code numbers
-
విత్తన ప్రాసెసింగ్ ప్లాంట్లకు కోడ్ నంబర్లు
సాక్షి, హైదరాబాద్: విత్తన ప్రాసెసింగ్ ప్లాం ట్లకు కోడ్ నంబర్లు, రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తూ వ్యవసాయశాఖ మంగళవారం ఉత్తర్వులిచ్చింది. రాష్ట్ర విత్తన సేంద్రియ ధ్రువీకరణ సంస్థకు ఈ అధికారాన్ని కల్పిం చింది. నాణ్యమైన విత్తనాన్ని రైతులకు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్న ట్లు శాఖ కార్యదర్శి సి.పార్థసారథి ఉత్త ర్వులో పేర్కొన్నారు. ‘రాష్ట్రంలో ప్రమా ణాలు పాటించకుండా విత్తన ప్రాసెసింగ్ ప్లాంట్లు నడుస్తున్నాయన్న అంశం వ్యవసా య శాఖ దృష్టికి వచ్చింది. వాటిల్లో ప్రాసెస్ అయిన విత్తనాలు నాణ్యంగా ఉండటం లేదు. పైగా రిజిస్ట్రేషన్ లేకుండానే అనేక విత్తన ప్రాసెస్ ప్లాంట్లునడుస్తున్నాయి. ఈ పరిస్థితిని సరిదిద్ది వాటిని నియంత్రించేం దుకు రిజిస్ట్రేషన్, కోడ్ నంబర్ తప్పనిసరి చేస్తున్నాము’అని ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కేశవులు ‘సాక్షి’కి తెలిపారు. కోడ్ నంబరు ఉన్న విత్తనాన్నే కంపెనీలు రైతుల కు విక్రయించాలని, లేకుంటే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చ రించారు. -
వాహన రిజిస్ట్రేషన్లపై గందరగోళం
ఆదిలాబాద్ క్రైం : తెలంగాణ రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్లకు సంబంధించి జిల్లాల వారీగా కోడ్ నంబర్లు కేటాయించడంతో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మూడు రోజులుగా జిల్లాలో కొత్త రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. ఏపీ సిరీస్ టీఎస్ సిరీస్‌గా మారడంతో పాత వాహనదారులు అయోమయంలో పడ్డారు. టీఎస్ సిరీస్‌తో కొత్త రిజిస్ట్రేషన్లు సజావుగానే సాగుతున్నా పాత వాహనాల విషయంలోనే ఇంక స్పష్టత రాలేదు. ఏపీ రిజిస్ట్రేషన్ వాహనాలను టీఎస్ సిరీస్‌తో మార్పు చేసుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. దీనికి నాలుగు నెలలు మాత్రమే గడువు ఇచ్చింది. స్పష్టమైన విధివిధానాలేవి? పాత వాహనాల ఏపీ సిరీస్‌ను టీఎస్ సిరీస్‌లోకి మార్చుకోవాలని ప్రభుత్వం ప్రకటించినా దీనిపై స్పష్టమైన విధి విధానాలు అందకపోవడంతో రవాణా శాఖ కార్యాలయంలో గందరగోళం నెలకొంది. పాత వాహనాలన్నింటినీ నాలుగు నెలల్లోగా కొత్త సిరీస్‌లోకి మార్చుకునేందుకు గడువు ఇచ్చారు. పాత వాహనాల నంబర్ల మార్పు విషయంలో రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుందా.. నంబర్ ప్లేట్ మారితే కొత్త ఆర్సీ బుక్కుకు రుసుము ఉంటుందా.. నంబరు ప్లేటు మార్చుకొని కొత్త నంబరు ప్లేటు తీసుకుంటే అయ్యే ఖర్చు ఎవరు భరించాలి..? అనే విషయాలపై అధికారులకు ఇంక స్పష్ట మైన ఆదేశాలు రాలేదు. దీంతో పాత వాహనాల నంబర్లు మార్చుకునేందుకు వస్తున్న వాహనదారులు నిరాశగా వెనుదిరగాల్సి వస్తోంది. పాత వాహనాల నంబర్ల మార్పుపై తమకేలాంటి ఆదేశాలు అందలేదని అధికారులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా... జిల్లావ్యాప్తంగా మూడు రోజుల్లో సుమారు 300ల వాహనాలు కొత్తగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇందులో ఫ్యాన్సీ నంబర్లపై 20 వాహనాలు రిజిస్ట్రేషన్ జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రవాణా వాహనాలకు టీఎస్ 01 యూఏ 0001, రవాణేతర వాహనాలకు టీఎస్ 01 ఈఏ0001 సంఖ్యతో రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఇక పాత వాహనాల విషయానికొస్తే జిల్లాలో అన్ని రకాల వాహనాలు కలిపి 1,30,016 లక్షల వరకు ఉన్నాయి. వీటిలో ద్విచక్రవాహనాలు 95,437, ఆటోరిక్షాలు 7,780, గూడ్స్ క్యారేజ్‌లు 5,203, కార్లు 4,864, మోపెడ్లు 3, 714, ట్రాక్టర్లు(ప్రైవేట్ )2,554, ట్రాక్టర్లు కమర్షియల్ 2,134, జీపులు 575, మోటర్ క్యాబ్‌లు 1189 ఉన్నాయి. వీటి రిజిస్ట్రేషన్లు ప్రస్తుతం ఏపీ 01 సిరీస్ కోడ్‌పై కొనసాగుతుండగా, నాలుగు నెలల్లో టీఎస్‌గా మార్చుకోవాలని ప్రభుత్వం సూచించింది. వాహనాల నంబ ర్లు కూడా మారుతుందనే ప్రచారం జరగడంతో వాహనదారులు అయోమయంలో పడ్డారు. కొత్త రిజిస్ట్రేషన్ల చార్జీలు పెంచకపోవడంతో ప్రసుత్తం పాత వాహనాల చార్జీలతో రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ద్విచక్ర వాహనాలకు రూ.400, కారులకు రూ. 625, మోటర్ క్యాబ్‌లకు రూ. 860, హెవీ గూడ్స్లకు రూ.1,360 చొప్పున రవాణా శాఖ అధికారులు రిజిస్ట్రేషన్ ఫీజులు వసూలు చేస్తున్నారు. జిల్లాలో ప్రతి నెల రిజిస్ట్రేషన్లతో రూ.20 లక్షల ఆదాయం సహకూరుతోంది. -
పాత నంబర్లపై అయోమయం!
* కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు మొదలు * పాత వాహనాల నంబరు మార్పుపై గందరగోళం * స్పష్టమైన ఆదేశాలు లేవంటున్న అధికారులు * తొలి రోజు వాహనదారులను తిప్పి పంపిన సిబ్బంది * విధివిధానాలకు కమిటీ వేయాలని నిర్ణయం * తొలి రోజు 3,900 వాహనాల నమోదు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్లకు సంబంధించి జిల్లాల వారీగా కోడ్ నంబర్లు కేటాయించడంతో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. కానీ ఇప్పటికే ఏపీ సిరీస్‌తో రిజిస్టర్ అయి ఉన్న పాత వాహనాల విషయంలో అయోమయం నెలకొంది. ఆ వాహనాలన్నింటిని కూడా.. కొత్తగా కేటాయించిన టీఎస్ సిరీస్‌లోకి మార్చుకోవాలని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన విధివిధానాలు అందకపోవటంతో రవాణా శాఖ కార్యాలయాల్లో గందరగోళం నెలకొంది. పాత వాహనాలన్నింటిని నాలుగు నెలలలోపు కొత్త సిరీస్‌లోకి మార్చుకోవాలని ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రక్రియకు సంబంధించి ఎలాంటి రుసుము ఉండదని పేర్కొంది. కానీ నంబర్ ప్లేట్ మారితే ఆర్సీ బుక్కును మార్చుకోవాలి. ప్రస్తుత ఆర్సీ బుక్కు స్థానంలో కొత్త నంబరుతో కొత్త బుక్కు ఇవ్వటానికి రుసుము ఉండదా? నంబరు ప్లేటు మార్చుకుని కొత్త నంబరు ప్లేటు తీసుకుంటే అయ్యే ఖర్చు ఎవరు భరించాలి? ప్రస్తుతం హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ విధానం అమలులో ఉండటం... అది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావటంతో ఆ మొత్తాన్ని ఎవరు భరించాలి? తదితర సందేహాలకు అధికారుల వద్ద సమాధానాలు లేవు. దీంతో బుధవారం కార్యాలయాలకు వచ్చి వాకబు చేసిన వాహనదారులను తర్వాత చెప్తామంటూ రవాణా శాఖ అధికారులు తిప్పిపంపారు. కమిటీ ఏర్పాటు? ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఏపీ సిరీస్‌తో రిజిస్టర్ అయిన వాహనాలు 73 లక్షలున్నాయి. తాజా ఆదేశం మేరకు వాటన్నింటిని టీఎస్ సిరీస్‌లోకి మార్చాలి. అన్ని వాహనాలకు కొత్త ఆర్సీ బుక్కులివ్వాలి. ఇదంతా పెద్ద ప్రహసనం. నంబర్ ప్లేటుపై స్టేట్ సిరీస్, జిల్లా కోడ్ నంబరు మార్చుకోవటం పెద్ద పని కాదు. కానీ ఆ వివరాలను అధికారిక పుస్తకాల్లో నమోదు చేయటం, సంబంధిత కాగితాలను వాహనదారులకు ఇవ్వటం సులభంగా జరిగేది కాదు. ఇందుకోసం ఏకంగా సాఫ్ట్‌వేర్‌లోనే మార్పులు చేయాలి. దీనికి సంబంధించి తొలుత విధివిధానాలను రూపొందించాలి. దీనిపై ఓ కమిటీ వేసి నివేదిక తెప్పించుకోవాలని రవాణా శాఖ నిర్ణయించినట్టు సమాచారం. అయితే ప్రస్తుతం రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి హిమాచల్‌ప్రదేశ్‌లో ఉండటంతో నేరుగా సీఎం కేసీఆర్‌తో చర్చించాల్సి ఉంది. పెండింగ్‌లో 17 వేల దరఖాస్తులు... అపాయింటెడ్ డే అయిన జూన్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోవటంతో అన్ని జిల్లాల్లో భారీగా దరఖాస్తులు పేరుకుపోయాయి. తాత్కాలిక రిజిస్ట్రేషన్ల తంతు పూర్తి చేసుకుని పూర్తిస్థాయి రిజిస్ట్రేషన్ల కోసం 17 వేలకుపైగా దరఖాస్తులందాయి. బుధవారం నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కావటంతో వీటిని పరిష్కరించే పనిలోపడ్డారు రవాణా సిబ్బంది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 3,900 వాహనాలను రిజిస్ట్రేషన్ చేశారు. ఇందులో పెండింగ్ దరఖాస్తులు పోను బుధవారమే అందిన దరఖాస్తులు దాదాపు వెయ్యి వరకు ఉన్నాయి. ఒక్క హైదరాబాద్‌లోనే (అన్నీ కలిపి) 1,866 వాహనాలకు రిజిస్ట్రేషన్ చేశారు. ఆదిలాబాద్‌లో 176, ఇబ్రహీంపట్నంలో 171, కరీంనగర్లో 120, ఖమ్మంలో 321, మహబూబ్‌నగర్‌లో 221, మంచిర్యాలలో 49, సంగారెడ్డిలో 43, మేడ్చల్‌లో 95, నల్లగొండలో 102, నిజామాబాద్‌లో 67, రంగారెడ్డి ఈస్ట్‌లో 91, సిద్దిపేటలో 27, వరంగల్‌లో 50 వాహనాలకు రిజిస్ట్రేషన్ చేశారు. హైదరాబాద్ నగరంలో తొలి రిజిస్ట్రేషన్ జరుపుకొన్న వాహనాని(కారు)కి టీఎస్ 09 ఈఏ 0002 నంబరును కేటాయించారు. టీఎస్ 09 ఈఏ 0001, 0006, 0009, 0011, 0066, 0099, 0111 నంబర్లను తన అవసరం కోసం ప్రభుత్వమే బ్లాక్ చేసుకుంది. -
సేవలకు సెలవు
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రభుత్వానికి సంబంధించి దాదాపు అన్ని రకాల సేవలు నిలిచిపోయాయి. మూడు రోజులపాటు ఈ సేవలు ప్రజలకు అందే అవకాశం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జూన్ రెండు నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోతున్నందున రెండు రాష్ట్రాలకు వేర్వేరుగా అన్ని శాఖలకు చెందిన కొత్త అకౌంట్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది. కొత్త ఖాతాలు, కోడ్ నెంబర్లు కేటాయించి ఆన్లైన్లో అనుసంధానం చేసేందుకు వీలుగా అన్ని శాఖల సేవలను నిలిపివేశారు. ఈ నెల 31, జూన్ ఒకటి తేదీల్లో సేవలు నిలిపివేస్తామని.. రెండో తేదీన అవి పునఃప్రారంభమవుతాయని అధికారులు ప్రకటించినప్పటికీ.. ఆరోజు కార్యాలయాలు తెరిచి సర్వర్లు ఆన్ చేసి.. ఖాతాలు, కోడ్ నెంబర్లు తెలుసుకునేసరికే పుణ్యకాలం గడిచిపోతుందని, అందువల్ల ఆ రోజు కూడా సేవల పునరుద్ధరణ సాధ్యం కాకపోవచ్చని ప్రభుత్వ సిబ్బంది చెబుతున్నారు. ముఖ్యంగా మీ సేవ, ఈ సేవ కేంద్రాలు పని చేయకపోవడం వల్ల దాదాపు అన్ని రకాల ప్రభుత్వ సేవలు నిలిచిపోయినట్లే. దీంతోపాటు మున్సిపల్, రిజిస్ట్రేషన్, రవాణా సేవలు శుక్రవారం సాయంత్రం పనివేళలు ముగిసిన వెంటనే నిలిచిపోయాయి. ఖజానా శాఖలో మార్పుచేర్పుల కోసం నాలుగు రోజుల క్రితమే కార్యకలాపాలు నిలిపివేశారు. ప్రభుత్వానికి సంబంధించి అన్ని రకాల బిల్లుల స్వీకరణ, చెల్లింపులు నిలిచిపోయాయి. కొత్త ఖాతాలు ప్రారంభమయ్యే వరకు చెల్లింపులు జరగవని తెలియడంతో పలు అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అందించే సేవలు.. భూములు, ఇళ్ల రిజిస్ట్రేషన్లు, తనఖాలు, వివాహా ధ్రువపత్రాలు, ఈసీలు, నకళ్ల జారీ వంటి సేవలు కూడా స్తం భించాయి. దీంతో ఆస్తుల క్రయవిక్రయాలు, వివాహ రిజిస్ట్రేషన్లు జరగక ప్రజలు ఇబ్బంది పడే అవకాశముంది. కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆదాయం కూడా నిలిచిపోనుంది. మీ సేవ, ఈ సేవ కేంద్రాల్లో కార్యకలాపాలు నిలిచిపోవడంతో మెజారిటీ ప్రభుత్వ సేవలు నిలిచిపోయినట్లే. అత్యధిక ప్రభుత్వ శాఖల లావాదేవీలను ఈ కేంద్రాలతో అనుసంధానం చేయడం వల్ల గత రెండేళ్లుగా ప్రజలు అన్ని రకాల సేవలను వీటి ద్వారానే పొందుతున్నారు. రెవెన్యూ, మున్సిపాలిటీ, విద్యుత్, పోలీసు శాఖలతోపాటు పలు ఇతర శాఖల సేవలకు సంబంధించి సుమారు వంద రకాల సేవలు మీ సేవ ద్వారానే అందుతున్నాయి. జూన్ రెండో తేదీ వరకు ఇవన్నీ నిలిచిపోతాయి. జూన్రెండు ఆ తరువాత కొత్త ఖాతాలు, కోడ్ నెంబర్లతో పునఃప్రారంభమవుతాయి.