అరేయ్‌.. ఏం మనుషులు రా మీరు! | Bengaluru Men Mercilessly Thrashing Dog Video Viral | Sakshi
Sakshi News home page

వీడియో: అరేయ్‌.. ఏం మనుషులు రా మీరు! కట్టేసి దుడ్డుకర్రలతో ఘోరం

Published Tue, Oct 4 2022 9:25 PM | Last Updated on Mon, Oct 10 2022 1:42 PM

Bengaluru Men Mercilessly Thrashing Dog Video Viral - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

బెంగళూరు: రోడ్డున పోతుంటే.. తమను చూసి మొరిగిందని ఓ శునకంపై దారుణానికి తెగబడ్డారు ఇద్దరు. దాని మెడకు ఉన్న చెయిన్‌తో ముందరి కాళ్లను బంధించి.. దుడ్డు కర్రలతో విచక్షణారహితంగా చితకబాదారు. ఆ దెబ్బలు తాళలేక బాధతో అది మూలుగుతున్నా.. అడ్డుకునేందుకు చుట్టు పక్కలవాళ్లు ప్రయత్నించినా.. ఆ మూర్ఖుల తగ్గలేదు. 

ఈ ఘటనను వీడియో తీసేందుకు యత్నించిన వాళ్లను సైతం తోసేసి.. ఆ మూగజీవిపై దాడి చేశారు. ఇంతలో ఓనర్‌ అక్కడికి చేరుకుని నిలదీయడంతో.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈస్ట్‌ బెంగళూరు కేఆర్‌ పురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మంజునాథ లేఅవుట్‌లో  సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది.

తీవ్రంగా గాయపడిన ఆ శునకాన్ని.. యజమాని వెటర్నరీ హాస్పిటల్‌లో చేర్పించినట్లు తెలుస్తోంది. ఇక వీడియో ఆధారంగా కేసు నమోదు చేయాలని బెంగళూరు పోలీసులు నిర్ణయించారు. ఓనర్‌ను సంప్రదించగా ఫిర్యాదు చేయడానికి ఆయన అంగీకరించినట్లు తెలుస్తోంది. సోషల్‌ మీడియా ద్వారా ఈ ఘటన వైరల్‌ కావడంతో.. ఆ మూర్ఖులను మూగజీవి ప్రేమికులు తిట్టిపోస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement