జామాయిల్ ప్లాంటేషన్ నుంచి కలపను లారీపై రవాణా చేస్తున్న దృశ్యం (ఫైల్)
పశ్చిమగోదావరి, జీలుగుమిల్లి: కంచే చేను మేస్తే చందంగా తయారైంది జిల్లాలోని జామాయిల్ ప్లాంటేషన్ల పరిస్థితి. అట వీ సంపదను కాపాడాల్సిన అధికారులే అక్రమార్కులతో చేతులు కలిపి అవినీతికి పాల్పడుతూ అందినకాడికి దోచుకుంటున్నారు. జీలుగుమిల్లి మండలం పి.రాజవరం, పి.అంకంపాలెం, లంకా లపల్లి, ములగలంపల్లి, దర్బగూడెంలోని జామాయిల్ ప్లాంటేషన్లలో అక్రమాలు చోటుచేసుకున్నా యి. ఇక్కడ టన్నుల కొద్దీ జామాయిల్ కలప పక్కదారి పట్టింది. అధికారుల కనుసన్నల్లోనే అక్రమ రవాణా జరుగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన కోట్లాది రూపాయల ఆదాయానికి గండి పడుతోంది. ఆయా ప్లాంటేషన్లలో కలప కటింగ్‌ను ఇద్దరు కాంట్రాక్టర్లకు అప్పగించారు. జామాయిల్ కలప కోతను ప ర్యవేక్షించాల్సిన అధికారులు చూసీచూడనట్టు వది లివేస్తున్నారు. కాంట్రాక్టర్లు పర్సంటేజీలు ముట్టజెప్పడంతో వాహనాలను పక్కదారి పట్టించి వచ్చిన సొమ్మును అధికారులు పంచుకుంటున్నారు.
రైతుల పేరుతో అమ్మకం
ప్లాంటేషన్‌లో కటింగ్ అయిన జామాయిల్ కలప ను రైతుల పేరుతో అమ్ముకుంటున్నారు. ప్లాంటేష న్‌లో నరికిన జామాయిల్‌ను లారీలు, ట్రాక్టర్లలో లోడ్ చేసి రైతుల పేరుతో పర్మిట్‌లు తీసుకుని ద ర్జాగా అమ్మేస్తున్నారు. ఇలా జరుగుతున్న అక్రమ రవాణాను ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు కూడా పట్టుకోలేకపోతున్నాయి. దీంతో జీలుగుమిల్లిలో జాతీయ రహదారిపై అక్రమ జామాయిల్ రవా ణా యథేచ్ఛగా సాగుతోంది.
చక్కగా చెక్‌పోస్టులు దాటిస్తూ..
జామాయిల్ వాహనాలను తనిఖీ చేయకుండా ముందుగానే చెక్‌పోస్టుల సిబ్బందికి లారీకో రేటు, ట్రాక్టర్‌కో రేటు చొప్పున స్మగ్లర్లు ముట్టచెబుతున్నారు. వాహనాలు చెక్‌పోస్ట్‌కు చేరుకునేలోపు ముందుగానే ద్విచక్రవాహనంపై ఇద్దరు స్మగర్లు చెక్‌పోస్టుకు చేరుకుని తమ వాహనం వెళుతుందని అక్కడ డ్యూటీలో సిబ్బందికి సమాచారం చేర వేస్తారు. లోడు లెక్కన సొమ్ములు ముట్టజెప్పి చెక్‌పోస్ట్ వాహనాలను దాటించేస్తారు.
కొలతల్లో తేడాలు చూపుతూ..
జామాయిల్ ప్లాంటేషన్ కటింగ్ చేసే ముందు కొలతలు తీస్తారు. ప్లాంటేషన్‌లో సమాంతరంగా ఉన్న ఒక చెట్టును నరికి దానిని ముక్కలు చేసి ఒక చెట్టు ఎన్ని ముక్కలు వస్తుంది. దానిని బట్టి ఎన్ని టన్నులు వస్తుందని లెక్కలు వేసి ప్లాంటేషన్ మొ త్తంగా టన్నుల కలప వస్తుందని అధికారులు లె క్కలు కట్టి కటింగ్‌కు అనుమతులు ఇస్తారు. అయి తే కొలతలు తీసే సమయంలోనే కిందిస్థాయి అధికారులు చెట్టు కొలతల్లో తేడా చూపిస్తారు. ప్లాంటేషన్‌లో 10 వేల టన్నుల కలప దిగుబడి వచ్చే అవకాశం ఉంటే కొలతల సమయంలోనే ఐ దు నుంచి ఏడు వేల టన్నుల దిగుబడి వస్తుందని అంచనాలు తయారు చేస్తారు. ఇలా ఒక్కో ప్లాంటేషన్‌లో దిగుబడి సగం వరకు తగ్గించి చూపిస్తారు. ఒక్కో ప్లాంటేషన్‌లో అయితే నాలుగు నుంచి మూ డు వేల టన్నుల వరకు కూడా తేడా చూపిస్తారు. ఎక్కువ దిగుబడి వచ్చే ప్లాంటేషన్‌లో తక్కువ చూపి మిగిలిన కలపను పక్కదారి పట్టిస్తారు.
అధికారుల కనుసన్నల్లోనే..
జామాయిల్ కలప అక్రమ రవాణా అంతా అధికారుల కనుసన్నల్లోనే జరుగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. ముడుపులు కూడా కింద స్థాయి నుంచి పై స్థాయి అధికారి వరకు అందడంతో ఈ తతంగం అంతా గుట్టుచప్పుడు కాకుండా జరిగి పోతోంది.
సగంపైగా పక్కదారి
అటవీ సంపదను అధికారులు, అక్రమార్కులు కలిసి దోచుకుంటున్నారు. ప్లాంటేషన్ డేటాలో తేడా చూపి ప్రభుత్వానికి రావాల్సిన కోట్ల రూపాయలను దోచుకుంటున్నారు. జామాయల్ వెదురు కలప ప్లాంటేషన్‌లలో సగానికి సగం కలపను ఇంటి దొంగలు పక్కదారి పట్టిస్తున్నారు.– జువ్వాల బాపూజీ, జీలుగుమిల్లి
Comments
Please login to add a commentAdd a comment