మొక్కలు నాటిన విదేశీయులు
మొక్కలు నాటిన విదేశీయులు
Published Sun, Jul 17 2016 8:58 PM | Last Updated on Tue, Sep 18 2018 6:30 PM
డోర్నకల్ : వరంగల్ జిల్లా డోర్నకల్ మండలం పెరుమాళ్ల సంకీస, రాయిగూడెం గ్రామాల్లో ఆదివారం హరితహారం కార్యక్రమంలో భాగంగా విదేశీయులు మొక్కలు నాటారు. నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన స్వచ్ఛంద సంస్థ పీపుల్స్ ఎయిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అమెరికాకు చెందిన తొమ్మిది మంది మండలంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. పెరుమాళ్లసంకీసలో సర్పంచ్ శెట్టి వెంకన్నతో కలిసి, రాయిగూడెంలో బంజారా సేవా సమితి ప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా బృందం ప్రతినిధి రే మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, హరితహారం తదితర కార్యక్రమాల గురించి తెలుసుకున్నట్లు చెప్పారు.
వరంగల్‌లో హిజ్రాలు..
కరీమాబాద్ : కరీమాబాద్‌కు చెందిన తెలంగాణా హిజ్రాల సమితి ఆధ్వర్యంలో సుమారు 140 మంది హిజ్రాలు ఉర్సు శివారు ఫ్లై ఓవర్ బ్రిడ్జ్ వద్ద ప్రభుత్వం తమకు కేటాయించిన ఎకరం భూమిలో 500 మొక్కలు నాటారు. నాటిన ప్రతి మెుక్కను సంరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో హిజ్రాల నాయకురాలు ఓరుగంటి లైలా, గౌతమి, రంజిత, సరిత, దీప, రమ్యమ్మ, అశ్విని, సుధ పాల్గొన్నారు.
Advertisement
Advertisement