లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 13న పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించిన సన్నాహాల్లో ఎస్పీ, బీజేపీలు బిజీగా ఉన్నాయి. ఎస్పీ ఇప్పటివరకు ఏడు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయగా, బీజేపీ కూడా అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిందని, ఒకట్రెండు రోజుల్లో జాబితాను విడుదల చేసే అవకాశం ఉందనే వార్తలు వినవస్తున్నాయి. యూపీలో ఉప ఎన్నికల బాధ్యతను ఆర్‌ఎస్‌ఎస్‌కు బీజేపీ అప్పగించింది.
ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ సమావేశంలో పాల్గొనేందుకు మధురకు చేరుకున్నారు. ఆయన 10 రోజుల పాటు మధుర పర్యటనలో ఉండనున్నారు. తాజాగా సంఘ్ చీఫ్‌తో సీఎం యోగి భేటీ అయ్యారు. ఉప ఎన్నికల్లో ఓటింగ్‌శాతాన్ని పెంచడం, బూత్ నిర్వహణ, ఎన్నికల వ్యూహం తదితర అంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది.
సంఘ్ వ్యూహంతోనే హర్యానా ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిందని పార్టీ భావిస్తోంది. ఇప్పుడు జార్ఖండ్, మహారాష్ట్రతో పాటు యూపీలో బీజేపీ గెలుపునకు వ్యూహం రచించే పనిలో సంఘ్ బిజీగా ఉంది. యూపీలో హిందూ ఓటర్లను ఏకం చేయడం, ఓబీసీ, దళిత ఓటర్లను బీజేపీవైపు ఆకర్షించడం తదితర అంశాలపై సంఘ్ దృష్టి సారిస్తోంది. ఇందుకోసం సంఘ్ కార్యకర్తలు బృందాలుగా ఏర్పడి, ఇంటింటికీ ప్రచారం నిర్వహించనున్నారు. బీజేపీకి తక్కువ ఓట్లు వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతాన్ని పెంచడంపై కూడా సంఘ్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: బెజవాడలో వ్యక్తి దారుణ హత్య
Comments
Please login to add a commentAdd a comment