
శుభలేఖతో పాటు మొక్కలు పంచుతున్న ఆశయస్ఫూర్తి ఫౌండేషన్ కార్యదర్శి అస్గర్
గుంటూరు, కొండపల్లి(ఇబ్రహీంపట్నం): అతడో సామాజిక సేవకుడు. పలు సేవా కార్యక్రమాల నిర్వహణ కోసం ఆశయ స్ఫూర్తి పేరుతో ఫౌండేషన్ నిర్వహిస్తున్నాడు. ప్రకృతిపై మమకారంతో వినూత్నంగా అతడు తన పెళ్లికార్డులతో పాటు మొక్కలు పంపిణీ చేసి పలువురికి స్ఫూర్తిగా నిలిచాడు. కొండపల్లిలో ఆశయస్ఫూర్తి ఫౌండేషన్ కార్యదర్శి అస్గర్ హుస్సేన్ వినూత్నమైన ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించిన ఆయన తన వివాహం సందర్భంగా శుభలేఖలతో పాటు మొక్కలు పంచేందుకు నిర్ణయించారు. ఆదివారం పెళ్లి కార్డులతో పాటు 200 పండ్లు, పూలు మొక్కలు పంపిణీ చేశారు. ప్రతి ఇంట్లో ఐదు అడుగుల స్థలంలో కనీసం ఒక మొక్క నాటాలనేది ఆశయస్పూర్తి ఫౌండేషన్ లక్ష్యమన్నారు.