
అగ్నిప్రమాదం జరిగిన జామాయిల్ ప్లాంటేషన్
సింగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెం ఏరియా పరిధిలోనీ వీకె–7 షాప్ట్ వద్దగల జామాయిల్ ప్లాంటేషన్లో, ఐటీఐ వద్దగల జామాయిల్ ప్లాంటేషన్‌లో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు వచ్చాయి. దాదాపు 200 ఎకరాల జీడి మామిడి, జామాయిల్ ప్లాంటేషన్ కాలిపోయింది. నష్టం విలువ దాదాపు నాలుగు లక్షల రూపాయలు ఉంటుందని అంచనా.
ఈ ప్రమాదానికి కారణాలు తెలియలేదు. ఫైర్ సిబ్బంది, సింగరేణి రెస్క్యూ సిబ్బంది కలిసి రెండు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ మంటలతో పాములు పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి రావటంతో అందరూ కలవరపడ్డారు.