యూపీలో ఘోరం.. 10 మంది పసికందుల సజీవ దహనం | Jhansi Medical College Fire Accident More Than 10 New Born Babies Died, Check Out Video And Other Details | Sakshi
Sakshi News home page

Jhansi Hospital Fire Accident: ఝాన్సీ ఆస్పత్రిలో మంటలు.. 10 మంది పసికందుల సజీవ దహనం

Published Sat, Nov 16 2024 7:16 AM | Last Updated on Sat, Nov 16 2024 10:04 AM

Jhansi Medical College Fire Accident More than 10 New Born Babies Died

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఝాన్సీలోని మహారాణి లక్ష్మీ బాయి మెడికల్‌ కాలేజీలోని పిల్లల వార్డులో  అగ్నిప్రమాదం చోటుచేసుకుని, 10మంది చిన్నారులు సజీవ దహనమయ్యారు. మృతులలో రోజుల వయసు కలిగిన నవజాత శిశువులు కూడా ఉన్నారు.

ఘటన జరిగిన సమయంలో  ఎన్‌ఐసీయూలో మొత్తం 54 మంది పిల్లలు చికిత్స పొందుతున్నారు. శుక్రవారం రాత్రి 10.45 గంటల సమయంలో ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌లో విద్యుత్‌ షార్ట్‌ జరిగింది. వెంటనే మంటలు చెలరేగాయి. మంటల ధాటికి వార్డులోని పిల్లల బెడ్లు, ఇతరత్రా సామాగ్రి అగ్నికి ఆహుతయ్యింది. చిన్నారుల మృతితో ఆస్పత్రి ప్రాంగణంలో  తీవ్ర విషాదం నెలకొంది.
 

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపకదళం రంగంలోకి దిగి మంటలను ఆపేందుకు ప్రయత్నించింది. ఈ దుర్ఘటనపై యూపీ సీఎం యోగి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడిన చిన్నారులకు మెరుగైన చికిత్స అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆయన ఆదేశించారు. ప్రమాదంపై 12 గంటల్లోగా నివేదిక అందించాలని ఝాన్సీ డివిజనల్ కమిషనర్ పోలీస్ రేంజ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్‌కు ఆదేశాలు జారీచేశారు.

ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్, ఆరోగ్య మంత్రి అర్ధరాత్రి  సంఘటనా స్థలానికి చేరుకున్నారు.  ఈ ఉదంతంపై విచారణ నివేదిక వచ్చిన తర్వాతే ప్రమాదానికి కారణమేమిటనేది తెలుస్తుందన్నారు.  నవజాత శిశువులు మరణం దురదృష్టకరమని, ఈ ఘటనపై వెంటనే విచారణకు ఆదేశించామన్నారు. ఘటనకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. 


 

చిన్నారుల మృతదేహాలను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామని, ఏడుగురి చిన్నారుల మృతదేహాలను గుర్తించామని తెలిపారు. నవజాత శిశువులను కోల్పోయిన కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని బ్రజేష్ పాఠక్ హామీనిచ్చారు. ఈ ఆసుపత్రిలో గత ఫిబ్రవరిలో ఫైర్​ సేఫ్టీ ఆడిట్ జరిగిందని, జూన్‌లో మాక్​ డ్రిల్​ కూడా నిర్వహించారన్నారు. అయినా ఈ దుర్ఘటన  జరగడం విచారకరమన్నారు. 

ఇది కూడా చదవండి: HYD: అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement