లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు నేడు (బుధవారం) ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ స్థానాల్లో యోగి(సమాజ్‌వాదీ), అఖిలేష్(బీజేపీ) మధ్య ప్రత్యక్ష పోటీ నెలకొంది. యూపీలో 2027లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఈ ఎన్నికలను సెమీ ఫైనల్‌గా పరిగణిస్తున్నారు.
ఉప ఎన్నికల్లో బీజేపీ, ఎన్‌సీపీ రెండూ తమ సత్తామేరకు ప్రచారపర్వాన్ని నిర్వహించాయి. ఈ స్థానాల్లో జరుగుతున్న ఉపఎన్నికలు ఇరు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా నిలిచాయి. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు యూపీ అధికార సింహాసనానికి మార్గాన్ని నిర్ణయించేవిగా మారనున్నాయని విశ్లేషకులు అంటున్నారు. అటు యోగి ఆదిత్యనాథ్ ఇటు అఖిలేష్ యాదవ్‌లలో తదుపరి సీఎం ఎవరు అనే దానిపై ఈ ఎన్నికలు అంచనాలను వెలువరించనున్నాయి. అందుకే ఈ ఎన్నికలు యూపీకి అగ్నిపరీక్షగా నిలిచాయని పలువురు అభివర్ణిస్తున్నారు.
అఖిలేష్ యాదవ్ లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ కంటే అధికంగా సీట్లు గెలుచుకున్నారు. ఇప్పుడు జరుగుతున్న ఈ ఉప ఎన్నికల్లో తొమ్మిది స్థానాల్లో 90 మంది అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. మొత్తం తొమ్మిది స్థానాల్లో బీజేపీ-ఎస్పీ, బీఎస్పీ మధ్య ముక్కోణపు పోటీ ఉంది. అయితే ప్రత్యక్ష పోటీ మాత్రం బీజేపీ, ఎస్పీ మధ్యే ఉండనుందనే అంచనాలున్నాయి.
ఈ తొమ్మిది స్థానాల్లో 2022లో జరిగిన ఎన్నికల ఫలితాలను చూస్తే సమాజ్ వాదీ పార్టీకి నాలుగు సీట్లు, ఎన్‌డీఏకు ఐదు సీట్లు, బీజేపీకి మూడు సీట్లు, మిత్రపక్షాలకు రెండు సీట్లు దక్కాయి. టిక్కెట్ల పంపిణీలో అఖిలేష్ ముస్లిం కార్డును ఉపయోగించుకోగా, బీజేపీ ఓబీసీలను రంగంలోకి దింపింది. బీజేపీ గరిష్టంగా ఐదుగురు ఓబీసీ అభ్యర్థులను నిలబెట్టగా, వీరిలో ఒకరు దళితుడు, ముగ్గురు అగ్రవర్ణాలకు చెందినవారు ఉన్నారు. ముస్లింలకు బీజేపీ టిక్కెట్టు ఇవ్వలేదు. కాగా, సమాజ్‌వాదీ పార్టీ అత్యధికంగా నలుగురు ముస్లిం అభ్యర్థులను నిలబెట్టింది. అలాగే ముగ్గురు ఓబీసీ అభ్యర్థులు, ఇదరు దళిత అభ్యర్థులకు టిక్కెట్ ఇచ్చింది. అగ్రవర్ణాలకు ఒక్క టిక్కెట్టు కూడా కేటాయించలేదు. ఈసారి ఓటర్లు ఎవరివైపు మొగ్గుచూపుతారో, ఎవరిని ఓడిస్తారో వేచి చూడాల్సిందే.
ఇది కూడా చదవండి: హాంకాంగ్ జాతీయ భద్రతా కేసులో సంచలన తీర్పు
Comments
Please login to add a commentAdd a comment