Tamil Nadu Transgender Woman Tortured And Forcibly Hair Cut, Video Goes Viral - Sakshi
Sakshi News home page

వీడియో: హిజ్రాపై దాష్టికం.. జట్టు కత్తిరించి చిత్రవధ చేస్తూ..

Published Thu, Oct 13 2022 1:15 PM | Last Updated on Thu, Oct 13 2022 2:26 PM

Tamil Nadu Transgender Woman Tortured Forcibly Hair Cut Viral - Sakshi

చెన్నై: హిజ్రాపై దారుణానికి తెగబడ్డ ఇద్దరు యువకులను ఎట్టకేలకు అరెస్ట్‌ చేశారు పోలీసులు. ఓ హిజ్రాను పొలంలో చీర చించేసి.., జుట్టు కత్తిరించి.. చిత్రవధ చేస్తూ హింసించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

తమిళనాడు ట్యూటికోరిన్‌లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. 19 సెకండ్ల నిడివి ఉన్న వీడియోలో.. బ్లేడ్‌తో హిజ్రా జుట్టును కోసేసి పొలంలో పడేశారు. ఆమె ముఖం దాడి మూలంగా ఛిద్రమైనట్లు కనిపిస్తోంది. 

ఆ పక్కనే మరో హిజ్రా ఉండగా.. దాడికి పాల్పడ్డ ఇద్దరు యువకులు ‘‘వీళ్లను చూడండి. ఇంతకాలం మగవాళ్ల నుంచి డబ్బు దోచుకున్నారు. ఇప్పుడు మనమేం చేయాలి? అంతా అయిపోయింది. వీళ్లేం అందంగా కనిపించడం లేదు కదా’’ అంటూ గట్టిగట్టిగా అరిచారు.

మరో వీడియోలో హిజ్రాలు నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు వైరల్‌ అయ్యింది. హిజ్రా హక్కుల ఉద్యమకారిణి గ్రేస్‌ బాను ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ ఘటనపై తమిళనాడు సౌత్‌ జోన్‌ పోలీసులు స్పందించారు. 

నిందితులను నోవాహ్‌, విజయ్‌గా నిర్ధారించారు. ఆ ఇద్దరికి వీడియోలో ఉన్న హిజ్రాలు బాగా తెలుసని, వాళ్లలో ఓ జంటకు సంబంధం కూడా ఉందని, కానీ, విడిపోవడంతోనే ఇలా దాడి జరిగి ఉంటుందని భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందని వివరించారు.

ఇదీ చదవండి: ఈరోజుల్లో ఇంత నిజాయితీగా బతుకుతున్నారా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement