=విద్యుదాఘాతంతో కింద పడిపోయిన యువకుడు
=రహదారి లేక వైద్యం ఆలస్యం
=ఆస్పత్రికి తరలించేలోగా మృతి
మూడు ముళ్ల బంధం మూన్నాళ్లయినా లేదు. కొత్త జీవితం మాధుర్యాన్ని పూర్తిగా అనుభవించనే లేదు. మృత్యువు విద్యుత్ తీగ రూపంలో దాడి చేసింది. ఆస్పత్రికి తీసుకెళ్దామంటే రహదారి లేదు. రవాణా సదుపాయం అసలే లేదు. డోలీ కట్టి ఏడు కిలోమీటర్ల దూరం మోసుకుపోయారు. అష్టకష్టాలు పడి ఆస్పత్రిలో చేర్చారు. అప్పటికే ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. పాతికేళ్ల యువకుని జీవితానికి నూరేళ్లు నిండిపోయాయి. పాడేరు మండలం వంజంగి పంచాయతీ కొత్తవలస గ్రామంలో శుక్రవారం జరిగిందీ విషాదం.
పాడేరు రూరల్, న్యూస్‌లైన్: రోడ్డు, రవాణా సదుపాయం లేక, సకాలంలో ఆస్పత్రికి తరలించలేకపోవడంతో విద్యుదాఘాతానికి గురైన ఓ గిరిజనుడు ప్రాణం కోల్పోయాడు. మృతుని భార్య మల్లమ్మ కథనం ప్రకారం ఒడిశా ప్రాంతంలోని కాదేడి గ్రామానికి చెందిన గిరిజనుడు పాంగి వెంకటరావు (25) పాడేరు మండలం వ ంజంగి పంచాయతీ కొత్తవలస గ్రామానికి చెందిన మల్లమ్మను గత ఏడాది వివాహం చేసుకున్నాడు.
రెండు వారాల క్రితం భార్యభర్తలిద్దరు కొత్తవలస గ్రామానికి వచ్చారు. మల్లమ్మ ఇంటికి విద్యుత్ సరఫరా చేసేందుకు వెంకటరావు శుక్రవారం ఉదయం గ్రామంలోని ఓ విద్యుత్ స్తంభం ఎక్కాడు. ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగలడంతో విద్యుదాఘాతానికి గుైరె కిందనున్న బండరాయిపై పడ్డాడు. తీవ్రంగా గాయపడిన వెంకటరావును ఆస్పత్రికి తరలించేందుకు రోడ్డు, రవాణా సదుపాయం లేకపోవటంతో గ్రామస్తులు డోలీ కట్టుకొని గ్రామం నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలోని వంజంగి గ్రామానికి తీసుకొచ్చారు.
అక్కడి నుంచి ఓ ప్రయివేటు జీపులో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సకాలంలో ఆస్పత్రికి తీసుకొస్తే భర్త దక్కేవాడని మృతుని భార్య క న్నీటిపర్యంతమైంది. ఈ సంఘటనపై పాడేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒడిశా నుంచి మృతుని కుటుంబ సభ్యులు రావలసి ఉన్నందున మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు.
మృత్యువు దుర్‘మార్గం’!
Published Sat, Jan 4 2014 1:38 AM | Last Updated on Sat, Sep 2 2017 2:15 AM
Advertisement
Advertisement