jam oil garden
-
అక్రమాల జామాయిల్
పశ్చిమగోదావరి, జీలుగుమిల్లి: కంచే చేను మేస్తే చందంగా తయారైంది జిల్లాలోని జామాయిల్ ప్లాంటేషన్ల పరిస్థితి. అట వీ సంపదను కాపాడాల్సిన అధికారులే అక్రమార్కులతో చేతులు కలిపి అవినీతికి పాల్పడుతూ అందినకాడికి దోచుకుంటున్నారు. జీలుగుమిల్లి మండలం పి.రాజవరం, పి.అంకంపాలెం, లంకా లపల్లి, ములగలంపల్లి, దర్బగూడెంలోని జామాయిల్ ప్లాంటేషన్లలో అక్రమాలు చోటుచేసుకున్నా యి. ఇక్కడ టన్నుల కొద్దీ జామాయిల్ కలప పక్కదారి పట్టింది. అధికారుల కనుసన్నల్లోనే అక్రమ రవాణా జరుగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన కోట్లాది రూపాయల ఆదాయానికి గండి పడుతోంది. ఆయా ప్లాంటేషన్లలో కలప కటింగ్‌ను ఇద్దరు కాంట్రాక్టర్లకు అప్పగించారు. జామాయిల్ కలప కోతను ప ర్యవేక్షించాల్సిన అధికారులు చూసీచూడనట్టు వది లివేస్తున్నారు. కాంట్రాక్టర్లు పర్సంటేజీలు ముట్టజెప్పడంతో వాహనాలను పక్కదారి పట్టించి వచ్చిన సొమ్మును అధికారులు పంచుకుంటున్నారు. రైతుల పేరుతో అమ్మకం ప్లాంటేషన్‌లో కటింగ్ అయిన జామాయిల్ కలప ను రైతుల పేరుతో అమ్ముకుంటున్నారు. ప్లాంటేష న్లో నరికిన జామాయిల్‌ను లారీలు, ట్రాక్టర్లలో లోడ్ చేసి రైతుల పేరుతో పర్మిట్లు తీసుకుని ద ర్జాగా అమ్మేస్తున్నారు. ఇలా జరుగుతున్న అక్రమ రవాణాను ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు కూడా పట్టుకోలేకపోతున్నాయి. దీంతో జీలుగుమిల్లిలో జాతీయ రహదారిపై అక్రమ జామాయిల్ రవా ణా యథేచ్ఛగా సాగుతోంది. చక్కగా చెక్‌పోస్టులు దాటిస్తూ.. జామాయిల్ వాహనాలను తనిఖీ చేయకుండా ముందుగానే చెక్‌పోస్టుల సిబ్బందికి లారీకో రేటు, ట్రాక్టర్కో రేటు చొప్పున స్మగ్లర్లు ముట్టచెబుతున్నారు. వాహనాలు చెక్‌పోస్ట్‌కు చేరుకునేలోపు ముందుగానే ద్విచక్రవాహనంపై ఇద్దరు స్మగర్లు చెక్‌పోస్టుకు చేరుకుని తమ వాహనం వెళుతుందని అక్కడ డ్యూటీలో సిబ్బందికి సమాచారం చేర వేస్తారు. లోడు లెక్కన సొమ్ములు ముట్టజెప్పి చెక్‌పోస్ట్ వాహనాలను దాటించేస్తారు. కొలతల్లో తేడాలు చూపుతూ.. జామాయిల్ ప్లాంటేషన్ కటింగ్ చేసే ముందు కొలతలు తీస్తారు. ప్లాంటేషన్‌లో సమాంతరంగా ఉన్న ఒక చెట్టును నరికి దానిని ముక్కలు చేసి ఒక చెట్టు ఎన్ని ముక్కలు వస్తుంది. దానిని బట్టి ఎన్ని టన్నులు వస్తుందని లెక్కలు వేసి ప్లాంటేషన్ మొ త్తంగా టన్నుల కలప వస్తుందని అధికారులు లె క్కలు కట్టి కటింగ్‌కు అనుమతులు ఇస్తారు. అయి తే కొలతలు తీసే సమయంలోనే కిందిస్థాయి అధికారులు చెట్టు కొలతల్లో తేడా చూపిస్తారు. ప్లాంటేషన్‌లో 10 వేల టన్నుల కలప దిగుబడి వచ్చే అవకాశం ఉంటే కొలతల సమయంలోనే ఐ దు నుంచి ఏడు వేల టన్నుల దిగుబడి వస్తుందని అంచనాలు తయారు చేస్తారు. ఇలా ఒక్కో ప్లాంటేషన్‌లో దిగుబడి సగం వరకు తగ్గించి చూపిస్తారు. ఒక్కో ప్లాంటేషన్‌లో అయితే నాలుగు నుంచి మూ డు వేల టన్నుల వరకు కూడా తేడా చూపిస్తారు. ఎక్కువ దిగుబడి వచ్చే ప్లాంటేషన్‌లో తక్కువ చూపి మిగిలిన కలపను పక్కదారి పట్టిస్తారు. అధికారుల కనుసన్నల్లోనే.. జామాయిల్ కలప అక్రమ రవాణా అంతా అధికారుల కనుసన్నల్లోనే జరుగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. ముడుపులు కూడా కింద స్థాయి నుంచి పై స్థాయి అధికారి వరకు అందడంతో ఈ తతంగం అంతా గుట్టుచప్పుడు కాకుండా జరిగి పోతోంది. సగంపైగా పక్కదారి అటవీ సంపదను అధికారులు, అక్రమార్కులు కలిసి దోచుకుంటున్నారు. ప్లాంటేషన్ డేటాలో తేడా చూపి ప్రభుత్వానికి రావాల్సిన కోట్ల రూపాయలను దోచుకుంటున్నారు. జామాయల్ వెదురు కలప ప్లాంటేషన్లలో సగానికి సగం కలపను ఇంటి దొంగలు పక్కదారి పట్టిస్తున్నారు.– జువ్వాల బాపూజీ, జీలుగుమిల్లి -
గుడారమే ‘ఆధారం’
ములకలపల్లి: వారంతా రెక్కాడితేగానీ డొక్కాడని నిరుపేదశ్రామికులు.. ఆంధ్రాలోని నర్సీపట్నం, శ్రీకాకుళం తదితర ప్రాంతాల నుంచి జామాయిల్ తోటలు నరికేందుకు ఇక్కడకు వచ్చారు.. పనిచేసేచోటే తాత్కాలికంగా గుడారాలు వేసుకొని తోటలు నరుకుతున్నారు.. వానైనా, వరదైనా వారికి ఈ గుడారాలే జీవన ‘ఆధారం’.. ఒక్కో గుంపులో సుమారు యాభై మంది వరకూ నివసించే ఈ కష్టజీవుల జీవనానికి ఈ చిత్రం సజీవ సాక్ష్యం. -
జామాయిల్ ప్లాంటేషన్‌లో మంటలు
సింగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెం ఏరియా పరిధిలోనీ వీకె–7 షాప్ట్ వద్దగల జామాయిల్ ప్లాంటేషన్‌లో, ఐటీఐ వద్దగల జామాయిల్ ప్లాంటేషన్‌లో బుధవారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు వచ్చాయి. దాదాపు 200 ఎకరాల జీడి మామిడి, జామాయిల్ ప్లాంటేషన్ కాలిపోయింది. నష్టం విలువ దాదాపు నాలుగు లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ ప్రమాదానికి కారణాలు తెలియలేదు. ఫైర్ సిబ్బంది, సింగరేణి రెస్క్యూ సిబ్బంది కలిసి రెండు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ మంటలతో పాములు పెద్ద సంఖ్యలో రోడ్డుపైకి రావటంతో అందరూ కలవరపడ్డారు. -
జామాయిల్ తోట దగ్ధం
రూ.20 లక్షలకు పైగా నష్టం గిరిజన కుటుంబాల ఆవేదన ఆత్మకూరురూరల్ : గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో గిరిజనులకు చెందిన సుమారు 48 ఎకరాల్లో జామాయిల్ తోటలు దగ్ధమైన సంఘటన మండలంలోని రామస్వామిపల్లిలో శనివారం జరిగింది. బాధితుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన గిరిజనులు 20 కుటుంబాలకు 15 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం భూ పంపిణీలో భాగంగా కుటుంబానికి 2.50 ఎకరాల చొప్పున భూమి పంపిణీ చేసింది. అప్పటి నుంచి గిరిజనులు వివిధ రకాల పైర్లు సాగు చేసుకుంటున్న క్రమంలో నష్టాలకు గురికావడంతో సులభంగా ఉండే జామాయిల్ తోటలను సాగు చేయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అన్ని గిరిజన కుటుంబాలు కొందరు రైతుల సహకారంతో జామాయిల్ తోటలు సాగు చేసుకుంటున్నారు. గత వారం రోజుల క్రితం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గిరిజనులకు చెందిన ఈ భూముల్లో కొందరితో కలిసి సర్వే చేశాడు. ఇదేంటని ప్రశ్నించిన గిరిజనులకు ఈ భూముల్లో తమ భూములు సైతం కలిసి ఉన్నాయని, అందుకే సర్వే చేస్తున్నట్లు చెప్పాడని బాధిత గిరిజనులు తెలిపారు. అయితే ఇది జరిగిన వారం రోజుల లోపే జామాయిల్ తోటలు దగ్ధం కావడంతో రూ.20 లక్షలకు పైగా నష్టం సంభవించిన గిరిజన కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఇది ఎవరో కావాలని చేసిన విద్రోహ ఫలితమేనని వాపోతున్నారు. సమాచారం తెలుసుకున్న రెవెన్యూ, పోలీసు సిబ్బంది పరిశీలించారు. -
జామాయిల్ తోటకు నిప్పు
నారాయణపురంలో వీఎస్ఎస్ తోట దగ్ధం 260 ఎకరాల పంటకు నష్టం నారాయణపురం (ఉంగుటూరు) : నారాయణపురం వనసంరక్షణ సమితి (వీఎస్ఎస్)కి చెందిన ఉంగుటూరు ‘ఎ’ బ్లాక్ జామాయిల్ తోటలో అగ్గిరాజుకుంది. బుధవారం మధ్యాహ్న సమయంలో తోటలో నుంచి విపరీతంగా పొగలు రావడంతో సమీపంలోని సిరామిక్స్ పరిశ్రమ సిబ్బంది గ్రహించి అధికారులకు సమాచారమందించారు. సుమారు 260 ఎకరాల తోటలో నాలుగు దిక్కులా మంటలు ఎగసిపడ్డాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మంటలు కొనసాగాయి. తాడేపల్లిగూడెం అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఫైర్ ఇంజిన్ ఒక్కటే కావడంతో ఓ దశలో మంటలను అదుపుచేయడం కష్టంగా మారింది. ఉంగుటూరు ఆర్ఐ బొడ్డేపల్లి దుర్గా ప్రసాద్, చేబ్రోలు ఎస్సై వి.చంద్రశేఖర్, వీఆర్వో బి.ఫణి, అటవీ శాఖ సిబ్బంది, యువకులు మంటలను అదుపు చేసేందుకు సాయపడ్డారు. వీఎస్ఎస్ అధ్యక్షురాలి ఆందోళన జామాయిల్ తోట అంటుకోవడంతో వన సంరక్షణ సమితి అధ్యక్షురాలు ఉలిపి లక్ష్మి డీలా పడ్డారు. ఎన్నో ఏళ్లుగా పెంచిన తోటకు నిప్పంటుకోవడంతో ఆమె తట్టుకోలేకపోతున్నారు. ఎంత మేరకు నష్టం జరిగిందో అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రాంతంలో అసాంఘిక కార్యక్రమాలు ఎక్కువుగా జరుగుతున్నాయని, కాల్చి పారేసిన సిగరెట్ వల్ల నిప్పంటుకుందా, ఎవరైనా ఉద్దేశపూర్వకంగా అంటించారా అన్నది తెలియడం లేదని స్థానికులు అంటున్నారు. సంఘటనతో నారాయణపురం, ఉంగుటూరు, గోపీనాథపట్నం, చేబ్రోలు వాసులు భయాందోళన చెందుతున్నారు.