లక్ష్యం చేరేలా మెుక్కలు నాటాలి | target reach in plantation | Sakshi
Sakshi News home page

లక్ష్యం చేరేలా మెుక్కలు నాటాలి

Published Thu, Jul 21 2016 6:52 PM | Last Updated on Tue, Sep 18 2018 6:30 PM

మొక్కలు నాటుతున్న ఎస్పీ జోయల్‌డేవిస్‌ - Sakshi

మొక్కలు నాటుతున్న ఎస్పీ జోయల్‌డేవిస్‌

  • ఎస్పీ జోయల్‌డేవిస్‌
  • గంగాధర : జిల్లా పోలీస్‌శాఖ దత్తత తీసుకున్న అన్ని గ్రామాల్లో లక్ష్యం మేరకు మెుక్కలు నాటాలని ఎస్పీ జోయల్‌డేవిస్‌ అన్నారు. గంగాధర పోలీసుల ఆధ్వర్యంలో మండలంలోని కురిక్యాల శివారులోని బొమ్మలమ్మగుట్ట సమీపంలో నిర్వహించిన హరితహారంలో ఎస్పీ మొక్కలు నాటారు. గ్రామాల్లో మొక్కల పెంపకంపై అవగాహన కల్పించాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు. చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ మాట్లాడుతూ నాటిన మొక్కలను సంరక్షించడంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు.
    ఎంపీపీ దూలం బాలాగౌడ్, కురిక్యాల, కొండన్నపల్లి సర్పంచులు నేరెళ్ల భూమాగౌడ్, ఉప్పుల అంజలి, ఎంపీటీసీ నందయ్య, గంగాధర మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రేండ్ల పద్మకిరణ్, వైస్‌ చైర్మన్‌ ఎండీ నజీర్, డీఎస్పీ మల్లారెడ్డి, సీఐ లక్ష్మీబాబు, ఎస్సైలు నీలం రవి, సంపత్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement