న్యాల్కల్ : విద్యుత్ షార్ట్ సర్యూట్ కారణంగా మెదక్ జిల్లా న్యాల్కల్ మండలం మిర్జాపూర్(బి) గ్రామంలో మూడెకరాల్లో చెరకు తోట దగ్ధం అయింది. బాధిత రైతుల కథనం ప్రకారం.. మంగలి అంజన్న, ఎక్కెల్లి నర్సప్పలు మూడెకరాల్లో చెరకు పంటను సాగు చేశారు. ప్రస్తుతం చెరకు పంట క్రషింగ్‌కు వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో పొలం సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుంచి శనివారం మధ్యాహ్నం సమయంలో వచ్చిన మంటలు చెరకు తోటకు అంటుకున్నాయి. దీంతో పంట అంతా బూడిదైపోయింది.