తూత్తుకుడి స్టెరిలైట్ ప్లాంట్ (ఫైల్‌ఫోటో)
సాక్షి, చెన్నై: ప్రజా ఉద్యమానికి తమిళనాడు ప్రభుత్వం ఎట్టకేలకు దిగివచ్చింది. తూత్తుకుడి స్టెరిలైట్ ప్లాంట్‌ను శాశ్వతంగా మూసివేసేందుకు ప్రభుత్వం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్లాంట్ శాశ్వత మూసివేతకు అవసరమైన చర్యలను ప్రభుత్వం చేపడుతుందని అంతకుముందు తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం హామీ ఇచ్చారు.
ప్రజాభీష్టం మేరకు స్టెరిలైట్ ప్లాంట్‌ను శాశ్వతంగా మూసివేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. స్టెరిలైట్ ఫ్లాంట్ విస్తరణను వ్యతిరేకిస్తూ గత వారం స్థానికులు తీవ్రస్థాయిలో నిరసన తెలిపిన విషయం విదితమే. ఈ సందర్భంగా జరిగిన ఘటనల్లో 13మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment