గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి నటుడు విజయ్ సేతుపతి మెక్కలు నాటారు. ఉప్పెన సినిమా దర్శకుడు విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించి చెన్నైలోని తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను మెదలుపెట్టిన ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్‌ని ప్రత్యేకంగా అభినందించారు. చాలా మంచి కార్యక్రమాన్ని చేపట్టారని, అందులో తానూ భాగం అవడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్‌కి , ఛాలెంజ్‌కి తనని నామినేట్ చేసిన డైరెక్టర్ బుచ్చిబాబుకి కృతజ్ఞతలు తెలియజేశారు.
(భావితరాలకు ఆకుపచ్చ భారతాన్ని అందించాలి)
అలాగే ఉప్పెన సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ‘ఉప్పెన’ సినిమాలో తమిళ్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రముఖ పాత్రలో నటించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటాల్సిందిగా అభిమానులకు పిలుపునిచ్చారు. విజయ్ సేతుపతి ఇప్పటివరకు పిజ్జా, నేను రౌడినే వంటి తెలుగు రీమేక్‌లలో నటించారు. 2009 సైరా నర్సింహారెడ్డిలో మొదటిసారిగా తెలుగులో నటించి మెప్పించారు. ప్రస్తుతం తెలుగులో రెండవ సినిమా ఉప్పెనలో నటించారు. వైష్షవ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటించిన ఈ సినిమా లాక్‌డౌన్ కారణంగా వాయిదాపడింది. దీంతో ఏప్రిల్‌లో విడుదల కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. (విజయ్ సేతుపతికి జంటగా స్వీటీ)
Makkal selvan @VijaySethuOffl accepted the #GreenIndiaChallenge 🌱 given by #Uppena director @BuchiBabuSana and planted saplings at his home.
— Vamsi Shekar (@UrsVamsiShekar) July 27, 2020
He expressed appreciation towards this great initiative & requested all those waiting for #Uppena should also take part.💚@MPsantoshtrs pic.twitter.com/p8sKuhv5BN
Comments
Please login to add a commentAdd a comment