మాట్లాడుతున్న కలెక్టర్ లోకేష్‌కుమార్
హరితహారం కార్యక్రమంలో జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 2.30 కోట్ల మొక్కలు నాటినట్లు కలెక్టర్ డీఎస్.లోకేష్‌కుమార్ తెలిపారు.
-
వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ లోకేష్‌కుమార్ వెల్లడి
ఖమ్మం జెడ్పీసెంటర్: హరితహారం కార్యక్రమంలో జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 2.30 కోట్ల మొక్కలు నాటినట్లు కలెక్టర్ డీఎస్.లోకేష్‌కుమార్ తెలిపారు. మంగళవారం హరితహారం నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భగా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న ఐదు రోజుల్లో మూడు కోట్ల లక్ష్యం సాధిస్తామన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా వ్యవసాయశాఖ, డీఆర్‌డీఏ, అటవీశాఖల ద్వారా ఒక రోజు హరితహారం నిర్వహించి దాదాపు 30 లక్షల మొక్కలు నాటేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. చెరువు కట్టలు, నాగార్జునసాగర్ కాలువగట్ల పక్కన ఈత గింజలు వేసేందుకు ఏడు లక్షల విత్తనాలు తెప్పించినట్లు చెప్పారు. హరితహారంలో స్వయం సహాయక సంఘ సభ్యులను భాగస్వాములను చేసి అధికంగామొక్కలు నాటేలా చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. సత్తుపల్లి, మణుగూరు, ఇల్లెందు పురపాలక సంఘాలలో నిర్దేశించిన స్ధాయిలో మొక్కలు నాటే కార్యక్రమం జరగలేదన్నారు. మెప్మా పీడీ, ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్‌లకు ఆ పురపాలక సంఘాలు లక్ష్యాన్ని సాధించేలా చర్యలు తీసుకోవాలని చెప్పామన్నారు. ప్రతి మండలానికి 6 వేల మామిడి,అన్ని పురపాలక సంఘాలకు 35 వేల మామిడి మొక్కలను పంపిణీæ చేయనున్నట్లు కలెక్టర్ స్పష్టం చేశారు. సీఎస్ మాట్లాడుతూ హరతహారం కార్యక్రమంలో నాటిన మొక్కలను విజిలెన్స్ అండ్‌మానిటరింగ్ కమిటీ విచారణ నిర్వíß స్తుందని, నాటిన మొక్క లేకపోతే చర్యలు తీసుకుంటామన్నారు. నాటిన ప్రతి మొక్కను బతికించే విధంగా సూక్ష్మస్థాయిలో ప్రణాళిక చర్యలు చేపట్టాలని, నీటి లభ్యత వంటి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వీసీలో ఎస్పీ షానవాజ్‌ఖాసీం, జేసీ దివ్య, హరితహారం ప్రత్యేకాధికారి రఘువీర్, జిల్లా అటవీశాఖాధికారి నర్సయ్య, సీఈఓ మారుపాక నాగేశ్ పాల్గొన్నారు.