ఝాన్సీ: ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో గల మెడికల్ కాలేజీలో అగ్ని ప్రమాదం సంభవించి, 10 మంది శిశువులు సజీవదహనమ్యారు. ముక్కుపచ్చలారని తమ చిన్నారుల మృతిని తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. బాధితులలో ఒకరైన మహోబా నివాసి కులదీప్‌కు అనూహ్య అనుభవం ఎదురయ్యింది.
శుక్రవారం రాత్రి మెడికల్ కాలేజీలోని శిశు వార్డులో అగ్నిప్రమాదం నుండి ముగ్గురు పిల్లలను రక్షించిన కులదీప్ తమ శిశువును రక్షించుకోలేకపోయాడు. ఈ ప్రమాదంలో 10 మంది నవజాత శిశువులు మరణించగా, 16 మంది చిన్నారులు ప్రాణాలతో పోరాడుతున్నారు.
10 రోజుల క్రితమే కులదీప్‌కు కుమారుడు జన్మించాడు. సాధారణ పరీక్షల కోసం ఆ శిశువును ఆసుపత్రిలో ఉంచారు. ప్రమాదం జరిగిన సమయంలో కులదీప్‌తో పాటు అతని భార్య ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్నారు. ఇంతలో వారి కుమారుడు ఉంటున్న వార్డులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన కులదీప్ వార్డులోకి వెళ్లి ముగ్గురు చిన్నారులను రక్షించాడు. ఈ నేపధ్యంలో అతని చేతికి కాలిన గాయమయ్యింది.
తరువాత కులదీప్ తన కుమారుడిని బయటకు తీసుకురావాలనుకున్నాడు. అయితే వార్డులో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. తన కుమారుడు వార్డులో ఎలా ఉన్నాడో తెలియక తల్లడిల్లిపోయాడు. అక్కడి పరిస్థితులను చూసి కులదీప్ భార్య కన్నీటి పర్యంతమయ్యింది. తమ కుమారుడెక్కడున్నాడో తెలియక కులదీప్ దంపతులు తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు.
ఇది కూడా చదవండి: Jhansi Hospital Fire: 25 మంది చిన్నారులను కాపాడిన ‘కృపాలుడు’
Comments
Please login to add a commentAdd a comment