చెట్టు నరికివేతపై అధికారి ఆగ్రహం
మండలంలోని అమ్దాపూర్ గ్రామ శివారులో హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలకు కంచె ఏర్పాటుకు వేప చెట్టును ఉపాధి హామీ కూలీలు కొట్టేయడంపై జాతీయ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అధికారి సుధాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆర్మూర్ : మండలంలోని అమ్దాపూర్ గ్రామ శివారులో హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలకు కంచె ఏర్పాటుకు వేప చెట్టును ఉపాధి హామీ కూలీలు కొట్టేయడంపై జాతీయ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అధికారి సుధాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన ఆర్మూర్ ఎంపీడీవో లింగయ్యతో కలిసి అమ్దాపూర్, దేగాం, ఖానాపూర్, మగ్గిడి, సుర్బిర్యాల్, మంథని తదితర గ్రామాల్లో హరితహారం పనులను పరిశీలించారు. మొక్కల రక్షణకు కంచెగా సర్కారు తుమ్మ చెట్టు కొమ్మలను మాత్రమే వాడాలని సూచించారు. ఆయన వెంట ఈజీఎస్ ఆర్మూర్ ఇన్‌చార్జి ఏపీవో అల్తాఫ్, సిబ్బంది తదితరులున్నారు.