Green India Mission
-
తెలంగాణలో పచ్చదనం పెరిగింది
షాద్‌నగర్ టౌన్: మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ అన్నారు. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా గురువారం రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని కమ్మదనం గ్రామ శివారులో ఉన్న తన వ్యవసాయ క్షేత్రంలో ఆయన మొక్కలు నాటారు. ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి ఇచ్చిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను స్వీకరించిన ప్రకాశ్‌రాజ్ తన కుమారుడితో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మొక్కలు పెంచే బాధ్యత కేవలం ప్రభుత్వానిదే కాదని, ప్రజలందరూ బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితో ఆలోచించి హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టారని, గత ఆరేళ్ళ కాలంలో తెలంగాణలో పచ్చదనం పెరిగిపోయిందన్నారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం అద్భుతంగా ముందుకు సాగుతోందని తెలిపారు. సీఎం కేసీఆర్, ఎంపీ సంతోష్‌కుమార్‌లు మట్టిమనుషులని ప్రశంసించారు. ఈ సందర్భంగా సినీ నటులు మోహన్‌లాల్, సూర్య, రక్షిత్ శెట్టి, హీరోయిన్లు రమ్యకృష్ణ, త్రిషలకు ప్రకాశ్‌రాజ్ గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరారు. -
ఆలస్యమైనందుకు క్షమించండి
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా హీరోహీరోయిన్లు మొక్కలు నాటడమే కాకుండా సహానటులను నామినెట్ చేస్తున్నారు. ప్రభాస్, హీరోయిన్ శృతిహాసన్‌లు ఇచ్చిన చాలెంజ్‌ను రానా దగ్గుబాటి స్వీకరించాడు. ఇవాళ(గురువారం) హైదరాబాద్‌లో రెండు మొక్కలు నాటిన ఫొటోలను ట్విటర్ షేర్ చేస్తూ ఆలస్యంగా చాలెంజ్ స్వీకరించినందుకు క్షమాపణలు కోరడమే కాకుండా.. తనను ఫాలో అయ్యే ప్రతిఒక్కరిని గ్రీన్ ఇండియా చాలెంజ్‌కు నామినేట్ చేశాడు. ‘కాస్తా ఆలస్యమైనందుకు క్షమించండి. రెండు మొక్కలు నాటాను. ఒకటి ఆదిపురుష్ ప్రభాస్, మరోకటి రాక్‌స్టార్ శృతిహాసన్. అలాగే గ్రీన్ ఇండియా చాలెంజ్‌కు నన్ను ఫాలో అవుత్ను ప్రతి ఒక్కరిని నామినేట్ చేస్తున్నా. ఇది గ్రీన్ ఇండియా కోసమే’ అంటూ ట్వీట్ చేశాడు. (చదవండి: ‘మహేష్ బాబు ఇది మీ కోసమే’) Little delayed but here are 2 one for the #Adipurush #Prabhas and the other for The rockstar @shrutihaasan here you go!! #GreenIndiaChallenge nominating everyone who follows me and has the means to....go for it! RT for a greener India!! pic.twitter.com/NnsN1pNpsa — Rana Daggubati (@RanaDaggubati) August 20, 2020 ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు తన పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటి తమిళ హీరో విజయ్ తళపతిని గ్రీన్ ఇండియా చాలెంజ్‌కు నామినేట్ చేసిన విషయం తెలిసిందే. అలాగే మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, సమంతా, రాశికన్నా ఈ కార్యక్రమంలో పాల్గొన్న విషయం తెలసిందే. అయితే ఇటీవల రానా వివాహం తన గర్ల్‌ఫ్రెండ్ మిహీక బజాజ్‌తో రామనాయుడు స్టూడియోలో ఆగష్టు 8న కుటుంబ సభ్యుల మధ్య జరిగిని విషయం తెలిసిందే. దీంతో రానా-మిహీకలకు సినీ ప్రముఖులంతా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. (చదవండి: అన్ని జీవజాతుల్ని సమానంగా చూడాలి) -
‘మహేష్ బాబు ఇది మీ కోసమే’
టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’కు అనూహ్య స్పందన లబిస్తోంది. సంతోష్ కుమార్ చాలెంజ్‌ను అన్ని రంగాల ప్రముఖులు స్వీకరించి మొక్కలు నాటుతున్నారు. ఈ నేపథ్యంలో సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ చాలెంజ్ స్వీకరించారు సూపర్ స్టార్ మహేష్ బాబు. దానిలో భాగంగా తన ఇంట్లోనే పుట్టిన రోజున మొక్కలు నాటారు మహేష్ బాబు. ఆ తర్వాత మొక్కలు పెంచడం వల్ల ఎంత ఉపయోగమో తెలిపారు. ఇది చాలెంజ్ కాదు.. భవిష్యత్ తరాల మనుగడకు ప్రొటెక్షన్ ప్లాన్ అని తెలిపిన మహేష్.. ఈ చాలెంజ్‌కు యంగ్‌టైగర్ ఎన్టీఆర్, తమిళ హీరో ఇలయదళపతి విజయ్, హీరోయిన్ శ్రుతీహాసన్లను నామినేట్ చేశారు. అయితే మహేష్ విసిరిన చాలెంజ్‌ను తమిళ స్టార్ హీరో ఇలయదళపతి విజయ్ స్వీకరించి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మొక్కలు నాటుతున్న ఫొటోలను తన ట్వీట్లో పోస్ట్ చేశారు. (ప్లాస్మా దానం చేసి ప్రాణాలు కాపాడండి) This is for you @urstrulyMahesh garu. Here’s to a Greener India and Good health. Thank you #StaySafe pic.twitter.com/1mRYknFDwA — Vijay (@actorvijay) August 11, 2020 ‘మహేష్‌గారు నేను మొక్కలు నాటేది మీకోసం.. ఇక ఈ మొక్కలు ఆకుపచ్చని భారతావనితో పాటు మంచి ఆరోగ్యం కోసం. ధన్యవాదాలు.. క్షేమంగా ఉండండి’ అని విజయ్ తన ట్వీట్లో పేర్కొంటూ.. మొక్కలు నాటుతున్న ఫొటోలను షేర్ చేశారు. ఇక మహేష్ బాబు విసిరిన చాలెంజ్‌ని త్వరలోనే తీసుకుంటానని శృతిహాసన్ ఇప్పటికే తెలిపారు. తారక్ కూడా మహేష్ చాలెంజ్‌ను స్వీకరిస్తారని సమాచారం. ఇదిలా ఉంటే మహేష్ చెప్పగానే చాలెంజ్ స్వీకరించిన విజయ్‌కు ఆయన అభిమానులు ధన్యవాదాలు తెలుపుతూ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. -
అన్ని జీవజాతుల్ని సమానంగా చూడాలి
మెడపై రూపాయి కాయిన్ ట్యాటూ, చేతికి కట్టుకున్న తాడులో ఓమ్ లాకెట్, ఇయర్ రింగ్.. ఇలా ‘సర్కారువారి పాట’లో మహేశ్‌బాబు చాలా స్టయిలిష్‌గా కనిపిస్తారని తెలుస్తోంది. ఇక ఆదివారం ఆయన బర్త్‌డే సందర్భంగా విడుదల చేసిన సినిమా మోషన్ పోస్టర్ టీజర్ అంచనాలు పెంచే విధంగా ఉంది. పరశురామ్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్, 14రీల్స్ ఎంటర్టైన్మెంట్, జి. మహేశ్‌బాబు ఎంటర్టైన్మెంట్ ప్రై లిమిటెడ్ పతాకాలపై ఈ చిత్రం రూపొందుతోంది. తన పుట్టినరోజుని పురస్కరించుకుని గ్రీన్ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో మహేశ్‌బాబు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ –‘‘ఈ భూమి మీద నివసించే హక్కు మనుషులకు ఎంత ఉందో మొక్కలకీ, జంతువులకీ అంతే ఉంది. అన్ని జీవజాతుల్ని సమానంగా చూడటమే నాగరికత. అభివృద్ధి అంటే మనుషులతో పాటు వృక్షాల ఎదుగుదల కూడా. అందుకే జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా కార్యక్రమంలో అందరూ భాగమవ్వాలి’’ అన్నారు. అలాVó యన్టీఆర్, విజయ్, శ్రుతీహాసన్‌లకు గ్రీన్ఇండియా చాలెంజ్‌ను విసిరారు మహేశ్‌బాబు. -
గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో స్నేహా రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గ్రీన్ ఇండియా చాలెంజ్ ఉద్యమంలా కొనసాగుతుంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈ చాలెంజ్‌ను స్వీకరించి.. పర్యావరణ పరిరక్షణ కోసం తమ వంతుగా మొక్కలు నాటుతున్న సంగతి తెలిసిందే. తాజాగా హీరో అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి ఈ చాలెంజ్‌లో పాలుపంచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత నుంచి చాలెంజ్‌ను స్వీకరించిన ఆమె.. నేడు పిల్లలతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం అయాన్, అర్హలు మొక్కలకు నీళ్లు పోశారు. (వాళ్లిద్దరూ డిశ్చార్జ్ అయ్యారు : అభిషేక్) ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ చాలెంజ్‌కు తనను నామినేట్ చేసినందుకు సుష్మితకు థ్యాంక్స్ చెప్పారు. తదుపరి ఈ చాలెంజ్‌కు తన భర్త అల్లు అర్జున్‌తో పాటు మరో ఇద్దరిని నామినేట్ చేశారు. (బిగ్‌బాస్ ఎంట్రీపై శ్రద్ధా దాస్ క్లారిటీ) View this post on Instagram Thanks @sushmitakonidela for nominating me :) #greenindiachallenge #harahaitohbharahai I nominate @alluarjunonline @rsingareddy @meghanajrao A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) on Jul 27, 2020 at 5:14am PDT -
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న తమిళ స్టార్ హీరో
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి నటుడు విజయ్ సేతుపతి మెక్కలు నాటారు. ఉప్పెన సినిమా దర్శకుడు విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించి చెన్నైలోని తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను మెదలుపెట్టిన ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్‌ని ప్రత్యేకంగా అభినందించారు. చాలా మంచి కార్యక్రమాన్ని చేపట్టారని, అందులో తానూ భాగం అవడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్‌కి , ఛాలెంజ్‌కి తనని నామినేట్ చేసిన డైరెక్టర్ బుచ్చిబాబుకి కృతజ్ఞతలు తెలియజేశారు. (భావితరాలకు ఆకుపచ్చ భారతాన్ని అందించాలి) అలాగే ఉప్పెన సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ‘ఉప్పెన’ సినిమాలో తమిళ్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రముఖ పాత్రలో నటించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటాల్సిందిగా అభిమానులకు పిలుపునిచ్చారు. విజయ్ సేతుపతి ఇప్పటివరకు పిజ్జా, నేను రౌడినే వంటి తెలుగు రీమేక్‌లలో నటించారు. 2009 సైరా నర్సింహారెడ్డిలో మొదటిసారిగా తెలుగులో నటించి మెప్పించారు. ప్రస్తుతం తెలుగులో రెండవ సినిమా ఉప్పెనలో నటించారు. వైష్షవ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటించిన ఈ సినిమా లాక్డౌన్ కారణంగా వాయిదాపడింది. దీంతో ఏప్రిల్‌లో విడుదల కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. (విజయ్ సేతుపతికి జంటగా స్వీటీ) Makkal selvan @VijaySethuOffl accepted the #GreenIndiaChallenge 🌱 given by #Uppena director @BuchiBabuSana and planted saplings at his home. He expressed appreciation towards this great initiative & requested all those waiting for #Uppena should also take part.💚@MPsantoshtrs pic.twitter.com/p8sKuhv5BN — Vamsi Shekar (@UrsVamsiShekar) July 27, 2020 -
భావితరాలకు ఆకుపచ్చ భారతాన్ని అందించాలి
‘‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ అంటూ మొక్కలు నాటే ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టి దూసుకెళుతున్న రాజ్యసభ సభ్యులు సంతోష్‌గారికి అభినందనలు. ఈ కరోనా సమయంలో అందరికీ ప్రాణవాయువు విలువ తెలిసింది. ఈ భూమి తల్లికి కూడా వృక్షాలు, అడవులు ప్రాణవాయువు అందిస్తాయి’’ అని నటుడు చిరంజీవి అన్నారు. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ మరియు జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ ఆధ్వర్యంలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్‌తో కలిసి హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్, దర్శకులు బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి సొసైటీ ప్రాంగణంలో మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ– ‘‘మొక్కలు నాటి ఆకుపచ్చ భారతాన్ని అందించడమే మన భావితరాలకు మనం అందించే గొప్ప సంపద. మనం ఇచ్చే కాలుష్యాన్ని మొక్కలు పీల్చుకుని మనకు ప్రాణవాయువు అందిస్తున్నాయని సంతోష్‌గారు గుర్తించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా మెగా అభిమానులందరూ మొక్కలు నాటాలి’’ అన్నారు. -
ప్రభుత్వం విప్ ఛాలెంజ్‌ను స్వీకరించిన పుల్లెల
సాక్షి, హైదరాబాద్: అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు ఇచ్చిన ఛాలెంజ్‌ను ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ స్వీకరించారు. గ్రీన్ ఇండియా మిషన్ మూడో విడత కార్యాక్రమంలో భాగంగా ఎంపీ సంతోష్ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మహోద్యమంలా సాగుతోంది. ఈ నేపథ్యంలో గువ్వుల ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించి గచ్చిబౌలిలలోని తన అకాడమీ ప్రాంగణంలో పుల్లెల గోపిచంద్ శనివారం మొక్కలు నాటారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. హరితహారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లతో రాష్ట్రంలో పచ్చదనం బాగా పెరిగిందన్నారు. అంతేగాక ఈ కార్యక్రమం వల్ల ప్రజల్లో కూడా పచ్చదనంపై చాలా అవగాహన పెరిగిందన్నారు. ఇక గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా బ్యాడ్మింటన్ ప్లేయర్స్ సిక్కిరెడ్డి, మేఘన, అరుణ్, విష్ణులు మొక్కలు నాటాలని ఆయన పిలుపు నిచ్చారు. -
ఆ చాలెంజ్ చాలా గొప్పది : ఎమ్మెల్యే
నల్లగొండ టూటౌన్ : సీఎం కేసీఆర్ ప్రారంభించిన హరితహారం కార్యక్రమం స్పూర్తితో రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ చాలా గొప్పదని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. మీడియా అకాడమీ చైర్మన్, టీయూడబ్ల్యూజే (143) రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ పిలుపు మేరకు సోమవారం నల్లగొండ జిల్లాకేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో గ్రీన్ చాలెంజ్‌లో భాగంగా ఎమ్మెల్యే జర్నలిస్టులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు గ్రీన్ చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటడడం యువతకు స్పూర్తిదాయకమని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ప్రజలు, యువతలో మార్పు వచ్చి వారి ఇళ్ల ముందు మొక్కలు నాటి పెంచుకుంటారని తెలిపారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలో ఉన్న వెల్నెస్ సెంటర్‌ను సందర్శించి ఉద్యోగులు, జర్నలిస్టులకు అందుతున్న వైద్య సేవల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (143) జిల్లా అధ్యక్షుడు క్రాంతి, ప్రధాన కార్యదర్శి గుండగోని జయశంకర్‌గౌడ్, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మర్రి మహేందర్‌రెడ్డి, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పుల్లారావు, అబ్బగోని రమేష్, రావుల శ్రీనివాస్‌రెడ్డి, వివిధ దిన పత్రికలు, వీడియో, ఫొటో జర్నలిస్టులు పాల్గొన్నారు. -
'ఉపాధి హామీ'తో హరిత భారతం
న్యూఢిల్లీ: స్వచ్ఛ భారత్ అంటూ దేశాన్ని శుద్ధి చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టిన కేంద్ర సర్కారు త్వరలోనే గ్రీన్ ఇండియా(హరిత భారతం) కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఈ కార్యక్రమాన్ని మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్ఆర్ఈజీఏ) సహాయంతో పరుగులు పెట్టించనుంది. దశాబ్ద కాలంలో దేశంలో అటవీ ప్రాంతాలను మరింత మెరుగుపరచాలని, దాదాపు 10 మిలియన్ హెక్టార్లలో హరిత వనాలను పెంచి పోషించాలని, వీటిని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రిమోట్ సెన్సింగ్‌తో నియంత్రణ చేయాలని భావిస్తోంది. ఇప్పటికే ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో పలు చిన్న చిన్న వ్యవసాయ సంబంధ పనులు తీసుకొచ్చిన కేంద్రం తాజాగా అటవీ వనాలు పెంచేందుకు నిర్ణయం తీసుకుందని కేంద్ర అధికార వర్గాలు చెప్తున్నాయి. కేంద్ర పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో 'నేషనల్ మిషన్ ఫర్ ఏ గ్రీన్ ఇండియా' కొనసాగనుంది.