డీల్స్.. | Kirloskar Ferrous to acquire pig iron plant of VSL Steels | Sakshi
Sakshi News home page

డీల్స్..

Published Fri, Jul 29 2016 1:44 AM | Last Updated on Tue, Sep 18 2018 6:30 PM

Kirloskar Ferrous to acquire pig iron plant of VSL Steels

కిర్లోస్కర్ చేతికి వీఎస్‌ఎల్ స్టీల్స్ పిగ్ ఐరన్ ప్లాంట్
న్యూఢిల్లీ: వీఎస్‌ఎల్ స్టీల్స్‌కు చెందిన పిగ్ ఐరన్(దుక్క ఇనుము) ప్లాంట్‌ను రూ.155 కోట్లకు కొనుగోలు చేయనున్నామని కిర్లోస్కర్ ఫై ఇండస్ట్రీస్ తెలిపింది. గురువారం జరిగిన బోర్డ్ మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం జరిగిందని పేర్కొంది. వీఎస్‌ఎల్ స్టీల్స్‌కు చెందిన పిగ్ ఐరన్ ప్లాంట్ సంబంధిత చర, స్థిర ఆస్తులన్నింటిని రూ.155 కోట్లకు కొనుగోలు చేయాలని డెరైక్టర్ల బోర్డ్ నిర్ణయించిందని తెలిపింది.

ఐడియా కూషర్‌ని కొనుగోలు చేసిన కాగ్నిజంట్
న్యూఢిల్లీ: సాఫ్ట్‌వేర్ సేవల దిగ్గజ కంపెనీ కాగ్నిజంట్ అమెరికాకు చెందిన ఐడియా కూషర్ కంపెనీని కొనుగోలు చేసింది. డిజిటల్ టెక్నాలజీ విభాగాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు ఐడియా కూషర్‌ను కొనుగోలు చేశామని కాగ్నిజంట్ పేర్కొంది. అయితే కొనుగోలుకు సంబంధించిన ఆర్థిక వివరాలను కాగ్నిజంట్ వెల్లడించలేదు. ప్రొటొటైపింగ్ ఉత్పత్తుల డిజైనింగ్, వ్యాపార విధానాల్లో ప్రత్యేకీకరణ సాధించిన ఐడియా కూషర్ ఇక  కాగ్నిజంట్ డిజిటల్ వర్క్స్‌లో భాగమవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement