పుష్కర పార్కింగ్ స్థలాల్లో మెుక్కల పెంపకం
పుష్కర పార్కింగ్ స్థలాల్లో మెుక్కల పెంపకం
Published Wed, Sep 14 2016 8:27 PM | Last Updated on Tue, Sep 18 2018 6:30 PM
మఠంపల్లి : పుష్కరాల కోసం మండలంలోని మట్టపల్లి వద్ద 100 ఎకరాల్లో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలంలో అధికారులు మెుక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ మేరకు బుధవారం వర్ధాపురం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, సైట్ ఇన్‌చార్జి బి.మురళి నేతృత్వంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. చింతలమ్మగూడెం ఫారెస్ట్ బీట్ పరిధిలో ఉన్న అటవీ భూమిలో పార్కింగ్‌కు కేటాయించిన స్థలంలో ఇటీవల 20 వేల గుంతలు తవ్వారు వీటిలో వేప, గానుగ, దిరిసిన, నారవేప, నెమలినార, సీమతంగేడు వంటి 12 వేల మెుక్కలు నాటినట్లు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బి.మురళి తెలిపారు.
Advertisement
Advertisement