- కలెక్టర్ నీతూప్రసాద్
ముమ్మరంగా మొక్కలు నాటాలి
Published Thu, Sep 1 2016 9:57 PM | Last Updated on Thu, Mar 21 2019 8:16 PM
ముకరంపుర : వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నందున ముమ్మరంగా మొక్కలు నాటాలని కలెక్టర్ నీతూప్రసాద్ అధికారులకు సూచించారు. ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మండల ప్రత్యేకాధికారులతో గురువారం హరితహారం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల ప్రగతిపై వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. 35 లక్షల టేకు స్టంపులను అన్ని మండలాలకు పంపించామని, రెండు, మూడురోజుల్లో నాటాలని ఆదేశించారు. అన్ని మొక్కలకు రిజిస్టర్, జియోట్యాగింగ్ చేయాలని సూచించారు. మెుక్కల సంరక్షణకు బోర్‌వెల్స్ మంజూరు చేస్తామని తెలిపారు. సెప్టెంబర్ నుంచి డ్వామా ద్వారా నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. మొక్కలు నాటిన తర్వాత 3 రోజుల్లో కూలీలకు డబ్బులు చెల్లించాలని తెలిపారు. ఇంకుడుగుంతలు, ఐఎస్‌ఎల్ నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ కృష్ణభాస్కర్, ఏజేసీ నాగేంద్ర, డీఆర్‌వో వీరబ్రహ్మయ్య పాల్గొన్నారు.
Advertisement
Advertisement