లక్నో: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో పర్యావరణం దెబ్బతింటోందని యూపీ మాజీ సీఎం, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ విమర్శలు గుప్పించారు. పర్యావరణ పరిరక్షణపై బీజేపీ ఆర్భాటపు ప్రకటనలు చేస్తోందని మండిపడ్డారు. ‘‘బీజేపీ ప్రభుత్వం ఏటా మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతుంది. కానీ ఏ సంవత్సరంలో.. ఎక్కడ, ఎన్ని మొక్కలు నాటారు, ఎన్ని విత్తనాలు చల్లారనే వివరాలను వెల్లడించడం లేదు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పర్యావరణం నాశనం అయ్యింది’’అని అఖిలేశ్ యాదవ్ ఎద్దేవా చేశారు.
బీజేపీ యూపీలో పాలనా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో పర్యావరణ విధ్వంసం సాగుతోందని అఖిలేశ్ యాదవ్ దుయ్యబట్టారు. తమ హయాంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో చేపట్టామని గుర్తుచేశారు. బుందేల్ ఖండ్ ప్రాంతంలో చెరువులు తవ్వి, గ్రీన్ పార్కులు డెవలప్ చేశామని చెప్పారు.
30 కోట్ల మొక్కలను నాటాలని యూపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. జూలై మొదటి వారంలో ప్రారంభమయ్యే ఈ ఏడాది ప్లాంటేషన్ డ్రైవ్‌లో 30 కోట్ల మొక్కలను నాటాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు గాను జిల్లా వ్యాప్తంగా భూమి, మొక్కలను గుర్తించాలని జిల్లా న్యాయాధికారులను (డీఎం) కోరినట్లు మంగళవారం ఒక సీనియర్ అధికారి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment