విలేకరులతో మాట్లాడుతున్న డిబ్రియాల్
- జిల్లాలో 1.19కోట్ల మొక్కలు నాటాం
- హరితహారం జిల్లా ప్రత్యేకాధికారి
నారాయణఖేడ్: హరితహారంలో భాగంగా జిల్లాలో 1.19కోట్ల మొక్కలు నాటినట్టు అటవీశాఖ విజిలెస విభాగం అదనపు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్, మెదక్ జిల్లా హరితహారం ప్రత్యేక అధికారి రాకేష్ డిబ్రియాల్ తెలిపారు. శనివారం నారాయణఖేడ్ ప్రాంతంలో హరితహారాన్ని పర్యవేక్షించారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... జిల్లా మొత్తంలో 3కోట్ల మొక్కలు నాటేందుకు లక్ష్యం కాగా 1.19కోట్ల మొక్కలు నాటినట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో 14కోట్ల మొక్కలు నాటడం లక్ష్యమని వివరించారు. అనంతరం ఆయన మండలంలోని ర్యాలమడుగు, నిజాంట్, హన్మంత్‌రావుపేట్, మాద్వార్, కాంజీపూర్ పరిధిలోని అటవీ భూములను పరిశీలించారు.
నారాయణఖేడ్ రేంజి పరిధిలో 2.70లక్షల మొక్కలు అటవీ భూముల్లో నాటేందుకు ప్రణాళిక రూపొందించి నాటుతున్నట్లు చెప్పారు. విలేకరుల సమావేశంలో రేంజ్ అధికారి గణేశ్, సబ్‌రేంజ్ అధికారి విజయ్‌కుమార్ పాల్గొన్నారు.