Tuticorin
-
ట్యుటికోరిన్ కోల్ బిడ్డింగ్‌పై జిందాల్ పవర్‌కు చుక్కెదురు
న్యూఢిల్లీ: ట్యుటికోరిన్ కోల్ టెర్మినల్ (టీసీటీ) బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు అనుమతించాలంటూ జిందాల్ పవర్ (జేపీఎల్) చేసిన విజ్ఞప్తిని నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) తిరస్కరించింది. నిబంధనల ప్రకారం పరిష్కార ప్రక్రియను సమర్పించేందుకు జేపీఎల్‌కు అర్హత లేదంటూ ఎన్సీఎల్టీ ముంబై బెంచ్ ఇచి్చన ఉత్తర్వులను సమర్ధించింది. కంపెనీకి గరిష్ట విలువను రాబట్టడమే దివాలా కోడ్ (ఐబీసీ) లక్ష్యం అయినప్పటికీ .. దరఖాస్తుదారుల తుది జాబితాలో లేని కంపెనీలకు మధ్యలో ప్రవేశం కలి్పంచడానికి నిబంధనలు అంగీకరించవని పేర్కొంది. తుది జాబితాలోని సీపోల్ సమర్పించిన బిడ్‌పై తగు నిర్ణయం తీసుకోవాలంటూ పరిష్కార నిపుణుడు (ఆర్పీ), రుణదాతల కమిటీ (సీవోసీ)కి ఎన్సీఎల్ఏటీ సూచించింది. రుణ పరిష్కార ప్రక్రియలో భాగంగా టీసీటీని కొనుగోలు చేసేందుకు సీపోల్ గతేడాది ఫిబ్రవరి 18న ప్రణాళిక సమరి్పంచింది. దాన్ని రుణదాతల కమిటీ (సీవోసీ) పరిశీలిస్తుండగానే దాదాపు అదే సమయంలో బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు తమకు కూడా అవకాశం కలి్పంచాలంటూ జూలై 12న జేపీఎల్ కోరింది. అయితే, బిడ్డింగ్‌కు అనుమతిస్తూనే.. సీఐఆర్‌పీ నిబంధనలకు అనుగుణంగా అనుమతులు ఉంటాయంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ తెలిపింది. దీనిపై సందిగ్ధత నెలకొనడంతో స్పష్టతనివ్వాలంటూ ఆర్పీ కోరారు. దీంతో జేపీఎల్‌కు అర్హత ఉండదంటూ ఎన్సీఎల్టీ స్పష్టతనిచ్చింది. ఈ ఉత్తర్వులనే సవాలు చేస్తూ ఎన్సీఎల్ఏటీని జేపీఎల్ ఆశ్రయించింది. -
రూ.31.67 కోట్ల అంబర్గ్రిస్ స్వాధీనం
న్యూఢిల్లీ: డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు తమిళనాడులోని ట్యుటికోరన్‌లో అత్యంత ఖరీదైన అంబర్గ్రిస్(తిమింగలం వాంతి)ని పట్టుకున్నారు. ట్యుటికోరన్‌లోని హార్బర్ బీచ్ ఏరియా నుంచి శ్రీలంకకు ఓ ముఠా అంబర్‌గ్రీస్‌ను తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు అధికారులు సోదాలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఓ వాహనంలో తరలిస్తున్న 18.1కిలోల బరువైన అంబర్ గ్రిస్ సంచీ దొరికింది. ఇందుకు సంబంధించి తమిళనాడు, కేరళలకు చెందిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనమైన అంబర్గ్రిస్ విలువ రూ.31.67 కోట్లని అంచనా. సుగంధ ద్రవ్యాల తయారీలో వాడే అంబర్గ్రిస్కు అంతర్జాతీయ మార్కెట్లో ఎక్కువ గిరాకీ ఉంది. వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం స్పెర్మ్ వేల్ ఉత్పత్తుల ఎగుమతి, రవాణాలపై నిషేధం ఉంది. గత రెండేళ్లలో ట్యుటికోరన్ తీరంలో స్మగ్లర్ల నుంచి రూ.54 కోట్ల విలువైన 40.52 కిలోల అంబర్‌గ్రిస్‌ను పట్టుకున్నట్లు డీఆర్ఐ తెలిపింది. -
హిజ్రాపై దాష్టికం.. జట్టు కత్తిరించి చిత్రవధ చేస్తూ..
చెన్నై: హిజ్రాపై దారుణానికి తెగబడ్డ ఇద్దరు యువకులను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు పోలీసులు. ఓ హిజ్రాను పొలంలో చీర చించేసి.., జుట్టు కత్తిరించి.. చిత్రవధ చేస్తూ హింసించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తమిళనాడు ట్యూటికోరిన్లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. 19 సెకండ్ల నిడివి ఉన్న వీడియోలో.. బ్లేడ్‌తో హిజ్రా జుట్టును కోసేసి పొలంలో పడేశారు. ఆమె ముఖం దాడి మూలంగా ఛిద్రమైనట్లు కనిపిస్తోంది. ఆ పక్కనే మరో హిజ్రా ఉండగా.. దాడికి పాల్పడ్డ ఇద్దరు యువకులు ‘‘వీళ్లను చూడండి. ఇంతకాలం మగవాళ్ల నుంచి డబ్బు దోచుకున్నారు. ఇప్పుడు మనమేం చేయాలి? అంతా అయిపోయింది. వీళ్లేం అందంగా కనిపించడం లేదు కదా’’ అంటూ గట్టిగట్టిగా అరిచారు. Couple of trans women attacked by this goons @tnpoliceoffl @CityTirunelveli @TUTICORINPOLICE @sivagangapolice @mducollector @maduraipolice .Break your silence pic.twitter.com/HHwGuTJtI2 — GRACE BANU (@thirunangai) October 12, 2022 మరో వీడియోలో హిజ్రాలు నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు వైరల్ అయ్యింది. హిజ్రా హక్కుల ఉద్యమకారిణి గ్రేస్ బాను ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై తమిళనాడు సౌత్ జోన్ పోలీసులు స్పందించారు. నిందితులను నోవాహ్, విజయ్‌గా నిర్ధారించారు. ఆ ఇద్దరికి వీడియోలో ఉన్న హిజ్రాలు బాగా తెలుసని, వాళ్లలో ఓ జంటకు సంబంధం కూడా ఉందని, కానీ, విడిపోవడంతోనే ఇలా దాడి జరిగి ఉంటుందని భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందని వివరించారు. ఇదీ చదవండి: ఈరోజుల్లో ఇంత నిజాయితీగా బతుకుతున్నారా? -
దారుణం: టీవీ పెట్టమని అడిగినందుకు..
చెన్నై : ఎనిమిదేళ్ల చిన్నారి. ఆడుతూ, పాడుతూ గడిపే జీవితం. ఓ రోజు పక్కింటి వారి ఇంటికి వెళ్లడం ఆ పాప పాలిట మృత్యుపాశంగా మారింది. వివరాల్లోకెళితే.. మూడో తరగతి చదువుతున్న చిన్నారి తన తల్లితోపాటు చెన్నైలోని తూటికోరిన్ జిల్లాలో నివసిస్తోంది. ఇంట్లో టీవీ లేకపోవడంతో అప్పుడప్పుడు పక్కన వాళ్ల ఇంట్లోకి వెళ్లి చూసేది. ఇలా బుధవారం కూడా బాలిక పొరిగింటి వారి ఇంట్లోకి టీవీ పెట్టమని ఆశగా అడిగింది. అయితే అప్పటికే ఆ ఇంటి యాజమాని తన తండ్రితో ఏదో విషయంలో గొడవ పడుతున్నాడు. అదే సమయంలో పాప టీవీ పెట్టమని అడగంతో ఆ కోపాన్ని చిన్నారిపై చూపిస్తూ దారుణానికి ఒడిగట్టాడు. (పుట్టినరోజు డ్రెస్ కోసం బాలుడి ఆత్మహత్య) బాలిక గొంతు కోసి చంపి ఆమె శవాన్ని ప్లాసిక్ డ్రమ్‌లో కప్పి మూత పెట్టాడు. అనంతరం తన ఇంటి సమీపంలోని వంతెన వద్దకు వెళ్లి మృతదేహాన్ని నీటిలో పడేశాడు. మృతదేహాన్ని నీటిలో పడేయం చూసిన ఓ వ్యక్తి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నీటి నుంచి చిన్నారి మృతదేహాన్ని తీసి పోస్టుమార్టానికి తరలించారు. అనంతరం నిందితుడిని అతనికి సాయం చేసిన స్నేహితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపాను. పోక్సో చట్టం కింద నేరస్తునిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే బాలికపై అత్యాచారం జరిగిందా అనే కోణంలో పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురు చూస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. (అజయ్, శ్రావణిల ప్రేమ విషాదాంతం) -
తీవ్ర గాయాలు.. గంటల వ్యవధిలోనే మృతి
చెన్నై: తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టి సమీపంలోని సాత్తాన్‌కులానికి చెందిన తండ్రీకొడుకులు జయరాజ్(59), బెనిక్స్(31) పోలీసు కస్టడీలో ఒకరి తర్వాత ఒకరు మరణించడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సెల్‌ఫోన్ షాపు నిర్వహిస్తున్న వారిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్న కారణాలు, రిమాండ్‌కు తరలించే క్రమంలో వ్యవహరించిన విధానంపైనా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల దాష్టీకానికి అమాయకులు బలయ్యారంటూ అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతకుమందు జయరాజ్, బెనిక్స్లను కోవిల్ పట్టి సబ్ జైలులో పరీక్షించిన వైద్యులు ఓ జాతీయ మీడియా ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయాలు ఆగ్రహ జ్వాలలకు మరింత ఆజ్యం పోస్తున్నాయి. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో.. అనుమతించిన సమయానికి మించి మొబైల్ షాపు తెరిచే ఉంచారన్న కారణంతో జయరాజ్, బెనిక్స్ను గత శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం వారిని కోవిల్ పట్టి మెజిస్ట్రేట్ ఆదేశాలతో రిమాండ్‌కు తరలించారు. (‘జార్జ్ ఫ్లాయిడ్స్ ఆఫ్ ఇండియా’) ముఖాలు పాలిపోయి.. ఈ క్రమంలో సోమవారం ఉదయం సబ్ జైలు వద్ద తండ్రీకొడుకులను వైద్యులు పరీక్షించారు. అయితే, తమ దగ్గరికి వచ్చే ముందే తండ్రీకొడుకులిద్దరి వెన్ను భాగాలపై తీవ్ర గాయాలు ఉన్నాయని, వారి ముఖాలు కూడా పాలిపోయి ఉన్నాయని తెలిపారు. అయినప్పటికీ ఇద్దరూ తమ సెల్ నుంచి డాక్టర్ రూం వద్దకు నడిచే వచ్చారని చెప్పారు. ఆ సమయంలో ఫినిక్స్ మోకాలు ఒకటి బాగా ఉబ్బిపోయిందని చెప్పారు. జయరాజ్, బెనిక్స్లను కస్టడీలోకి తీసుకునే ముందు సత్తాన్‌కులం ప్రభుత్వాసుపత్రిలో నిర్వహించిన వైద్య పరీక్షలకు సంబంధించిన నివేదికను పరిశీలించగా... అందులో కూడా వారి ఒంటిపై గాయాలు ఉన్నట్టు తేలిందని పేర్కొన్నారు. (‘సెల్’ కోసమే దాష్టీకమా?) ఒకరు బీపీ, మరొకరు షుగర్ పేషెంట్ ఇక జయరాజ్ డయాబెటిస్తో, బెనిక్స్ హైపర్‌టెన్షన్‌తో బాధ పడుతున్నారని వారికి కొన్ని యాంటీ బయోటిక్స్ వాడాల్సిందిగా పోలీసులకు సూచించారు. అంతేకాదు జయరాజ్ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయనను సమీపంలో ఉన్న జనరల్ హాస్పిటల్‌కు తీసుకువెళ్లాలని అధికారులకు చెప్పారు. వారిద్దరి గాయాలకు డ్రెస్సింగ్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కానీ అదే రోజు రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో బెనిక్స్ ఆరోగ్యం క్షీణించిందని జైలు నుంచి సదరు డాక్టర్‌కు ఫోన్ కాల్ వచ్చింది. బెనిక్స్ ఒళ్లంతా చెమటతో తడిసిపోయిందని.. దడగా ఉందని చెబుతున్నాడని ఓ అధికారి డాక్టర్‌కు వివరించారు. దాంతో అతడిని ఆటోరిక్షాలో ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత కాసేపటికే బెనిక్స్ మరణించాడనే వార్త జైలు అధికారులకు అందింది. ఇక అదే సమయంలో జయరాజ్ ఆరోగ్యం కూడా క్షీణించడం, విపరీతమైన జ్వరం రావడంతో ఆస్పత్రికి తీసుకువెళ్లారు. కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని భావించారు. ఈ క్రమంలో మంగళవారం ఐదున్నర గంటల సమయంలో శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడిన జయరాజ్ కూడా మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే చనిపోవడానికి ముందు, అంతటి విపత్కర పరిస్థితుల్లోనూ బెనిక్స్ తనంతట తానే నడిచి వచ్చాడని అధికారులు చెప్పడం గమనార్హం. కాగా కస్టోడియల్ డెత్‌పై తీవ్రంగా స్పందించిన మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం ఈ ఘటనపై మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశించింది. -
‘జార్జ్ ఫ్లాయిడ్స్ ఆఫ్ ఇండియా’
చెన్నై: తమిళనాడులో తండ్రి కొడుకుల కస్టడీ మృతిపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు హింసించడంతో తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టి సమీపంలోని సాత్తానుకులం ప్రాంతానికి చెందిన జయరాజ్(59), ఆయన కొడుకు బెనిక్స్(31) మరణించినట్టు ఆరోపణలు వచ్చాయి. వీరి మరణానికి కారకులైన దోషులను చట్టప్రకారం శిక్షించాలన్న డిమాండ్ దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. సోషల్ మీడియాలోనూ #JusticeForJayarajandBennicks హ్యష్‌టాగ్‌తో ప్రముఖులు, నెటిజనులు న్యాయం కోసం నినదిస్తున్నారు. మాకు వాస్తవాలు కావాలి ‘జయరాజ్, బెనిక్స్ మరణవార్త విని హతశురాలిని అయ్యాను. చాలా కోపం వచ్చింది. ఇలాంటి క్రూరత్వానికి ఎవరూ పాల్పడరాదు. దోషులు తప్పించుకోకుండా చూడాలి. మాకు వాస్తవాలు కావాలి. ఇద్దరిని కోల్పోయిన మృతుల కుటుంబ సభ్యుల బాధను ఊహించడానికి కూడా సాహసించలేకపోతున్నాను. వారికి న్యాయం జరిగే వరకు మనమంతా సమైక్యంగా #JusticeForJayarajandBennicks హ్యష్‌టాగ్‌తో గళం వినిపిద్దామ’ని ప్రముఖ హీరోయిన్ ప్రియాంక చోప్రా ట్వీట్ చేశారు. హృదయ విదారకం గుజరాత్‌కు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాని ఈ సంఘటనను అమెరికాలో ఆఫ్రికన్-అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ హత్యతో పోల్చారు. ‘ప్రియమైన బాలీవుడ్ ప్రముఖులారా, తమిళనాడులో ఏం జరిగిందో మీరు విన్నారా లేదా మీ ఇన్స్టాగ్రామ్ యాక్టివిజం ఇతర దేశాలకు మాత్రమే విస్తరించిందా? జార్జ్ ఫ్లాయిడ్స్ ఆఫ్ ఇండియా చాలా ఎక్కువ మందే ఉన్నారు. ఇటువంటి పోలీసు హింస, లైంగిక వేధింపుల కథ హృదయ విదారకం’ అంటూ మేవాని ట్వీట్ చేశారు. (‘మై డాడీ ఛేంజ్డ్ ద వరల్ట్’) తమిళనాడు పోలీసుల కస్టడీలో తండ్రి, కొడుకుల మృతిపై ప్రముఖ క్రికెటర్ శిఖర్ ధవన్ కూడా ట్విటర్లో స్పందించాడు. ‘తమిళనాడులో జయరాజ్, బెనిక్స్ పై జరిగిన దారుణం గురించి విని భయపడ్డాను. మృతుల కుటుంబానికి న్యాయం జరిగేలా మనమంతా బలంగా గళం విన్పించాల’ని ధవన్ ట్విటర్లో పేర్కొన్నాడు. చట్టానికి ఎవరూ అతీతులు కారని, ఈ అమానవీయ చర్యకు పాల్పడిన వారిని శిక్షించి.. బాధితులకు న్యాయం చేయాలని తమిళ హీరో జయం రవి ట్విటర్లో డిమాండ్ చేశారు. అసలేం జరిగింది? అనుమతించిన సమయానికి మించి తమ మొబైల్ దుకాణాన్ని తెరిచివుంచారన్న కారణంతో పి జయరాజ్, అతని కుమారుడు బెనిక్స్ను గత శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. నాలుగు రోజుల తర్వాత ఆసుపత్రిలో వారిద్దరూ ఒకరి తర్వాత ఒకరు మరణించారు. సాత్తానుకులం పోలీస్‌స్టేషన్‌లో పోలీసు సిబ్బంది తీవ్రంగా కొట్టడం వల్లే జయరాజ్, అతడి కొడుకు చనిపోయారని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా, తాము అడిగిన సెల్ఫోన్లను ఇవ్వలేదన్న అక్కసుతోనే జయరాజ్, బెనిక్స్‌లపై పోలీసులు దాష్టీకాన్ని ప్రదర్శించినట్టు విచారణలో వెల్లడైంది. తండ్రి కొడుకుల లాకప్‌డెత్‌కు నిరసగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా వర్తకులు దుకాణాల బంద్ పాటించారు. జయరాజ్, బెనిక్స్లను కొట్టి చంపిన పోలీసులపై హత్య కేసు నమోదు చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. కస్టడీ మరణాలను తీవ్రంగా పరిగణించిన మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం ఈ ఘటనపై మేజిస్ట్రేట్ విచారణకు ఆదేశించింది. (‘సెల్’ కోసమే దాష్టీకమా?) -
నాలుగు నెలల్లో విచారణ ముగించాలి..
సాక్షి, చెన్నై: తూత్తుకుడి స్టెరిలైట్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పోలీసు కాల్పుల్లో 13 మంది మరణించిన ఉదంతంపై విచారణను మంగళవారం మద్రాస్ హైకోర్టు సీబీఐకి బదలాయించింది. నాలుగు నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలని సీబీఐని ఆదేశించింది. హింసను ప్రేరేపించారంటూ వామపక్ష సంస్థ మక్కల్ అధికారంకు చెందిన ఆరుగురు సభ్యుల అరెస్ట్ ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది. జాతీయ భద్రతా చట్టం కింద ఈ ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జస్టిస్ సీటీ సెల్వం, జస్టిస్ బషీర్ అహ్మద్‌ల నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. స్టెరిలైట్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో వేదాంత గ్రూప్‌నకు చెందిన ప్లాంట్‌ను మూసివేస్తున్నట్టు మే 22న తూత్తుకుడి జిల్లా యంత్రాంగం పేర్కొంది. -
తూత్తుకుడి మృతులకు రజనీ ఆర్థికసాయం
సాక్షి, చెన్నై: తూత్తుకుడి కాల్పుల మృతుల కుటుంబాలను సూపర్‌స్టార్ రజనీకాంత్ బుధవారం పరామర్శించారు. కాల్పుల్లో చనిపోయిన వారికి రూ.2 లక్షలు, గాయపడ్డవారికి పది వేల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. అనంతరం రజనీ మీడియాతో మాట్లాడుతూ.. తూత్తుకుడి ఘటన ప్రభుత్వానికి ఓ గుణపాఠం వంటిదన్నారు. ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అమాయక ప్రజల పట్ల స్టెరిలైట్ పరిశ్రమ యాజమాన్యం అమానుషంగా వ్యవహరించిందని ఆరోపించారు. ఆ పరిశ్రమను శాశ్వతంగా మూసివేయాలని డిమాండ్ చేశారు. నిరసనకారులపై కాల్పులు జరపడం చాలా పెద్ద తప్పన్నారు. ప్రజలంతా గమనిస్తున్నారని, సమయం వచ్చినప్పుడు తగిన బుద్ధి చెబుతారన్నారు. కాల్పులకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని కోరారు. స్టెరిలైట్ కాపర్ ప్లాంట్ విస్తరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన నిరసన కార్యక్రమం 100వ రోజు హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. నిరసనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 13 మంది మరణించారు. దాదాపు 65 మంది గాయపడ్డారు. -
తలకెక్కని ‘వేదాంత’ సారం
స్టెరిలైట్ కాపర్ వెదజల్లే కాలుష్యానికి వ్యతిరేకంగా ఈ సంవత్సరమే అక్కడ ఉద్యమం ప్రారంభం కాలేదు. ఇది మరొక యూనియన్ కార్బయిడ్ విషభూతం, ఇది మా పెరట్లోనే ఉందని చెబుతూ గడచిన ఇరవై ఏళ్ల నుంచి కూడా స్థానికులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. నిజానికి ఈ కర్మాగారాన్ని మొదట మహారాష్ట్ర, గోవా ప్రాంతాలలో నెలకొల్పాలని అనుకున్నారు. కానీ స్థానికులు, పర్యావరణ ఉద్యమకారులు తిరగబడడంతో, అంతిమంగా తమిళనాడుకు తరలించారు. 1994–96 మధ్య నాటి జయలలిత ప్రభుత్వం ఈ కర్మాగారాన్ని నెలకొల్పడానికి ఎందుకు అనుమతించిందో ఎవరికీ అంతుపట్టదు. సాధారణ దుస్తులలో ఉన్న ఇద్దరు పోలీసులు గురి చూసి పెట్టిన అసాల్ట్ రైఫిళ్లతో ఒక పోలీసు వాహనం మీద కనిపించిన దృశ్యమే ట్యుటికోరన్ మరణాల సంగతేమిటో నిర్వచిస్తుంది. ఆ పోలీసుల గురి స్టెరిలైట్ కాపర్ వ్యతిరేక ఆందోళనకారులే. తూటాలు తమను తాకుతాయని వారెవరికీ తెలియదు. కాలుష్యాన్ని వెదజల్లుతున్న ఆ కర్మాగారానికి వ్యతిరేకంగా వారు జరుపుతున్న నిరసన కార్యక్రమం వందోరోజుకు చేరిన సందర్భంగా ఆ జనం ట్యుటికోరన్ కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరారు. అప్పుడే కాల్పులు జరిగాయి. అయితే ఒక విషయం వినాలి. మే 22వ తేదీ రాత్రి ఏఎన్ఐ వార్తా సంస్థ విడుదల చేసిన ఆడియోలోని మాటలవి. అందులో ఉన్న మరొక గొంతు, బహుశా మరొక పోలీసు గొంతు కావచ్చు. అదే ఈ మొత్తం ఘట్టాన్ని ఒళ్లు గగుర్పొడిచేటట్టు చేసింది. ఈ హత్యలు ఒక ప్రణాళిక ప్రకారం జరిగినవని కూడా ఆ మాటల వల్ల రూఢి అవుతున్నది. ‘కనీసం ఒకడైనా చావాలి...’ అంటూ ఇచ్చిన సూచన అందులో వినపడుతుంది. ఇలాంటి పైశాచిక వాంఛ తమిళభాషలో ఒక కమాండో నోటి నుంచి వెలువడింది. ఆ ఆయుధం భగ్గుమంది. ఒక్కవారం లోపుననే ట్యుటికోరన్ ఆందోళనలలో 13 మంది చనిపోయారు. మృతుల శరీరాల మీద పొత్తికడుపు పై భాగంలోనే తూటాలు చేసిన గాయాలు కనిపించాయి. ట్యుటికోరన్లోనే మరొకచోట, మరొక వీడియో కూడా వెలుగుచూసింది. ఇందులో దయాదాక్షిణ్యాలు లేని ప్రభుత్వ వైఖరి కళ్లకు కడుతోంది. తుపాకీ తూటా తగిలి ప్రాణాలు కోల్పోయిన 22 ఏళ్ల ఒక యువకుడు రోడ్డు మీద పడిపోయాడు. ఒక పోలీసు తన లాఠీతో ఆ శవాన్ని కదుపుతూ అన్నాడు, ‘‘నాటకాలు చాలు, ఇక్కడ నుంచి పో!’’ ఇలాంటి పైశాచికత్వాన్ని ‘సామూహిక హత్యాకాండ’, రాజ్యహింస’ వంటి మాటలతో కాకుండా మరే ఇతర మాటలతో వర్ణించగలం? ఈ రెండు పదబంధాలను ఇప్పటికే ప్రతిపక్షాలు ఉపయోగించాయి కూడా. తన ప్రజల మీదే ప్రభుత్వం తుపాకులు ఎక్కుపెట్టిన చోటు అది. స్త్రీలు పురుషులు పక్షుల్లా రాలిపోవడం మొదలైన చోట ప్రభుత్వాలు నిందారోపణల రాజకీయం ఆరంభించిన సందర్భమది. గడచిన వారం ట్వీటర్లు దీనిని ‘టీఎన్ జలియన్ వాలాబాగ్’అని పేర్కొన్నారు. 99 సంవత్సరాల క్రితం జరిగిన ఆ ఘోర రక్తకాండ మాటలకందని విషాదం. అది కూడా (ఆనాటి) ప్రభుత్వ వైఖరిని చాటుతుంది. ట్యుటికోరన్ ఆందోళన హింసాత్మకమైన మాట నిజమే. అయితే అది హింసాత్మకమవుతుందన్న సూచనలు ముందే అందాయి. ఇంకా చెప్పాలంటే కాల్పుల ఘటనకు ముందు 99 రోజుల పాటు శాంతియుతంగానే జరిగిన ఆందోళన తమిళనాడు అధికార కేంద్రం సెయింట్ జార్జి కోటలో ఒక్క ఆకును కూడా కదపలేకపోయింది. అందుకే పతాక సన్నివేశంలో ప్రజల ఆవేశం కట్టలు తెంచుకుంది. ఈ ఉత్పాతం గురించి మొదటే గుర్తించినవారిలో మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రమేశ్ కూడా ఒకరు. వేదాంత గ్రూప్ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు జస్టిస్ రమేశ్ మే 22వ తేదీన 144వ సెక్షన్ విధించి నిషేధాజ్ఞలు అమలు చేయవలసిందిగా పరిపాలనా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఆందోళనకారులు ఆరోజే ఊరేగింపు నిర్వహించారు. ప్రజలంతా ఈ ఆందోళనలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ప్రజలందరికీ పంచిన కరపత్రాలను కూడా ఆయన పరిశీలించారు. ‘‘ఆందోళనకారులు శాంతియుతంగా ఉద్యమించే ఆలోచనలో లేరని అందులోని మాట లను బట్టి తెలుస్తున్నది’’ అని కోర్టు తన ఆదేశాలలో పేర్కొన్నది కూడా. ఆందోళన శాంతిభద్రతల సమస్యకు దారి తీయవచ్చునని, అందుకే 144 సెక్షన్ విధించాలని ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సూచించి నట్టు కూడా న్యాయస్థానం పేర్కొన్నది. జిల్లా యంత్రాంగానికి గూఢచారి నివేదికలు కూడా పోలీ సుల ద్వారా అందినట్టు సమాచారం ఉంది. ట్యుటికోరన్ కలెక్టర్ కార్యాలయం మీద విధ్వంసక దాడి జరగవచ్చునని ఆ సమాచారంలో తెలియచేశారు. అతి వాదశక్తులు స్టెరిలైట్ వ్యతిరేకోద్యమంలో చొరబడ్డాయని కూడా నిఘా వ్యవస్థల సమాచారం తెలిపింది. అయినప్పటికీ 20,000 మంది ఆందోళనకారులను అదుపు చేయడానికి కొన్ని వందల మంది పోలీసులను మాత్రమే నియోగించారు. ఆందోళనకారుల ధోరణి కూడా దురదృష్టకరం. అల్లరిమూకలు దాదాపు 30 ద్విచక్ర వాహనాలను దగ్ధం చేశాయి. కొన్ని కార్లను ధ్వంసం చేశాయి. ప్రభుత్వ కార్యాలయాలను కూడా ధ్వంసం చేసి, కిటికీల అద్దాలను పగులకొట్టాయి. అంతిమంగా కలెక్టర్ కార్యాలయంలోని దస్త్రాలకు అల్లరిమూకలు నిప్పు పెట్టడం ఆరంభించగానే పోలీసులు కాల్పులు జరి పారు. బాష్పవాయువు, వాటర్ కేనన్లను ఉపయోగించినా ఫలితం లేకపోయింది. అల్లరిమూకలను అదుపు చేయడానికీ, చెదరగొట్టడానికీ రబ్బర్ బులెట్లు ఎందుకు ఉపయోగించలేదో స్పష్టంగా తెలి యడం లేదు. చాలా టీవీ ఫుటేజ్లలో నమోదైనట్టు ట్యుటికోరన్ పోలీసులు తమ వద్ద ఉన్న అసాల్ట్ తుపాకులను కాల్చారు. అయితే ఇదంతా ప్రజలు ఉన్మాద స్థితికి చేరడం వల్లనే జరిగిందా? అన్ని ప్రభుత్వాల మాదిరిగానే తమిళనాడు ప్రభుత్వం కూడా ఉద్యమాన్ని సంఘ వ్యతిరేకశక్తులు చేతిలోకి తీసుకున్నాయని చెప్పింది. కానీ చూడబోతే తమిళనాడు ప్రభుత్వం ఈ పరిస్థితికి వచ్చే వరకు వేచి ఉన్నదనే అనిపిస్తున్నది. ఇలాంటి పరిస్థితి వస్తే అదుపు చేయడానికి తమ వద్ద ఆయుధాల ఉన్నాయన్న ధైర్యం సర్కారుకు ఉందని అనిపిస్తుంది. దీనితో పాటు చావులను చూడాలన్న కోరిక కూడా వారి పెదవుల మీద పలికింది– కనీసం ఒకరైనా చావాలి! స్టెరిలైట్ కాపర్ వెదజల్లే కాలుష్యానికి వ్యతిరేకంగా ఈ సంవత్సరమే అక్కడ ఉద్యమం ప్రారంభం కాలేదు. ఇది మరొక యూనియన్ కార్బయిడ్ విషభూతం, ఇది మా పెరట్లోనే ఉందని చెబుతూ గడచిన ఇరవై ఏళ్ల నుంచి కూడా స్థానికులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. నిజానికి ఈ కర్మాగారాన్ని మొదట మహారాష్ట్ర, గోవా ప్రాంతాలలో నెలకొల్పాలని అనుకున్నారు. కానీ స్థానికులు, పర్యావరణ ఉద్యమకారులు తిరగబడడంతో, అంతిమంగా తమిళనాడుకు తరలించారు. 1994–96 మధ్య నాటి జయలలిత ప్రభుత్వం ఈ కర్మాగారాన్ని నెలకొల్పడానికి ఎందుకు అనుమతించిందో ఎవరికీ అంతుపట్టదు. ఈ కర్మాగారం కారణంగా ఊపిరి తీసుకోవడం సమస్యగా మారిందనీ కళ్లు మండుతున్నాయనీ చర్మరోగాలు సోకుతున్నాయనీ క్యాన్సర్ బారిన పడడం పెరిగిందనీ ఆరోపిస్తూ చుట్టుపక్కల పది గ్రామాల వారు ఆక్రోశిస్తూ ఉంటారు. రాగిని పరిశుభ్రం చేయడం వల్ల వెలువడే పదార్థాలతో అక్కడి నీరు కలుషితమైందనీ రాగి నుంచి వచ్చిన వ్యర్ధాన్ని పడవేయడం వల్ల అక్కడి నదిలో ప్రవాహానికి ఆటంకంగా మారిందనీ వారి ఆరోపణ. ట్యుటికోరన్ కర్మాగారం సమస్యను రాష్ట్ర ప్రభుత్వాలు, పర్యావరణ అధికారులు కూడా మొదట పెద్దగా పట్టించుకోలేదు. అయితే తమిళనాడు కాలుష్య నివారణ బోర్డు విషవాయువు విడుదలైందన్న ఆరోపణతో 2013 మార్చిలో ఈ కర్మాగారాన్ని మూసివేయాలని ఆదేశించింది. కానీ జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ మూడు మాసాల తరువాత తిరిగి తెరవడానికి ఆమోదం తెలిపింది. ఈ సంవత్సరం మార్చిలో కూడా తమిళనాడు కాలుష్య నివారణ బోర్డు కార్యకలాపాల నిర్వహణ అనుమతి పత్రం ఇవ్వడానికి నిరాకరించింది. దీనితో మరోసారి ఈ సంస్థ తాత్కాలికంగా మూతపడింది. కానీ స్థాని కులు ఈ కర్మాగారం శాశ్వతంగా మూత పడాలని కోరారు. ఇంతలోనే జరగవలసిన నష్టం జరిగింది. ఎట్టకేలకు తమిళనాడు ప్రభుత్వం ఈ కర్మాగారాన్ని శాశ్వతంగా మూసివేయాలని ఈ నెల 28న ఆదేశించింది. ఈ కర్మాగారం విస్తరణకు ఉద్దేశించిన భూకేటాయింపును కూడా రద్దు చేసింది. కానీ ఈ మూసివేత ఆదేశాలు ఇప్పుడే ఎందుకు; ఇంత ఆలస్యంగా ఎందుకు? ఇవే అసలు ప్రశ్నలు. సమస్యలకు ప్రజలే పరిష్కారం చూసుకోవాలని అన్నాడీఎంకే ప్రభుత్వం ఉద్దేశం కాబోలు. కాలుష్య నివారణ బోర్డు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో అమలు చేసి ఉండవలసింది. ఆ కర్మాగారం మూసివేతకు మే 28 కాకుండా, ఒక్క రెండు వారాల ముందు నిర్ణయం తీసుకోవడానికి అడ్డు పెట్టినవారెవరు? అప్పుడు ఆ నిర్ణయం అమలు జరిగి ఉంటే ఆ కర్మాగారం మూసివేత కోసం 13 మంది ప్రాణాలు గాలిలో కలసి ఉండేవి కావు. స్వచ్ఛమైన గాలి, నీరు, భూమి కావాలంటూ ప్రజలు గాంధీ మార్గంలో ఆందోళన చేసినంత సేపు ప్రభుత్వాలు కదలవు. వారు ఆగ్రహించి ప్రతాపాన్ని చూపిస్తే డెత్ వారెంట్‌తో స్పందిస్తాయి. ఇది భారతదేశంలో పరిపాలన తీరు. కానీ ఇది సరి పోతుందా? కాకపోవచ్చు. ఏకపక్షంగా కర్మాగారాన్ని మూసివేయడం గురించి వేదాంత గ్రూప్ యాజమాన్యం కోర్టును ఆశ్రయిస్తే ప్రభుత్వాల నిర్ణయం వాదనకు నిలబడదు. కానీ క్షేత్రస్థాయిలో అదే ప్రాంతంలో మరోసారి కర్మాగారాన్ని ప్రారంభించడం మాత్రం వేదాంత గ్రూపునకు అసాధ్యం. నిజానికి దేశంలో ఉత్పత్తి అయ్యే రాగిలో 40 శాతం ట్యుటికోరన్ కర్మాగారం ద్వారానే జరుగుతుంది. దాదాపు 800 మంది ఉద్యోగాలు కోల్పోతారు. ట్యుటికోరన్ కర్మాగారం ఏటా నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల రాగిని తయారు చేస్తుంది. దేశంలో రాగి అవసరాల కోసం మరో రూ. 2,500 కోట్ల ఖర్చుతో మరో నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తికి కూడా ఆ సంస్థ విస్తరణ పథకాలు సిద్ధం చేసింది. దీనితో 2000 మందికి ఉద్యోగావకాశాలు వస్తాయని స్థానికులకు సంస్థ చెప్పింది. కర్మాగారం మూసివేతతో ఈ మేరకు ఆర్థిక పరమైన మూల్యం తప్పదు. కానీ ఈ కర్మాగారం నెమ్మదిగా ప్రజల ప్రాణాలను హరిస్తుంది. అలాగే పర్యావరణానికి కూడా ముప్పు. టీఎస్ సుధీర్, వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు, ఈ–మెయిల్ : tssmedia10@gmail.com -
స్టెరిలైట్ ప్లాంట్ మూసివేతపై సందేహాలు
సాక్షి, చెన్నై : ప్రజాందోళనలకు తలొగ్గి తూత్తుకుడి స్టెరిలైట్ ప్లాంట్ మూసివేతపై తమిళనాడు ప్రభుత్వం చేసిన ప్రకటనపై పలు సందేహాలు ముందుకొస్తున్నాయి. స్దానికుల హింసాత్మక నిరసనల్లో 13 మంది మరణించడం, పెద్దసంఖ్యలో నిరసనకారులు గాయపడటంతో ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చినా న్యాయపరమైన చిక్కులు సహా సరైన కసరత్తు జరపకుండానే ప్రభుత్వం ప్రకటన చేసిందని భావిస్తున్నారు. ప్లాంట్ కార్యకలాపాలు నిలిచిపోవడంతో ప్లాంట్‌పై ఆధారపడి జీవిస్తున్న వేలాది కుటుంబాలకు ప్రత్యామ్నాయం చూపడం పెనుసవాలే. ప్రభుత్వం నిర్ణయంపై తదుపరి చర్యలు చేపట్టేముందు స్టెరిలైట్ యూనిట్ ప్రమోటర్ వేదాంత స్పందించిన తీరు పలు ప్రశ్నలు ముందుకుతెస్తోంది. ప్లాంట్ మూసివేతకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం న్యాయపరమైన ప్రక్రియను అనుసరించలేదని కంపెనీ చెబుతోంది. తమకు ఎలాంటి షోకాజ్ నోటీసు జారీ చేయలేదని, యూనిట్ మూసివేతకు తమకు తగినంత సమయం ఇవ్వలేదని స్టెరిలైట్ వాదిస్తోంది. స్టెరిలైట్ యూనిట్ మూసివేతపై మే 23న తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు తొందరపాటుతో కూడుకున్నవని విదుదలై చిరుతైగల్ కచ్చి సభ్యులు డీ రవికుమార్ చెబుతున్నారు. ఈ ఉత్తర్వుల్లో తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలి యూనిట్ మూసివేతకు ఎలాంటి సహేతుక కారణం చూపలేదని, దీనిపై న్యాయస్ధానాలు సులభంగా స్టే ఉత్తర్వులు జారీ చేస్తాయని అభిప్రాయపడ్డారు. నిరసనకారుల ఆందోళనను దారిమళ్లించి, స్టెరిలైట్‌కు స్టే తెచ్చుకునేందుకు వీలుగా చేపట్టిన కుట్రలో ఇది భాగమని అభివర్ణించారు. స్టెరిలైట్ ప్లాంట్ చుట్టూ వివాదాలు ముసురుకున్న నేపథ్యంలో ప్లాంట్‌పై ఆధారపడిన 5000 మంది ఉద్యోగులు మాత్రం తమ భవితవ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. -
స్టెరిలైట్ ప్లాంట్ శాశ్వతంగా మూసివేత
సాక్షి, చెన్నై: ప్రజా ఉద్యమానికి తమిళనాడు ప్రభుత్వం ఎట్టకేలకు దిగివచ్చింది. తూత్తుకుడి స్టెరిలైట్ ప్లాంట్‌ను శాశ్వతంగా మూసివేసేందుకు ప్రభుత్వం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్లాంట్ శాశ్వత మూసివేతకు అవసరమైన చర్యలను ప్రభుత్వం చేపడుతుందని అంతకుముందు తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం హామీ ఇచ్చారు. ప్రజాభీష్టం మేరకు స్టెరిలైట్ ప్లాంట్‌ను శాశ్వతంగా మూసివేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. స్టెరిలైట్ ఫ్లాంట్ విస్తరణను వ్యతిరేకిస్తూ గత వారం స్థానికులు తీవ్రస్థాయిలో నిరసన తెలిపిన విషయం విదితమే. ఈ సందర్భంగా జరిగిన ఘటనల్లో 13మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. -
తూత్తుకుడి స్టెరిలైట్ ప్లాంట్ మూసివేత
-
సంయమనం పాటించండి: హోం మంత్రి
న్యూఢిల్లీ: తూత్తుకుడిలో ప్రజలు సంయమనం పాటించాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తమిళనాడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్టెరిలైట్ ఫ్యాక్టరీని వ్యతిరేకిస్తూ జరుగుతున్న నిరసనలో పోలీసుల కాల్పుల్లో ఇప్పటి వరకు 11 మంది నిరసనకారులు మృతి చెందిన విషయం తెలిసిందే. గురువారం కూడా ఉద్యమకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. దీనిపై స్పందించిన కేంద్ర హోంశాఖ తమిళనాడు ప్రజలు శాంతి, సంయమనం పాటించాలని కోరారు. ‘స్టెరిటైట్కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలో అమాయక ప్రజలు చనిపోవడం దురదృష్టకరం. వారి అత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్న. గాయపడిన వారు వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న’ అని హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ గురువారం వ్యాఖ్యానించారు. కాగా నిరసనకారులపై కాల్పులకు వ్యతిరేకంగా ప్రతిపక్ష డీఎంకేతో సహా ఇతర పక్షాలు శుక్రవారం తమిళనాడు బంద్‌కు పిలుపినిచ్చాయి. -
తూత్తుకుడి ఘటనకు వారే బాధ్యులు..
సాక్షి, చెన్నై : తూత్తుకుడిలో స్టెరిలైట్‌ను వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన నిరసనకారులపై జరిగిన కాల్పుల ఘటనపై తమిళనాడు సీఎం పళనిస్వామి స్పందించారు. కొన్ని రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్ధలు సహా సంఘ విద్రోహ శక్తులు స్ధానికులను తప్పుదోవ పట్టించడం వల్లే ఈ ఘటనలు చోటుచేసుకున్నాయని అన్నారు. తూత్తుకుడిలో రాగి విద్యుత్ గ్రాహక ప్లాంట్ ఏర్పాటుకు నిరసనగా ఆందోళన చేపట్టిన స్ధానికులపై పోలీసులు అత్యంత పాశవికంగా అసాల్ట్ రైఫిల్స్‌తో కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. గత మూడు నెలలుగా ప్లాంట్ కారణంగా ఈ ప్రాంతం కాలుష్యమయమవుతుందని స్ధానికులు నిరసన తెలుపుతున్నారు. తూత్తుకుడి కాల్పులకు కొన్ని రాజకీయ పార్టీలు, ఎన్జీవోలు, సంఘవ్యతిరేక శక్తులు ప్రజలను తప్పుదారి పట్టించడమే కారణమని పళనిస్వామి ఆరోపించారు. ప్రజలు తిరగబడి దాడులు చేయడం వల్లే వారిని ఎదుర్కొని ఆత్మరక్షణ కోసం పోలీసులు చర్యలు చేపట్టాల్సి వచ్చిందని పోలీసులను వెనకేసుకొచ్చారు. పోలీసులు నిరసనకారులపై నేరుగా కాల్పులు ఎలా జరుపుతారన్న ప్రశ్నకు ఆయన బదులివ్వలేదు. కాగా తూత్తుకుడి ఘర్షణల్లో 11 మంది మరణించగా, 67 మందికి గాయాలయ్యాయి. హింసకు పాల్పడ్డారంటూ పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
ప్రాణాలు పోయేలా ఉన్నా కనికరం చూపలేదు
-
తూత్తుకుడి జిల్లా కలెక్టర్‌గా తెలుగు వ్యక్తి
సాక్షి, చెన్నై : తమిళనాడు తూత్తుకుడి జిల్లా కలెక్టర్‌గా తెలుగు వ్యక్తి నండూరి సందీప్ నియమితులయ్యారు. గురువారం ఆయన జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. కాగా తూత్తుకుడిలో జరిగిన హింసాత్మక ఘటనల్లో మృతి చెందినవారి సంఖ్య 13కు చేరగా, 70 మంది గాయాలపాలయ్యారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఎన్ వెంకటేశన్, ఎస్పీ పీ మహేంద్రన్లపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తూత్తుకుడిలో అయిదు రోజుల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. తూత్తుకుడి పట్టణంలో వేదాంత కంపెనీకి చెందిన స్టెరిలైట్ కాపర్ (రాగి) యూనిట్ విస్తరణ ప్రతిపాదనల్ని వ్యతిరేకిస్తోన్న స్థానికులు గడిచిన 100 రోజులుగా నిరసనలు చేపట్టారు. అయితే నిరసనోద్యమం మంగళవారం నాడు ఒక్కసారిగా హింసాయుత మలుపు తిరిగింది. పెద్ద సంఖ్యలో జనం రోడ్లపైకి వచ్చి నినాదాలు చేశారు. వారిని అడ్డుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరుపగా 13 మంది ఆందోళనకారులు చనిపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా అలజడిరేపిన ఈ ఘటనపై మద్రాస్ హైకోర్టు సైతం కలుగజేసుకుంది. కాపర్ ప్లాంట్ విస్తరణను నిలిపేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ అరెస్ట్.. మరోవైపు తూత్తుకుడి సంఘటనపై ప్రభుత్వ వివరణ డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రిని కలిసేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ డీఎంకే ఎమ్మెల్యేలు గురువారం చెన్నైలోని సెక్రటేరియట్‌లోకి దూసుకెళ్లటం ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు వారిని అడ్డుకోవటంతో డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ సెక్రటేరియట్ ముందు ఆందోళనకు దిగారు. ఆయనతో పాటు 20 మంది ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దీంతో ఆందోళన చేస్తున్న స్టాలిన్ తదితరులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనను నిరసిస్తూ డీఎంకే శుక్రవారం బంద్‌కు పిలుపునిచ్చింది. ఇక తూత్తుకుడిలో అల్లర్లు సృష్టించారన్న ఆరోపణలతో ఇప్పటివరకూ 67 మందిని పోలీసులు అరెస్టు చేశారు. -
ఎందుకు తూత్తుకూడి రక్తసిక్తం?
సాక్షి, న్యూఢిల్లీ : తమిళనాడులోని తూత్తుకూడిలో కాలుష్యానికి కారణమవుతున్న వేదాంత స్టెరిలైట్ కాపర్ కంపెనీని 1996లో ఏర్పాటు చేశారు. రోజుకు 1200 టన్నుల అనోడ్స్ (విద్యుత్ గ్రాహక రాగి రాడ్లు)ను ఈ ఫ్యాక్టరీ ఉత్పత్తి చేస్తోంది. ప్రస్తుతమున్న ఈ సామర్థ్యాన్ని కంపెనీ రెండింతలు చేయాలనుకుంటోంది. దీని వల్ల అధిక సాంద్రత గల అక్కడి జనాభాపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపనుంది. కంపెనీకి పది కిలోమీటర్ల వ్యాసార్ధం పరిధిలో ఎనిమిది పట్టణాలు, 27 గ్రామాలు ఉన్నాయి. వీటిలో దాదాపు 4.6 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. కంపెనీ నుంచి వెలువడే సల్ఫర్ డైఆక్సైడ్, రేణువులు కాలుష్యానికి కారణం అవుతున్నాయని ప్రాజెక్ట్ పర్యావరణ ప్రభావం అంచనా నివేదిక 2015 సంవత్సరంలోనే వెల్లడించింది. కంపెనీ కారణంగా నీరు, వాయు కాలుష్యం ఏర్పడుతోందని గత రెండు దశాబ్దాలుగా స్థానిక ప్రజలు ఆందోళన చేస్తున్నారు. కొన్నేళ్ల వరకు కంపెనీ నుంచి కాలుష్యం ప్రభావాన్ని తాము అంచనా వేయలేకపోయామని, కొన్నేళ్ల క్రితం నుంచే ఆ ప్రభావాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నామని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాలుష్యం కారణంగా ప్రతి ఇంటిలో కనీసం ఇద్దరు అస్వస్థులవుతున్నారని, ముఖ్యంగా పిల్లలపై కాలుష్యం ప్రభావం ప్రాణాంతకంగా ఉంటోందని వారు చెబుతున్నారు. కంపెనీని మరింత విస్తరిస్తున్నట్లు సమీపంలోని కుమారెడ్యార్పురం గ్రామస్థులకు ముందుగా తెల్సింది. మొదట చిన్న స్థాయిలో ప్రజల నిరసన ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత అవి ఊపందుకున్నాయి. మంగళవారం నాడు తూత్తుకూడిలో వేలాది మంది ప్రజలు నిరసన ప్రదర్శన జరిపారు. అధికారులపై ఒత్తిడి తెచ్చేందుకు కలెక్టర్ కార్యాలయాన్ని చుట్టుముట్టాలని నెల రోజుల క్రితమే నిర్ణయించామని, ఈ విషయం కలెక్టర్‌కు తెలిసి ఆయన ఆదివారం నాడు తమతో శాంతి చర్చలు జరిపారని సెల్వరాజ్ అనే స్థానికుడు తెలిపారు. తమకు కావాల్సింది శాంతి కాదని, కంపెనీ విస్తరణను అడ్డుకోవడమే ముఖ్యమంటూ తాము కలెక్టర్‌కు కూడా స్పష్టం చేశామని సుందరరామమూర్తి అనే మరో గ్రామస్థుడు తెలిపారు. ఆదివారం నాడు కలెక్టర్ శాంతి సమావేశాన్ని నిర్వహించిన తర్వాత కూడా మంగళవారం నాడు కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి నిరసన తెలియజేయాలని గ్రామస్థులు నిర్ణయించారని వారు తెలిపారు. అందుకు కలెక్టర్ కార్యాలయంలో ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సమావేశం అయ్యేందుకు కూడా ముందుగా కలెక్టర్ కార్యాలయం అనుమతి ఇచ్చిందని వారు తెలిపారు. ఆ తర్వాత అనూహ్యంగా సోమవారం నాడు కలెక్టర్ కార్యాలయంలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించారని వారు తెలిపారు. శాంతియుతంగానే తాము కలెక్టర్ కార్యాలయానికి ప్రదర్శనగా వెళ్లాలని అనుకున్నామని, హింసాకాండకు దిగాలన్న ఉద్దేశం తమకు ఏమాత్రం లేదని వారు చెప్పారు. కలెక్టర్ కార్యాలయానికి పది కిలోమీటర్ల దూరంలోనే పిల్లాపాపలతో సహా వేలాది మంది ప్రజలు గుమిగూడారని, అక్కడి నుంచే పోలీసు బారికేడ్లు ప్రారంభమయ్యాయని చెప్పారు. ప్రజలను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించడంతోనే ఉద్రిక్త పరిస్థితి ఏర్పడిందని, అది చివరకు పోలీసు కాల్పులదాకా వెళ్లిందని గ్రామస్థులు వివరించారు. వారు కాల్పుల్లో మరణించిన వారి ఫొటోలను మీడియాకు చూపించారు. వారిలో ఎక్కువ మందికి కడుపులో, పొత్తి కడుపులో బుల్లెట్లు దిగిన గాయాలున్నాయి. ప్రస్తుతం అక్కడ వాడవాడలా పోలీసు బందోబస్తు కనిపిస్తోంది. కలెక్టర్‌గానీ, పోలీసు ఉన్నతాధికారులుగానీ మీడియాకు అందుబాటులో లేరు. -
తూత్తుకుడిలో బంద్, స్టాలిన్, కమల్ పర్యటన
సాక్షి, చెన్నై : తమిళనాడులోని తూత్తుకుడిలో పోలీసు కాల్పులను ఖండిస్తూ ప్రజాసంఘాలు,రాజకీయ పార్టీలు ఇచ్చిన బంద్ కొనసాగుతోంది. వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. మరోవైపు ఐదుగురు ఐపీఎస్ అధికారుల నేతృత్వంలో భారీగా బలగాలు మోహరించాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 2వేలమంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. తూత్తుకుడిలో హింసాత్మక ఘటనతో 40మంది పోలీసు అధికారులపై డీజీపీ బదిలీ వేటు వేశారు. ఇక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తూత్తుకుడిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అలాగే బుధవారం జరిగే అన్ని పరీక్షలు రద్దు అయ్యాయి. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్, సినీనటుడు కమల్‌హాసన్ నేడు తూత్తుకుడిలో పర్యటించి, బాధితులను పరామర్శించనున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లాల్సిన కమల్ తన బెంగళూరు పర్యటన రద్దు చేసుకుని నేడు తూత్తుకుడి వెళ్లనున్నారు. కాగా తూత్తుకుడి స్టెర్లైట్ పరిశ్రమను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నిర్వహించిన ర్యాలీ, రాళ్లదాడి, లాఠీచార్జి, పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మహిళలు సహా 11మంది దుర్మరణం చెందారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం సైతం అగ్నికీలల్లో చిక్కుకుంది. యాభైకి పైగా వాహనాలు ధ్వంసం అయ్యాయి. -
కాలుష్యంపై పోరాడితే కాల్పులా?!
వాయు కాలుష్యానికీ, జల కాలుష్యానికీ కారణమవుతూ తమ ప్రాణాలను కొంచెం కొంచెంగా పీల్చేస్తున్న మాయదారి స్టెరిలైట్ ఫ్యాక్టరీని మూసేయాలని కోరుతూ రోడ్డెక్కిన ఆందోళనకారులపై తమిళనాడులోని తూత్తుకుడిలో మంగళవారం కాల్పులు జరిగి 11మంది నేలకొరిగిన ఉదంతం అత్యంత విషాదకరమైనది. తమపాలిట మృత్యువుగా మారిన సంస్థ ఉండటానికి వీల్లేదని ఆగ్రహిం చినవారు ఆ క్రమంలో సొంత ప్రాణాలనే పణంగా పెట్టాల్సిరావడం ఎంత ఘోరం? నిరసనలనూ, ఆందోళనలనూ మొగ్గలోనే తుంచాలని చూడటం, అది సాధ్యం కాకపోతే వాటిపై దుష్ప్రచారానికి దిగడం, అందులోనూ విఫలమయ్యాక బలప్రయోగానికి పూనుకోవడం ప్రభుత్వాలన్నిటికీ రివాజుగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సర్కారుదీ ఇదే వరస. పశ్చిమగోదావరి జిల్లా తుందుర్రులో ఆక్వా పార్కును వ్యతిరేకిస్తున్న జనంపై అది సాగిస్తున్న జులుం శ్రుతిమించుతోంది. వేదాంత సంస్థ నేతృత్వంలోని స్టెరిలైట్ ఫ్యాక్టరీ వ్యవహారం ఇలాంటి ధోరణులకు భిన్నమైనదేమీ కాదు. జరిగిన తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం సాకులు వెదుకుతోంది. 20వేలమంది ప్రజానీకం నిషేధాజ్ఞలు ఉల్లంఘించి జిల్లా కలెక్టర్ కార్యాలయంవైపు దూసుకొచ్చారని, వారిని ఆపేం దుకు పోలీసులు ప్రయత్నిస్తే రాళ్లు రువ్వారని, ప్రభుత్వ ఆస్తులకు నిప్పెట్టారని... దాంతో కాల్పులు తప్పనిసరయ్యాయని సంజాయిషీ ఇస్తోంది. నిజమే... వేలాదిమందితో నిరసనలు జరిగినప్పుడు అనుకోని ఘటనలు చోటుచేసుకోవడానికి ఆస్కారం ఎప్పుడూ ఉంటుంది. కనుకనే ఉద్యమాలు శైశవ దశలో ఉన్నప్పుడే ప్రభుత్వాలు మేల్కొనాలి. ప్రజల డిమాండ్లలోని సహేతుకతను గుర్తించాలి. వారి భయాందోళనలు నిరాధారమైనవనుకున్నప్పుడు ఆ సంగతే వారికి చెప్పాలి. ఒప్పించగలగాలి. పాల కులుగా ఇది వారి బాధ్యత. స్టెరిలైట్ వ్యతిరేక ఉద్యమం ఈనాటిదా? అది ఫ్యాక్టరీ స్థాపించిన 1998లోనే రాజుకుంది. ఈ ఉద్యమం ఒక్క స్టెరిలైట్ కంపెనీపై మాత్రమే కాదు... ఫ్యాక్టరీవల్ల పర్యావరణానికి కలిగే హానిని దాచి పెట్టి అనుమతులు మంజూరు చేసిన జిల్లా యంత్రాంగంపైనా, తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలిపైనా కూడా స్థానికులు కన్నెర్ర చేస్తున్నారు. ఆ ఫ్యాక్టరీ వల్ల ఏమాత్రం నష్టం లేదని చెబు తున్న సర్కారు... అది మహారాష్ట్ర నుంచి తమిళనాడు ఎందుకు వలస వచ్చిందో చెప్పాలి. 1992లో మహారాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి కార్పొరేషన్ స్టెరిలైట్‌కు అక్కడి రత్నగిరి జిల్లాలో 500 ఎకరాలు కేటాయిస్తే ఆ మరుసటి సంవత్సరం దాని పనులు మొదలయ్యాయి. రాగిని కరిగించగల భారీ స్మెల్టర్ నిర్మాణానికి సంస్థ పూనుకున్నప్పుడు స్థానికులు తిరగబడి ఆందోళన చేయడం పర్యవసానంగా అక్కడి ప్రభుత్వం నిపుణుల కమిటీ నియమించింది. ఆ కమిటీ నివేదికతో ప్రాజెక్టు నిలిచిపోయింది. మహారాష్ట్రలో హానికారకమని నిలిపేసిన ప్రాజెక్టు తమిళనాడుకు నచ్చింది. 1994లో అక్కడి కాలుష్య నియంత్రణ మండలి ‘నో అబ్జెక్షన్’ సర్టిఫికెట్ మంజూరు చేసింది. పర్యావరణ ప్రభావ మదింపు(ఈఐఏ) చేయాలని స్టెరిలైట్‌కు సూచించింది. అంతేకాదు... విభిన్న జలచరాలుండే మన్నార్ జలసంధి జీవావరణ రిజర్వ్‌కు ప్రతిపాదిత ఫ్యాక్టరీ 25 కిలోమీటర్ల దూరం ఉండాలని నిర్దేశించింది. స్టెరిలైట్ ఈఐఏను సమర్పించకుండానే 1995లో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతులు వచ్చేశాయి. ఫ్యాక్టరీ నిర్మాణానికి మండలి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మన్నార్ జలసంధికి 14 కిలోమీటర్ల దూరంలో ఫ్యాక్టరీ ఏర్పాటైంది. ఉత్పాదకత మొదలుపెట్టడానికి చకచకా అను మతులు వచ్చాయి. ఫ్యాక్టరీ చుట్టూ 25మీటర్ల మేర గ్రీన్‌బెల్ట్ నిర్మించాలన్న షరతు మాత్రం విధించారు. అదీ బేఖాతరైంది. ఉత్పత్తి మొదలైన ఏడాదిలోపే స్థానికులనుంచి ఫిర్యాదుల వెల్లువ మొదలైంది. పరిసరాల్లోని భూగర్భ జలాలు కలుషితం కావడం, ఫ్యాక్టరీ పొగతో ఎందరో అస్వ స్థులవుతుండటం రివాజుగా మారింది. ప్రతి ఫిర్యాదూ బుట్టదాఖలైంది. కాలుష్య నియంత్రణ మండలి, నాగ్‌పూర్‌లోని జాతీయ పర్యావరణ ఇంజనీరింగ్ పరిశోధనా సంస్థ(నీరీ) క్లీన్చిట్ ఇస్తూనే ఉన్నాయి. స్థానికులు మాత్రం నానా కష్టాలూ పడుతున్నారు. అప్పుడప్పుడు పరిస్థితి తీవ్రత గమ నించి ఉత్పాదకత నిలిపేయాలని ఆదేశిస్తే, దాని పునరుద్ధరణకు అనుమతి కోరకుండానే కార్య కలాపాలు ప్రారంభించేవారని ఉద్యమకారుల ఆరోపణ. రాగిని కరిగించే ప్రక్రియ వల్ల సల్ఫర్ డై ఆక్సైడ్, సీసం, ఆర్సెనిక్ తదితర ప్రమాదకర పదార్థాలు గాలిలో, భూగర్భ జలాల్లో కలుస్తున్నాయి. ఈ ఫ్యాక్టరీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై 2013లో తీర్పునిచ్చిన సుప్రీం కోర్టు 1997–2012 మధ్య పదిహేనేళ్లపాటు ఈ సంస్థ పర్యావరణ విధ్వంసానికి కారణమైందని నిర్ధారించింది. అయితే ఫ్యాక్టరీ మూతపడాలన్న డిమాండుతో ఏకీభవించలేదు. అందువల్ల 1,300 మంది ఉద్యోగులు రోడ్డున పడటమే కాక... రక్షణ, విద్యుత్ రంగాలతోపాటు ఆటోమొబైల్, నిర్మాణ రంగం, మౌలిక సదుపాయాల రంగం దెబ్బతింటాయని అభిప్రాయపడింది. అయితే చేసిన విధ్వంసానికి పరిహారంగా పరిహారంగా కలెక్టర్ వద్ద రూ. 100 కోట్లు డిపాజిట్ చేయాలని ఆదేశించింది. కానీ ఇంతవరకూ దానిలో ఒక్క పైసా కూడా బాధితులకు విదిల్చిన వైనం కనబడదు. చావసిద్ధపడితే తప్ప బతకడం సాధ్యం కాదని స్థానికులు భావించడంలో ఆశ్చర్యమేముంది? తూత్తుకుడి విధ్వంసాన్ని ఆపాలంటున్న జనంవైపో... చట్టాలను ఉల్లంఘిస్తున్న కార్పొరేట్ సంస్థ లవైపో తమిళనాడు ప్రభుత్వం తేల్చుకోవాలి. ఆ విషయంలో సరైన నిర్ణయం జరిగేవరకూ ఆందోళన చల్లారదు. -
తూత్తుకుడిలో పోలీసులు కాల్పులు 11 మంది మృతి
-
తూత్తుకుడి హింస.. రాజకీయ దుమారం
సాక్షి, చెన్నై: తూత్తుకుడి స్టెరిలైట్ ఫ్యాక్టరీ మూసివేత ఆందోళనల అంశం రాజకీయ మలుపు తీసుకుంది. మంగళవారం చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో అన్నాడీఎంకే ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై ఆంక్షలు విధించి రెచ్చగొట్టారని, పైగా వారిపై అమానుషంగా పొట్టనబెట్టుకున్నారని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. అయితే పరిస్థితి అదుపు తప్పటంతోనే పోలీసులు కాల్పులు చేపట్టినట్లు మంత్రి జయకుమార్ వెల్లడించారు. మృతులకు నష్టపరిహారం అందిస్తామన్న ఆయన ప్రకటనపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. డీఎంకే అధినేత స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ...‘ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవాల్సిందిపోయి.. ఈ ప్రభుత్వం వారి ప్రాణాలను బలిగొంది. అవినీతిని ప్రొత్సహించటం కాదు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆ ఫ్యాక్టరీ మూత పడాల్సిందే. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి’ అని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. తూత్తుకుడి పరిస్థితుల నేపథ్యంలో రేపు కర్ణాటకలో జరగబోయే కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి స్టాలిన్ హాజరు కావటం లేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రేపు కీలక నేతలతో స్టాలిన్ తూత్తుకుడిలో పర్యటించే అవకాశం ఉంది. మరోవైపు ఈ పరిణామాలపై నటుడు, మక్కళ్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ కూడా స్పందించారు. ‘పౌరుల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేకుండా పోయింది. వాళ్లేం నేరగాళ్లు కాదు. ప్రజా హక్కులను కాపాడాల్సింది పోయి పొట్టనబెట్టుకుంది. జంతువులను కాల్చి చంపినట్లు చంపారు. శాంతియుత ఆందోళనను హింసాత్మకంగా మార్చింది ప్రభుత్వమే. ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. రేపు తూత్తుకుడికి వెళ్తాను. తక్షణమే ఫ్యాక్టరీని మూసేయాలి’ ఆయన డిమాండ్ చేశారు. వివాదం... 1996లో స్టెరిలైట్ ఫ్యాక్టరీని స్థాపించారు. ఏడాదికి 4 లక్షల మెట్రిక్ టన్నుల కాపర్‌ను ఉత్పత్తి చేయాల్సి ఉండగా, ఈ ఫ్యాక్టరీ మాత్రం రెట్టింపు ఉత్పత్తి చేస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. 2013 మార్చిలో వేలాది మంది ప్రజలు ఈ ఫ్యాక్టరీ నుంచి వెలువడ్డ కాలుష్యాలు భూగర్భ జలాలను కలుషితం చేయటం, విషపూరిత వాయువుల కారణంగా గొంతు ఇన్ఫెక్షన్, శ్వాస సంబంధిత వ్యాధులతో వేలాది మంది ప్రజలు ఇబ్బందుల పాలయ్యారు. దీంతో ఫ్యాక్టరీని మూసేయాలన్న ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే నేషన్ గ్రీన్ ట్రిబ్యూనల్ ఆదేశాలతో తిరిగి ఫ్యాక్టరీ తెరుచుకుంది. అదే ఏడాది ఎడీఎంకే చీఫ్ వైకో సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేయగా, పర్యావరణానికి, ప్రజలకు చేసిన నష్టానికి 100 కోట్ల జరిమానా విధిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఫ్యాక్టరీ యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే యాజమాన్య సంస్థ వేదాంత గ్రూప్ మాత్రం ‘ కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలకు ఎక్కడా ఉల్లంఘించటం లేదు’ అని వాదించి ఆ జరిమానా నుంచి తప్పించుకుంది. అంతేకాదు ఇప్పుడు ఫ్యాక్టరీ మూసివేత డిమాండ్ ఊపందుకున్న వేళ.. తమ ఫ్యాక్టరీ ద్వారా పరోక్షంగా 25 వేల మందికి, ప్రత్యక్షంగా 3 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు వాదిస్తోంది. అయితే స్థానిక ప్రజలు ఇది ప్రమాదకరమని, తక్షణమే మూసేసే దిశగా ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూ వస్తున్నారు. అయినా లాభం లేకుండా పోయింది. చివరకు లైసెన్స్ రెన్యువల్‌కు ఫ్యాక్టరీ యాజమాన్యం యత్నిస్తుందన్న వార్తలు బయటకు పొక్కటంతో ఈ ఆందోళనలు తీవ్ర తరం అయ్యాయి. -
రణరంగంగా తూత్తుకుడి
సాక్షి, చెన్నై: తమిళనాడులోని తూత్తుకుడి (ట్యూటీకోరిన్) మళ్లీ రణరంగంగా మారింది. ఉదయం జరిగిన పరిణామాల తర్వాత కాసేపు శాంతించిన ఆందోళనకారులు మళ్లీ చెలరేగిపోయారు. ఎస్పీ క్యాంప్ ఆఫీస్‌ను ముట్టడించేందుకు ఆందోళనకారులు యత్నించగా.. పోలీసులు కాల్పులకు దిగారు. కాల్పుల్లో తొమ్మిది మంది మృతి చెందగా, ఆందోళనలో మొత్తం మృతుల సంఖ్య 11కి చేరుకుంది. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉండగా, మరో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాలుష్యానికి కారణమవుతున్న స్టెరిలైట్ కాపర్ ఫ్యాక్టరీని మూసేయాలంటూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో స్థానికులు మంగళవారం కలెక్టరేట్ ముట్టడికి పిలుపునివ్వగా, అది కాస్త హింసాత్మకంగా మారింది. ఉదయం నుంచి మొదలై... స్టెరిలైట్ కాపర్ ఫ్యాక్టరీ విస్తరణకు వ్యతిరేకంగా తూత్తుకుడిలో గత వందరోజులుగా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఫిర్యాదులు చేసినా అన్నాడీఎంకే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని, ఫ్యాక్టరీ యాజమాన్యంతో చేతులు కలిపి అవినీతికి పాల్పడుతోందంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే సుమారు 20 వేల మంది మంగళవారం కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరారు. అయితే వారిని మరోచోట ఆందోళన నిర్వహించుకోవాలంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఆగ్రహించిన ఆందోళనకారులు పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. పరిస్థితి చేయిదాటిపోవడంతో ఆందోళకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో ఆందోళనకారులు ఒక్కసారిగా పోలీసు వాహనాలపై దాడులకు పాల్పడ్డారు. పోలీసులు బాష్పవాయువు ప్రయోగించి వారిని చెదరగొట్టారు. తొలుత పోలీసుల లాఠీఛార్జ్‌లో ఇద్దరు మృతి చెందగా, పలువురు ఆందోళనకారులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం మళ్లీ ఆందోళనకారులు విజృంభించటంతో కాల్పులు జరపగా 9 మంది మృతి చెందారు. -
తూత్తుకుడిలో హింసాత్మక ఘటన
-
అట్టుడుకుతున్న తూత్తుకుడి!
సాక్షి, చెన్నై : తమిళనాడులోని తూత్తుకుడి (ట్యూటీకోరిన్)లో అట్టుడుకుతోంది. కాలుష్యానికి కారణమవుతున్న స్థానిక స్టెరిలైట్ కంపెనీని మూసివేయాలంటూ ప్రజాసంఘాలు కలెక్టరేట్ ముట్టడికి పిలుపునివ్వటంతో తూత్తుకుడిలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, ప్రభుత్వ, ప్రయివేటు వాహనాలు ధ్వంసం అయ్యాయి. వివరాల్లోకి వెళితే... స్టెరిలైన్ కంపెనీని మూసివేయాలంటూ మంగళవారం ఆందోళనకారులు వేలాదిగా తరలివచ్చి కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించారు. వారి ప్రయత్నాలను అడ్డుకున్న పోలీసులపై ఆందోళనకారులు రాళ్లదాడి చేశారు. పరిస్థితి చేయిదాటిపోవడంతో ఆందోళకారులను చెదరగొట్టేందుకు పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేశారు. దీంతో ఆందోళనకారులు ఒక్కసారిగా పోలీసు వాహనాలపై దాడులకు పాల్పడ్డారు. దీంతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించి వారిని చెదరగొట్టారు. పోలీసుల లాఠీఛార్జ్‌లో ఇద్దరు మృతి చెందగా, పలువురు ఆందోళనకారులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు తూత్తుకుడిలో పోలీసుల లాఠీచార్జ్ ఘటన తమిళనాడును కుదిపేస్తోంది. ప్రభుత్వ తీరును రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిని రెచ్చగొట్టేవిధంగా ఆంక్షలు విధించి వారిపై అమానుషంగా దాడి చేయడంపై ప్రజాసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. సంఘటనా స్థలం వద్ద 144 సెక్షన్ విధించడంతో పాటు పోలీసులు భారీగా మోహరించారు. స్టెరిలైట్ ఫ్యాక్టరీ విస్తరణకు వ్యతిరేకంగా తూత్తుకుడిలో గత వందరోజులుగా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. -
అమ్మో.. ఎన్ని తిమింగలాలో!