కరీంనగర్ రూరల్ : కరీంనగర్ మండలంలో గురువారం నుంచి 15 వరకు రెండో దశ మెగా ప్లాంటేషన్ చేపడుతున్నట్లు ఆర్డీవో చంద్రశేఖర్ తెలిపారు. మండల పరిషత్‌లో బుధవారం హరితహారం నిర్వహణపై నోడల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈనెల 11 నుంచి 15 వరకు 5 లక్షల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. మొదటి విడతలో నాటిన 4లక్షల మొక్కలను సంరక్షించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఎంపీడీవో దేవేందర్‌రాజు, ఈవోపీఆర్డీ దేవకిదేవి, ఈజీఎస్ ఏపీవో శోభ తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి రెండో దశ మెగా ప్లాంటేషన్
Published Wed, Aug 10 2016 11:40 PM | Last Updated on Tue, Sep 18 2018 6:30 PM
రేకుర్తిలో 500 గన్నేరు మొక్కలు
రేకుర్తిలో రాజమండ్రి నుంచి తెప్పించిన 500 గన్నేరు మొక్కలను నాటే కార్యక్రమాన్ని సర్పంచ్ నందెల్లి పద్మ ప్రారంభించారు. శాతవాహన యూనివర్సిటీ నుంచి జగిత్యాల ఆర్‌అండ్‌బీ రోడ్డు వరకు గల డివైడర్ల మధ్య ఈ మొక్కలు నాటారు. ఉపసర్పంచ్ ఎస్.కష్ణకుమార్, ఎంపీటీసీ శేఖర్, పీఆర్ ఏఈ, నోడల్ అధికారి జగదీశ్, వార్డుసభ్యులు ఎస్.నారాయణ, మాజీద్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement