జడ్చర్ల టౌన్ : హరితహారం, ఎవెన్యూ ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా రోడ్లకు ఇరువైపుల నాటిన ప్రతి మొక్క బతికేలా సంరక్షిస్తేనే ముఖ్యమంత్రి లక్ష్యం నెరవేరినట్టు.. అవసరమైతే జాబ్‌కార్డున్న ఒక కుటుంబానికి పూర్తి బాధ్యత అప్పగించండి..
నాటిన ప్రతి మొక్క బతకాలి
Sep 21 2016 12:18 AM | Updated on Sep 18 2018 6:30 PM
జడ్చర్ల టౌన్ : హరితహారం, ఎవెన్యూ ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా రోడ్లకు ఇరువైపుల నాటిన ప్రతి మొక్క బతికేలా సంరక్షిస్తేనే ముఖ్యమంత్రి లక్ష్యం నెరవేరినట్టు.. అవసరమైతే జాబ్‌కార్డున్న ఒక కుటుంబానికి పూర్తి బాధ్యత అప్పగించండి.. వారికి ఈజీఎస్‌ద్వారా కూలి చెల్లిద్దాం.. అని పంచాయతీరాజ్ కమిషనర్ అనితారాంచంద్రన్ ఆదేశించారు. మంగళవారం మండలంలోని పెద్దపల్లి, పోలీసుశిక్షణకేంద్రం సమీపంలోని రోడ్డు, అల్వాన్‌పల్లి గ్రామాల్లో ఎవెన్యూ ప్లాంటేషన్‌ను పరిశీలించారు. ఆయా గ్రామాల్లో 90శాతం మొక్కలు జీవించి ఉండటాన్ని చూసి నిర్వాహకులను ప్రశంసించారు. కొన్నిచోట్ల చెట్లకు కంచె వేయకపోవటం, రక్షణ చర్యలు తీసుకోకపోవటంతో అసంతప్తి వ్యక్తం చేశారు. నాటిన ప్రతి మొక్క విలువైనదేనని, వాటిని బతికించుకోవడానికి గ్రామాల్లో కూలీల కుటుంబాలను ఎంపిక చేసి వారి ద్వారా చెట్లను కాపాడాలన్నారు. 400 మొక్కలకు జాబ్‌కార్డు కలిగిన భార్యాభర్తలకు బాధ్యతలు అప్పగించాలన్నారు. కార్యక్రమంలో స్పెషల్æకమిషనర్ ఆశ, పీడీ దామోదర్‌రెడ్డి, అడీషల్ పీడీ గణేష్, ఏపీడీ జకియాసుల్తాన, ఏపీఓ భారతి, టీఏ విజయభాస్కర్‌లు ఉన్నారు.
Advertisement
Advertisement