కాన్ఫరెన్స్ ద్వారా అటవీశా«ఖ అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్
– అటవీ శాఖ అధికారులకు కలెక్టర్ ఆదేశం
చిత్తూరు (కలెక్టరేట్) : జిల్లాలో నాటిన మొక్కల్లో ఏ ఒక్కటీ ఎండిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత అటవీ శాఖాధికారులపై ఉందని కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ అన్నారు. బుధవారం సాయంత్రం ఆయన అటవీ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఖాళీ స్థలాలు, ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణాలు, విద్యాలయాలు, ప్రైవేటు కార్యాలయాల ప్రాంగణాలు, పొలాల గట్లు, రోడ్లకిరువైపులా మొక్కలు నాటాలని సూచించారు. ఇందులో విద్యార్థులను, ఉద్యోగులను, ప్రజలను భాగస్వాములను చేయాలని తెలిపారు. 29న వనమహోత్సవ కార్యక్రమాన్ని నిబద్ధతతో నిర్వహించాలన్నారు. జిల్లాలో 11 లక్షల మొక్కలు నాటాలని, ప్రతి మొక్కనూ సంరక్షించాలని అన్నారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టిన ఎఫ్‌ఆర్‌వోలకు రూ.50వేలు క్యాష్ అవార్డు ఉంటుందన్నారు. డీఎఫ్‌వో చక్రపాణి మాట్లాడుతూ మొక్కలు నాటిన తర్వాత వాటిని ఫొటో తీసి అటవీ శాఖ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని అందులో అప్‌లోడ్ చేయాలన్నారు. వనమహోత్సవంపై విద్యార్థులకు వక్తత్వ, క్విజ్, చిత్రలేఖనం తదితర పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందించాలని తెలిపారు. ఈ సమావేశంలో డీఎఫ్‌వోలు శ్రీనివాసులు, జగన్నాథసింగ్, ఫారెస్టు రేంజ్ అధికారులు, నియోజకవర్గ అధికారులు పాల్గొన్నారు.