
95 వేల మొక్కలు నాటాం..
► 50 వేల పండ్లు, పూల మొక్కల పంపిణీ చేపడతాం
► మొక్కలు, ట్రీగార్డులు ఎత్తుకెళితే కఠిన చర్యలు
► నగర పాలక కమిషనర్ కె.శశాంక
కరీంనగర్‌కార్పొరేషన్: తెలంగాణకు హరితహారంలో భాగంగా లక్ష మొక్కలు లక్ష్యంగా సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించిన ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ఇప్పటివరకు కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 350 లొకేషన్లలో 95 వేల మొక్కలు నాటినట్లు నగరపాలక కమిషనర్ కె.శశాంక వెల్లడించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 66 వేల మొక్కలను మున్సిపల్ తరఫున నాటగా, 28 వేల మొక్కలను ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ద్వారా నాటామని వివరించారు. ఇందులో 15 వేల మొక్కలు మానేరు డ్యాం పరిసర ప్రాంతాల్లోనే నాటామన్నారు.
నాటిన ప్రతి మొక్కనూ కాపాడేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు. ప్రస్తుతం మొక్కలకు నీటి సరఫరా చేసేందుకు మున్సి పల్‌కు చెందిన 4 ట్యాంకర్లను వాడుతున్నామన్నారు. మరో 5 ట్యాంకర్లను అద్దెకు తీసుకొని సెగ్మెంట్‌కు ఒకటి అందుబాటులో ఉంచుతామన్నారు. మానేరు డ్యాం పరిసర ప్రాంతాల్లోని మొ క్కలను కాపాడేందుకు ఫెన్సింగ్ వేయడంతోపాటు నీటి సరఫరా కోసం బోర్‌వెల్ ఏర్పాటు చేసి డ్రిప్ పద్ధతిన నీరందిస్తామన్నారు. డి విజన్లలోని ఇళ్ల పరిసరాల్లో నాటిన మొక్కలను కాపాడేందుకు స్థానిక ప్రజలు సహకారం అందించాలని కోరారు.
ఇప్పటివరకు 35 వేల హెచ్‌డీపీఈ ట్రీగార్డులు తెప్పించి 28 వేలు వాడామన్నారు. అవసరమైతే మరిన్ని ట్రీగార్డులు తెప్పిస్తామన్నారు. రెండు రోజు ల్లో 50 వేల పూల, పండ్ల మొక్కలు వస్తాయని వా టిని ఇళ్లలో పంచుతామన్నారు. ఎండిపోయిన, తొలగించిన స్థానంలో తిరిగి మొక్కలు నాటుతామన్నారు. డివైడర్లలో ఏర్పాటు చేసిన మొక్కలు, కొన్ని ప్రాంతాల్లో ట్రీగార్డులు ఎత్తుకెళ్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని.. అలాంటి వారిపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో హరితహారం ప్రత్యేకాధికారి ఆంజనేయులు పాల్గొన్నారు.