సమావేశంలో మాట్లాడుతున్న ఎంజే.అక్బర్
-
నియోజకవర్గ అధికారులదే బాధ్యత
-
కన్జర్వేటర్ ఆఫ్ పారెస్టర్ ఎంజే.అక్బర్
ముకరంపుర : జిల్లాలో నిర్దేశించిన లక్ష్యం మేరకు 4.25 కోట్ల మొక్కలను నాటాలని వరంగల్ రేంజ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టర్ ఎంజే.అక్బర్ అన్నారు. సోమవారం నియోజకవర్గ స్థాయి అధికారులతో హరితహారంపై సమీక్షించారు. నియోజకవర్గ ప్రత్యేకాధికారులు మెుక్కలు నాటించే బాధ్యత తీసుకోవాలన్నారు. జిల్లాలో మొక్కలు నాటడం మెల్లగా సాగుతోందని, వేగవంతం చేయాలని సూచించారు.
ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. టేకు, యూకలిప్టస్, ఈత మొక్కలు కొనుగోలు చేస్తున్నామని, రెండుమూడు రోజుల్లో నేరుగా మండల కేంద్రాలకు పంపుతామని తెలిపారు. జిల్లాలోని నర్సరీల్లో వివిధ రకాల మొక్కలు కోటి వరకు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతి మొక్కను జియో ట్యాగింగ్ చేయాలన్నారు. జేసీ శ్రీదేవసేన మాట్లాడుతూ ఉపాధిహామీలో మంజూరు చేసిన మేరకు గుంతలు తవ్వాలన్నారు. ఉపాధిహామీలో తదుపరి మంజూరు ఉత్తర్వులు రావని తెలిపారు. ఏజేసీ నాగేంద్ర, డీఎఫ్‌వోలు, సోషల్ ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు.