౌందర్య అమ్మవారి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ సమయంలో హోప్‌ఫార్మ్ కూడలిలో రోడ్డు పక్కన కరెంటు స్తంభం వైరు తెగి పడి ఉంది, దానిని చూడకుండా సౌందర్య తొక్కడంతో విద్యుదాఘాతం తగిలి మంటలు లేచాయి. సౌందర్య, ఆమె ఎత్తుకుని ఉన్న చిన్నారి బిడ్డ కరెంటు షాక్, మంటలతో క్షణాల్లోనే విగతజీవులయ్యారు. ఇద్దరూ పాక్షికంగా కాలిపోయారు. ఇదంతా భర్త కళ్ల ముందే జరిగిపోయింది. సంతోష్ గట్టిగా కేకలు వేయడంతో జనం పోగయ్యారు. వారి కుటుంబ సభ్యులు కూడా పరుగున అక్కడికి చేరుకుని ఎంత ఘోరం జరిగిపోయిందని విలపించారు. కాడుగోడి పోలీసులు చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. మంత్రి జార్జ్ విచారం బనశంకరి: కరెంటు షాక్‌తో తల్లీబిడ్డ మృతి ఘటనపై ఇంధన ఽశాఖ మంత్రి కేజే.జార్జ్ ట్విట్టర్లో స్పందిస్తూ దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి రూ.5 లక్షలు పరిహారం అందిస్తామని తెలిపారు. ప్రమాదంపై విచారణ చేపడతామని, నిర్లక్ష్యానికి కారణమైన సంబంధిత ఏఈ, ఏఈఈని సస్పెండ్ చేశామన్నారు. ఇంకా ఎవరైనా కారకులు ఉంటే నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బెస్కాం సిబ్బందిపై కేసు, విచారణ ఆ పరిధిలోని ఐదు మంది బెస్కాం అధికారులపై కేసు నమోదైంది. లైన్మెన్, ఏఈ, ఈఈ, ఏఈఈ, జేఈ తదితరులపై హత్యానేరం కేసు నమోదు చేశారు. డీసీపీ శివకుమార్ గుణారె మాట్లాడుతూ బాధ్యులైన బెస్కాం అధికారులపై విచారణ చేపడతామని చెప్పారు. ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. సాధారణంగా రోడ్డు పక్కల ప్రైవేటు టెలికాం కంపెనీల ఫైబర్ ఆప్టిక్ తీగలు తెగిపడి ఉంటాయి, వాటిని తొక్కినా ఏమీ కాదు. సౌందర్య కూడా అలాగే అనుకుని ఉంటారని పోలీసులు అన్నారు. గతేడాది కూడా కరెంటు తీగలు తగిలిన ప్రమాదాల్లో ఓ మహిళ, యువకుడు మరణించారు. -
ఎంతపని చేశావ్ దేవుడా..! తీవ్ర విషాదం..!!
వికారాబాద్: ఏడుగురు కూతుళ్ల తర్వాత పుట్టిన ఒక్కగానొక్క కుమారుడిని విద్యుత్ ప్రమాదం పొట్టన పెట్టుకున్న విషాదకర సంఘటన వికారాబాద్ జిల్లా దోమ పీఎస్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దతండాకు చెందిన నేనావత్ చందర్, జెమినీబాయి దంపతులకు ఏడుగురు కూతుళ్లు, ఒక కుమారుడు సంతానం. కూతుళ్ల వివాహాలను ఘనంగా చేసిన ఆయన.. అందరిలో చిన్నవాడైన కొడుకు రాము(22) పెళ్లి జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇందులో భాగంగా బ్రాహ్మణపల్లిలో కుమారుడి కోసం నూతన గృహాన్ని నిర్మిస్తున్నాడు. ఈ క్రమంలో రాము ఇంటిపై ఉన్న స్టీల్‌రాడ్‌ను కిందికి తీసుకువస్తుండగా పైనున్న హైటెన్షన్ తీగలకు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. క్షణాల్లో ప్రాణాలు విడిచి విగతజీవిగా పడిపోయాడు. చిన్ననాటి నుంచి అల్లారుముద్దుగా చూసుకుంటున్న తమ కుమారుడి మరణాన్ని తట్టుకోలేని చందర్ దంపతులు ఎంత పని చేశావ్ దేవుడా.. అంటూ కన్నీరుమున్నీరయ్యారు. పోస్టుమార్టం నిమిత్తం రాము మృతదేహాన్ని పరిగి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవిగౌడ్ తెలిపారు. -
విద్యుత్ షాక్ నుంచి అమ్మాయిని కాపాడిన ఆర్టిఫిషియల్ గోళ్లు
సాధారణంగా విద్యుత్ షాక్ తగిలినవారు తీవ్రంగా గాయాలపాలు కావడమో లేదా మృతి చెందడమో జరుగుతుండటాన్ని మనం చూసేవుంటాం. అయితే ఇటీవల ఒక కాలేజీ యువతికి విద్యుత్ షాక్ తగిలి 4 అడుగుల దూరం ఎగిరిపడంది. అయితే ఇంత జరిగినా ఆమెకు చిన్నపాటి గాయం కూడా కాకపోవడం విశేషం. ఈ విచిత్ర ఉదంతం ఇంగ్లండ్‌లో చోటుచేసుకుంది. తనకు ఎదురైన అనుభవం గురించి బాధితురాలు మాట్లాడుతూ తాను నకిలీ గోళ్లు పెట్టుకున్నకారణంగా విద్యుత్ షాక్ నుంచి బయటపడ్డానని తెలిపింది. 21 ఏళ్ల నికోల్ ఫోర్‌మ్యాన్ అనే యువతి ఇంటిలోని బాయిలర్ సరిచేసేందుకు ప్రయత్నిస్తుండగా కరెంట్ షాక్‌కు గురయ్యింది. బాయిలర్‌ను బంద్ చేయకుండానే నీటిని వేడి చేసి, స్నానం చేసేందుకు ఆ నీటిలో కాలు మోపింది. వెంటనే ఆమె షాక్‌నకు గురయ్యింది. ఎడిన్బర్గ్ క్వీన్ మార్గరిట్ యూనివర్శిటీలో చదువుకుంటున్న ఆ యువతి..‘షాక్ తగిలిన వెంటనే నాలుగు అడుగుల దూరం ఎగిరిపడ్డాను. తరువాత స్పృహ కోల్పోయానని’ తెలిపింది. ఇంటిలోని వారు ఆమెను గమనించి వెంటనే బాధితురాలని ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆమెను పరీక్షించి, ఆమె పెట్టుకున్న నకిలీ గోళ్ల కారణంగానే ఎంతో ప్రమాదకరమైన విద్యుత్ షాక్ నుంచి బయటపడిందని తెలిపారు. ప్రమాదం నుంచి బయటపడిన నికోల్..‘మా అమ్మ నా ఆర్టిఫిషిల్ గోళ్లను చూసి నన్ను తెగ మందలించేది. అయితే ఇప్పుడు ఆ గోళ్లే తనను కాపాడాయని తెలుసుకుని సంతోషపడుతోందని’ తెలిపింది. ఇది కూడా చదవండి: భూమిపై ఎలియన్స్?.. ప్రకంపనలు పుట్టిస్తున్న నిఘా విభాగం మాజీ అధికారి వాదన! -
తెగిపడిన చేయి.. అంతా క్షణాల్లోనే..
కడప అర్బన్: కడపలోని అక్కాయపల్లిలో శనివారం రాత్రి విద్యుత్‌షాక్‌తో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తాలూకా సీఐ ఎం. నాగభూషణం కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అక్కాయపల్లిలోని సొంత ఇంటిలోని రెండో అంతస్తులో నివాసం ఉంటున్న షేక్ ఆరిపుల్లా, భార్య ఫరీదాలకు ముగ్గురు కుమార్తెలు. ఆరిపుల్లా ప్రస్తుతం కువైట్‌లో ఉన్నాడు. ప్రతీ రోజూ చెత్తను, ఇతర వస్తువులను, కూరగాయలను బకెట్లో పెట్టి పైకి, కిందికి తీసుకుని వస్తుంటారు. ఈక్రమంలో ఆ బకెట్‌కు పాత విద్యుత్ వైరును కట్టి ఉంచారు. ఈనెల 3వ తేదీ రాత్రి మూడో కుమార్తె అయేషా(12) చెత్తబుట్టను కిందకు వేసింది. బకెట్ విద్యుత్ వైర్లకు తగలడంతో షాక్‌కు గురైంది. ఈక్రమంలోనే స్టీల్ పైపునకు చేయి తగలడం, తెగిపడటం క్షణాల్లో జరిగిపోయాయి. సంఘటన జరిగిన వెంటనే తల్లి ఫరీదా(37) కుమార్తెను పట్టుకోవడంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. స్థానిక ప్రజల సాయంతో విద్యుత్ సరఫరా ఆపించారు. గాయపడిన వారిని రిమ్స్‌కు తరలించారు. మెరుగైన చికిత్సకోసం క్రిస్టియన్‌లేన్‌లోని హోలిస్టిక్ ఆసుపత్రిలో చేర్పించారు. కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు. చదవండి: బందరులో బాలిక కిడ్నాప్ కలకలం అనిత వీడియో: అడ్డంగా బుక్కైన మంత్రి -
మృత్యువు దుర్‘మార్గం’!
=విద్యుదాఘాతంతో కింద పడిపోయిన యువకుడు =రహదారి లేక వైద్యం ఆలస్యం =ఆస్పత్రికి తరలించేలోగా మృతి మూడు ముళ్ల బంధం మూన్నాళ్లయినా లేదు. కొత్త జీవితం మాధుర్యాన్ని పూర్తిగా అనుభవించనే లేదు. మృత్యువు విద్యుత్ తీగ రూపంలో దాడి చేసింది. ఆస్పత్రికి తీసుకెళ్దామంటే రహదారి లేదు. రవాణా సదుపాయం అసలే లేదు. డోలీ కట్టి ఏడు కిలోమీటర్ల దూరం మోసుకుపోయారు. అష్టకష్టాలు పడి ఆస్పత్రిలో చేర్చారు. అప్పటికే ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. పాతికేళ్ల యువకుని జీవితానికి నూరేళ్లు నిండిపోయాయి. పాడేరు మండలం వంజంగి పంచాయతీ కొత్తవలస గ్రామంలో శుక్రవారం జరిగిందీ విషాదం. పాడేరు రూరల్, న్యూస్‌లైన్: రోడ్డు, రవాణా సదుపాయం లేక, సకాలంలో ఆస్పత్రికి తరలించలేకపోవడంతో విద్యుదాఘాతానికి గురైన ఓ గిరిజనుడు ప్రాణం కోల్పోయాడు. మృతుని భార్య మల్లమ్మ కథనం ప్రకారం ఒడిశా ప్రాంతంలోని కాదేడి గ్రామానికి చెందిన గిరిజనుడు పాంగి వెంకటరావు (25) పాడేరు మండలం వ ంజంగి పంచాయతీ కొత్తవలస గ్రామానికి చెందిన మల్లమ్మను గత ఏడాది వివాహం చేసుకున్నాడు. రెండు వారాల క్రితం భార్యభర్తలిద్దరు కొత్తవలస గ్రామానికి వచ్చారు. మల్లమ్మ ఇంటికి విద్యుత్ సరఫరా చేసేందుకు వెంకటరావు శుక్రవారం ఉదయం గ్రామంలోని ఓ విద్యుత్ స్తంభం ఎక్కాడు. ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలడంతో విద్యుదాఘాతానికి గుైరె కిందనున్న బండరాయిపై పడ్డాడు. తీవ్రంగా గాయపడిన వెంకటరావును ఆస్పత్రికి తరలించేందుకు రోడ్డు, రవాణా సదుపాయం లేకపోవటంతో గ్రామస్తులు డోలీ కట్టుకొని గ్రామం నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలోని వంజంగి గ్రామానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి ఓ ప్రయివేటు జీపులో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సకాలంలో ఆస్పత్రికి తీసుకొస్తే భర్త దక్కేవాడని మృతుని భార్య క న్నీటిపర్యంతమైంది. ఈ సంఘటనపై పాడేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒడిశా నుంచి మృతుని కుటుంబ సభ్యులు రావలసి ఉన్నందున మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు.