వేములపల్లి : మొల్కపట్నం గ్రామంలో నర్సరీని పరిశీలిస్తున్న అధికారులు
సాక్షి, వేములపల్లి : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమానికి అధికారులు మొక్కలను సిద్ధం చేస్తున్నారు. మండలంలోని ఏడు గ్రామాల్లో నర్సరీలను ఏర్పాటుచేసి వన సేవకులు మొక్కలను పెంచుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఐదవ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామ పం చాయతీలో 40వేల నుంచి లక్ష మొక్కలు నాట డమే లక్ష్యంగా అధికారులు పనుల్లో నిమగ్నమయ్యారు. మండలంలోని ఆయా గ్రామాల్లో ఏర్పాటుచేసిన నర్సరీల్లోఅటవీశాఖ ఆధ్వర్యంలో లక్షలాది మొక్కల పెంపకం శరవేగంగా జరుగుతుంది.
ఉపాధిహామీ పథకంలో భాగంగా మరికొన్ని నర్సరీల్లో మొక్కల పెంపకాన్ని చేపడుతున్నారు. మండలంలోని మంగాపురం గ్రామంలో 30వేల మొక్కలు, సల్కునూరులో 40వేలు, ఆమనగల్లు, శెట్టిపాలెం, రావులపెంట, వేములపల్లి, బుగ్గబావిగూడెం, లక్ష్మీదేవిగూడెం గ్రామాల్లో 50వేల చొప్పున, కామేపల్లి, అన్నపరెడ్డిగూడెం, తిమ్మారెడ్డిగూడెం గ్రామాల్లో 20వేల చొప్పున మొక్కలను నాటేందుకు అధికారులు నిర్ణయించారు.
నాటిన ప్రతి మొక్క బతికేవిధంగా చర్యలు
నర్సరీల్లో పెంచిన మొక్కలను మండలంలోని ఆయా గ్రామాల్లో నాటిన తరువాత నాటిన ప్రతి మొక్క బతికి పెరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకోనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమయ్యే జామ, ఉసిరి, నిమ్మ, సీతాఫలం, దానిమ్మ, వెలిగ, బొప్పాయి, మునగ, గోరింట, కరివేపాకు, మారేడు, పీటోపాల్, డెకోమా, టేకు లాంటి వివిధ రకాల మొక్కలను అందించనున్నా రు. ఆయా గ్రామాల్లోని నర్సరీల్లో సంచులలో మట్టిని నింపేందుకు, మొక్కలకు నీటిని చల్లేం దుకు, మొక్కల మధ్య కలుపు తీసే పనులకు అధి కారులు ఉపాది కూలీలను వినియోగిస్తూ పలు కుటుంబాలకు జీవనాధారాన్ని కల్పిస్తున్నారు.
జూన్ నాటికి మొక్కలు సిద్ధం
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న హరితహారం కార్యక్రమాన్ని వర్షాకాలంలో ప్రారంభించనున్నందున జూన్ నాటికి ఆయా గ్రామాల్లో మొక్కలను నాటేందుకు సిద్ధంగా ఉన్నాం. ఆయా గ్రామాల్లో ఉపాధిహామీ పథకంలో భాగంగా మండలం లోని ఆరు నర్సరీల్లో సంచులలో మట్టిని నింపి విత్తనాలు వేశాం. అధికారులు ఎప్పటికప్పుడు నర్సరీలను పరిశీలించి వన సేవకులకు తగు సూచనలు చేస్తూ వర్షాకాలం ఆరంభంనాటికి మొక్కలు సిద్ధంగా ఉంచేలా చర్యలు తీసుకుంటున్నాం.
– శ్రీనయ్య, ఏపీఓ
Comments
Please login to add a commentAdd a comment