హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ సూచించారు.
డిండి
హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ సూచించారు. గురువారం మండలంలోని తవక్లాపూర్ గ్రామంలో ఆయన మెుక్కలు నాటి మాట్లాడారు. మనం నాటిన మొక్కలు ముందు తరాలకు ఉపయోగపడాలనే సదుద్ధేశంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల నాయకులు రాజనేని వెంకటేశ్వరరావు, బల్ముల తిరుపతయ్య, జయానందం, బయ్య వెంకటయ్య, బొడ్డుపల్లి కృష్ణ, గ్రామ ప్రజలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.