Kirloskar
-
Kirloskar Group: సగౌరవంగా... గౌరీ విజయం
గోల్డెన్ స్పూన్‌తో పుట్టిన గౌరీ కిర్లోస్కర్ తమ కుటుంబ వ్యాపార విజయాల వెలుగులో మాత్రమే కనిపించాలనుకోలేదు. ‘కొత్తగా నేను ఏమీ చేయకపోయినా జీవితం సాఫీగా సాగిపోతుంది’ అనుకోలేదు. ‘ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యంలో నేను ఎక్కడ?’ అని ప్రశ్నించుకుంది. ఆ ప్రశ్నే ఆమెతో ఎన్నో ప్రయాణాలు చేయించింది. ప్రతి ప్రయాణంలో విలువైన పాఠాలు నేర్చుకునేలా చేసింది. తమ కుటుంబ వ్యాపార చరిత్రలో తనకంటూ కొన్ని పుటలు ఉండాలనుకుంది. ఆమె ప్రయత్నం, కష్టం ఫలించాయి. ఫిప్త్ జెనరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ప్రసిద్ధ వ్యాపార సామ్రాజ్యమైన ‘కిర్లోస్కర్’లోకి అడుగుపెట్టిన గౌరీ కిర్లోస్కర్ తనను తాను నిరూపించుకుంది. తమ వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించింది.కుటుంబ వ్యాపారంలోకి అడుగు పెట్టినంత మాత్రానా ఎంటర్‌ప్రెన్యూర్‌గా వారిది నల్లేరు మీద నడక అనుకోవడానికి లేదు. తమను తాము నిరూపించుకొని ఫ్యామిలీ బిజినెస్‌కు మరింత బలాన్ని ఇచ్చేవారితో పాటు నిరూపించుకోలేక వెనుతిరిగేవారు కూడా ఉంటారు. గౌరీ కిర్లోస్కర్ మొదటి కోవకు చెందిన మహిళ.లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పోలిటికల్ సైన్స్(ఎల్ఎస్ఈ)లో చదువుకుంది. అమెరికాలోని కార్నెగీ మెలన్ యూనివర్శిటీలో ఫైనాన్స్‌లో డిగ్రీ చేసింది.చదువు పూర్తి కాగానే తమ కుటుంబ వ్యాపారంలోకి అడుగు పెట్టి పెద్ద హోదాలో వెలిగిపోవచ్చు. అలా కాకుండా ఉద్యోగం చేయాలనుకుంది గౌరి.ఉద్యోగం చేయాలనుకోవడానికి కారణం... తనను తాను నిరూపించుకోవడం..ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అనలిస్ట్‌గా ఉద్యోగ ప్రస్థానాన్ని ్రపారంభించింది. ఆ తరువాత ‘పియర్సన్ కార్పొరేట్ ఫైనాన్స్’లో స్ట్రాటజీ గ్రూప్‌లో చేరింది. ఉద్యోగజీవితంలో విలువైన అనుభవాలను సొంతం చేసుకుంది. ఈ అనుభవాలు ఎంటర్‌ప్రెన్యూర్‌గా తన విజయాలకు బలమైన పునాదిగా నిలిచాయి.మన దేశానికి తిరిగివచ్చిన గౌరి కుటుంబ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. ఇక అప్పటినుంచి ‘కిర్లోస్కర్ గ్రూప్’లో వ్యూహాత్మక విధానాలపై దృష్టి పెట్టింది. బోర్డ్ మెంబర్‌గా సమీక్ష సమావేశాల్లో చురుగ్గా పాల్గొనడం ఒక కోణం అయితే ఎనర్జీ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ అవకాశాలను అన్వేషించడం మరో కోణం.‘ఆర్క్ ఫిన్ క్యాప్’కు సంబంధించి టీమ్ ఏర్పాటు, బిజినెస్ ΄్లానింగ్లో కీలకంగా వ్యవహరించింది.పుణెలో కంపెనీకి సంబంధించిన రియల్ ఎస్టేట్ బిజినెస్ ప్రధాన బాధ్యతను కూడా సమర్థవంతంగా నిర్వహించింది. ఇంటర్నేషనల్ ్రపాపర్టీ కన్సల్టెంట్స్తో కలిసి పనిచేసింది. హెచ్ఆర్, బ్రాండింగ్, కార్పొరేట్ కమ్యూనికేషన్స్‌లో తనదైన ముద్ర వేసింది. పర్యావరణ కోణంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్)పై ప్రత్యేక దృష్టి పెట్టింది.గౌరీ నాయకత్వంలో కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్ గణనీయమైన వృద్ధిని సాధించింది. ‘ఇది కుదరదు’ అనుకునే చోట ప్రత్యామ్నాయాలు అన్వేషించి విజయం సాధించే నైపుణ్యం గౌరీలోఉంది.‘మేము ఇంజిన్ మాన్యుఫాక్చరింగ్‌లోకి వచ్చినప్పుడు గ్లోబల్ కంపెనీలతో టై అప్ అయ్యే అవకాశం లేదు. ఒకవేళ ఉంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ద్వారా ఇంజిన్లను స్థానికంగానే తయారు చేసుకునే పరిస్థితి ఉండేది. ఇలాంటి అవకాశం లేకపోవడంతో సొంతంగా మాన్యుఫాక్చరింగ్ మొదలుపెట్టాం. సొంతంగా ఏదైనా చేయడం మొదలుపెట్టినప్పుడు మనదైన ఇంటెలెక్చువల్ ్రపాపర్టీ వృద్ధి చెందుతుంది’ అంటుంది గౌరీ.గౌరీ కంపెనీ బీ2బీ, బీ2సి, ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే మూడు ప్రధానమైన బిజినెస్ సెగ్మెంట్లపై దృష్టి పెట్టింది. బీ2బీ బిజినెస్ ఇంటర్నల్ కంబాషన్ ఇంజిన్స్‌పై, బీ2సి బిజినెస్ వాటర్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్, వ్యవసాయ సంబంధిత వ్యాపారాలపై దృష్టి పెడుతుంది. ఇక ‘అర్క’ గ్రూప్ అనేది ఫైనాన్షియల్ సర్వీసెస్ సెగ్మెంట్.స్థూలంగా చెప్పాలంటే...ఉన్నత విద్యాలయాల్లో చదువుకున్న చదువు, ప్రయాణంలో నేర్చుకున్న పాఠాలు, వ్యూహాత్మక దృక్పథం వ్యాపార ప్రపంచంలో గౌరీని ఉన్నత స్థానంలో నిలిపాయి. మూలాలకు తిరిగి రావడం అనేది గణనీయమైన వ్యాపార విజయానికి ఎలా దారితీస్తుందో చెప్పడానికి గౌరీ కిర్లోస్కర్ పేరును ప్రముఖంగా ప్రస్తావించవచ్చు.ఉత్సాహ బలంవ్యాపార ప్రపంచానికి అవతలి విషయానికి వస్తే... గౌరీ కిర్లోస్కర్‌కు యోగా చేయడం, స్క్వాష్, డైవింగ్ అంటే ఇష్టం. ప్రకృతి ప్రేమికురాలైన గౌరీకి తన కుటుంబ సభ్యులతో కలిసి కొత్త ప్రదేశాలకు వెళ్లడం అంటే ఇష్టం. ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండ్ల గురించి తెలుసుకోవడానికి సోషల్ మీడియాపై కూడా ఆసక్తి ప్రదర్శిస్తుంది. ఒక పుస్తకం చదివినప్పుడో, ఉపన్యాసం విన్నప్పుడో తనకు నచ్చిన వాక్యాన్ని, మాటను నోట్ చేసుకోవడం గౌరీకి ఇష్టం. ‘ఏ పని చేసినా ఉత్సాహంతో చేయాలి. ఉత్సాహమే అనంతమైన శక్తి’ అంటుంది గౌరీ కిర్లోస్కర్. -
వచ్చే 8న కిర్లోస్కర్ బ్రదర్స్ ఈజీఎం
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ కంపెనీ కిర్లోస్కర్ బ్రదర్స్ లిమిటెడ్(కేబీఎల్) డిసెంబర్ 8న వాటాదారుల అత్యవసర సమావేశాన్ని(ఈజీఎం) నిర్వహించనున్నట్లు తాజాగా వెల్లడించింది. వెలుపలి సంస్థతో ఫోరెన్సిక్ ఆడిట్‌కు పెరుగుతున్న ఒత్తిళ్ల నేపథ్యంలో తాజా నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే ఈ ప్రతిపాదనను తిరస్కరించవలసిందిగా వాటాదారులకు సూచించింది. కంపెనీలో ఉమ్మడిగా 24.92 శాతం వాటా కలిగిన కిర్లోస్కర్ ఇండస్ట్రీస్, అతుల్ కిర్లోస్కర్, రాహుల్ కిర్లోస్కర్ డిమాండుమేరకు ఈజీఎంను చేపట్టినట్లు తెలియజేసింది. కిర్లోస్కర్ సోదరుల మధ్య వివాదాలు తలెత్తడంతో కేబీఎల్ చైర్మన్, ఎండీ సంజయ్ కిర్లోస్కర్ ఒకవైపు, అతుల్, రాహుల్ మరోవైపు చేరారు. ఈ నేపథ్యంలో కంపెనీ కార్యకలాపాలపై దర్యాప్తు చేపట్టేందుకు స్వతంత్ర ఫోరెన్సిక్ ఆడిటర్‌ను నియమించాలన్న డిమాండుపై ఈజీఎంను నిర్వహిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. గత ఆరేళ్లలో న్యాయ, వృత్తిపరమైన కన్సల్టెన్సీ చార్జీలకు సంబంధించి కంపెనీ చేసిన వ్యయాలపై పరిశోధన చేపట్టేందుకు ఫోరెన్సిక్ ఆడిటర్ ఎంపికను కోరుతున్నట్లు వివరించింది. కాగా.. బోర్డు ఈ ప్రతిపాదనలను సమర్థించడంలేదని కేబీఎల్ పేర్కొంది. బోర్డు, డైరెక్టర్ల స్వతంత్రతను ప్రశ్నించడం సరికాదని వాదిస్తోంది. -
కిర్లోస్కర్ బ్రదర్స్ ప్రమోటర్లపై సెబీ జరిమానా
న్యూఢిల్లీ: ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని, సాధారణ షేర్హోల్డర్లను మోసగించారని ఆరోపణలపై కిర్లోస్కర్ బ్రదర్స్ (కేబీఎల్) ప్రమోటర్లు, ఇతరులపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రూ. 31 కోట్ల జరిమానా విధించింది. అలాగే వీరు మూడు నుంచి ఆరు నెలల పాటు క్యాపిటల్ మార్కెట్ లావాదేవీలు జరపరాదంటూ ఆదేశించింది. అనుచితంగా ఆర్జించిన రూ. 16.6 కోట్ల లాభాలను 4 శాతం వడ్డీ రేటు, రూ. 14.5 కోట్ల పెనాల్టీతో పాటు మొత్తం రూ. 31.21 కోట్లు కట్టాలంటూ సెబీ ఆదేశాలు ఇచ్చింది. తమ దగ్గరున్న కీలక సమాచారాన్ని ఉపయోగించుకుని షేర్లలో లావాదేవీలు జరపడం ద్వారా కేబీఎల్ ప్రమోటర్లు, డైరెక్టర్లు లబ్ధి పొందారని విచారణలో వెల్లడైంది. -
ఎకానమీ ప్రగతికి ఏం చేద్దాం..
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ మందగమనం నేపథ్యంలో వ్యాపార దిగ్గజాలతో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం సమావేశమయ్యారు. ఎకానమీ ఎదుర్కొంటున్న సవాళ్లు, వృద్ధి.. ఉపాధి కల్పనకు ఊతమివ్వడానికి తీసుకోతగిన చర్యలు తదితర అంశాలపై చర్చించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా, భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్, అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, మైనింగ్ దిగ్గజం అనిల్ అగర్వాల్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. టీవీఎస్ చైర్మన్ వేణు శ్రీనివాసన్, ఎల్అండ్టీ అధినేత ఏఎం నాయక్ మొదలైన వారు దీనికి హాజరయ్యారు. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2019–20 ఏడాదికి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కార్పొరేట్లతో ప్రధాని భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. సవాళ్లతో సమరం..: డిమాండ్ మందగమనం, తయారీ రంగం బలహీనత తదితర అంశాల కారణంగా జులై–సెప్టెంబర్ త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి మరింత నెమ్మదించి.. ఆరేళ్ల కనిష్టమైన 4.5 శాతానికి పడిపోయింది. వృద్ధికి ఊతమిచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను గతేడాది గణనీయంగా తగ్గించుకుంటూ వచ్చింది. అటు కేంద్ర ప్రభుత్వం కూడా బ్యాంకులకు మరింత మూలధన నిధులివ్వడం, పలు బ్యాంకులను విలీనం చేయడంతో పాటు కార్పొరేట్ ట్యాక్స్ రేటును 30% నుంచి 22%కి తగ్గించడం వంటి సంస్కరణలు ప్రవేశపెట్టింది. అయితే, ఇవేవీ కూడా బలహీనపడిన వినియోగ డిమాండ్‌ను నేరుగా పెంచేందుకు దోహపడేవి కావనే విమర్శలు ఉన్నాయి. దీంతో వృద్ధికి ఊతమివ్వడానికి తీసుకోతగిన చర్యల గురించి తెలుసుకునేందుకు ఇటీవలి కాలంలో వివిధ రంగాలకు చెందిన 60 మంది పైగా వ్యాపారవేత్తలతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. అటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా బడ్జెట్ కసరత్తులో భాగంగా పరిశ్రమవర్గాలతో సమావేశమవుతున్నారు. దీంతో రాబోయే బడ్జెట్లో మరిన్ని సంస్కరణలపై అంచనాలు నెలకొన్నాయి. కార్పొరేట్లపై కక్ష సాధింపు అనుకోవద్దు.. అవినీతి కట్టడి చర్యలపై మోదీ వ్యాఖ్యలు న్యూఢిల్లీ: అవినీతికి పాల్పడుతున్న కొన్ని సంస్థలపై తీసుకుంటున్న చర్యలను కార్పొరేట్లపై కక్ష సాధింపుగా భావించరాదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఎలాంటి అవరోధాలు లేని పారదర్శక పరిస్థితుల్లో కార్పొరేట్లు నిర్భయంగా సంపద సృష్టి జరపాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు. కిర్లోస్కర్ బ్రదర్స్ వందో వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రధాని ఈ విషయాలు తెలిపారు. చట్టాల సాలెగూళ్ల నుంచి పరిశ్రమను బైటపడేసేందుకు గడిచిన అయిదేళ్లుగా తమ ప్రభుత్వం నిజాయితీగా పనిచేస్తోందని మోదీ పేర్కొన్నారు. కాగా, కిర్లోస్కర్ బ్రదర్స్ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రూపొందించిన పోస్టల్ స్టాంపును, సంస్థ వ్యవస్థాపకుడు లక్ష్మణ్‌రావ్ కిర్లోస్కర్ జీవిత కధ ‘యాంత్రిక్ కి యాత్ర’ హిందీ వెర్షన్‌ను ప్రధాని ఆవిష్కరించారు. -
టయోటా ఫార్చునర్ లిమిటెడ్ ఎడిషన్ విడుదల
న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘టయోటా కిర్లోస్కర్ మోటార్’ (టీకేఎం) తాజాగా తన పాపులర్ ఎస్యూవీ ‘ఫార్చునర్’లో లిమిటెడ్ ఎడిషన్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఈ కారు ధర రూ. 33.85 లక్షలు (ఎక్స్–షోరూం, ఢిల్లీ)గా ప్రకటించింది. నూతన ఎడిషన్ 2.8 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌తో బుధవారం అందుబాటులోకి వచి్చంది. -
గనిలోకి గజ ఈతగాళ్లు
షిల్లాంగ్: మేఘాలయలోని గనిలో చిక్కుకున్న కార్మికుల కోసం సహాయక కార్యక్రమాలు ఊపందుకున్నాయి. విశాఖలోని నేవీ బేస్ నుంచి బయలుదేరిన 15 మంది గజ ఈతగాళ్ల బృందం శనివారం పశ్చిమ జైంతియా జిల్లా లుంథారి గ్రామ సమీపంలోని గని వద్దకు చేరుకుంది. వీరి వద్ద నీటి అడుగున శోధించే రిమోట్ వాహనాలు తదితర అత్యాధునిక పరికరాలు ఉన్నాయి. ఈ బృందానికి జాతీయ విపత్తు నిర్వహణ దళం(ఎన్డీఆర్ఎఫ్) అధికారులు పరిస్థితి వివరించారు. అలాగే, భువనేశ్వర్ నుంచి బయలుదేరిన ఈతగాళ్ల బృందంతోపాటు 10 శక్తివంతమైన కిర్లోస్కర్ మోటార్లు కూడా గని వద్దకు చేరుకున్నాయని జిల్లా ఎస్పీ సిల్వెస్టర్ నోంగ్టింగర్ తెలిపారు. వీరంతా కలిసి 370 అడుగుల లోతున్న గనిలో గల్లంతైన కార్మికుల జాడ కనుక్కునే పనిలో నిమగ్నమై ఉన్నారన్నారు. లిటీన్ నది మధ్యలో ఉన్న చిన్న గుట్టపై ఓ ప్రైవేట్ కంపెనీ అక్రమంగా బొగ్గు గని నడుపుతోంది. ఈ నెల 13వ తేదీన నది వరద అకస్మాత్తుగా గనిలోకి ప్రవేశించడంతో బొగ్గు తవ్వుతున్న కార్మికులు 15 మంది అందులో చిక్కుకుపోయారు. గనిలోతు 370 అడుగుల లోతు ఉండగా నీరు 170 అడుగుల వరకు ఉంటుందని ఎన్డీఆర్ఎఫ్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ ప్రాంతంలో భూమికి 200 నుంచి 500 అడుగుల లోతులో బొగ్గు తవ్వకాలు జరుగుతున్నట్లు సమాచారం. బతికి ఉండేందుకు అవకాశమే లేదు గనిలోని కార్మికులు తప్పించుకుని వచ్చేందుకు మార్గం లేదని ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడిన సాహిబ్ అలీ అనే కార్మికుడు తెలిపాడు. ఇతనిది అస్సాంలోని చిరంగ్ జిల్లా. ఆ రోజు ప్రమాదం నుంచి ప్రాణాలు దక్కించుకున్న మిగతా నలుగురూ పశ్చిమ గారో జిల్లాలోని తమ సొంతూళ్లకు వెళ్లిపోయారని అలీ తెలిపాడు. ‘ప్రమాదం జరిగిన రోజు 22 మంది వరకు పనిలో ఉన్నాం. కేవలం ఒకే మనిషి కూర్చునేందుకు వీలుండే లోతైన గుంతల్లో చాలామంది బొగ్గు తవ్వుతున్నారు. ఉదయం 5 గంటలకే పని మొదలుపెట్టాం అయితే, 7 గంటల సమయంలో ఎన్నడూ లేనిది గనిలోకి కొత్త రకమైన గాలి వీచింది. కొద్దిసేపటికే పెద్ద శబ్దం చేస్తూ వరద నీరు గనిలోకి వెల్లువలా వచ్చింది. అతికష్టంమీద బయటకు రాగలిగా. ఆ రోజు ప్రమాదం నుంచి ప్రాణాలు దక్కించుకున్న నలుగురూ ఇనుప పెట్టెల్లో బొగ్గును నింపేవారే. గనిలో చిక్కుకున్న వారు ప్రాణాలతో బయటపడేందుకు దారి లేదు. నీటి అడుగున శ్వాస పీల్చకుండా ఎవరైనా ఎంతకాలం ఉండగలరు?. నాకు తెలిసినంత వరకు గనిలో 17 మంది వరకు చిక్కుకున్నారు. సంప్రదాయం ప్రకారం అంతిమ క్రియలు జరిపేందుకు వారి మృతదేహాలైనా దొరుకుతాయని నా ఆశ’ అని అలీ అన్నాడు. ర్యాట్‌హోల్‌లో రెక్కీ నేవీతోపాటు ఎన్డీఆర్ఎఫ్నకు చెందిన గజ ఈతగాళ్లు ప్రమాదం జరిగిన ర్యాట్ హోల్గా పిలిచే ఆ ఇరుకైన గని లోపలికి దిగి, నీటి మట్టం, కార్మికుల ఆచూకీ ఎలా కనుగొనాలనే విషయమై ఒక అంచనాకు వచ్చారు. ఆదివారం వేకువజాము నుంచే ఈ బృందాలు తమ పనిని ప్రారంభిస్తాయని ఎన్డీఆర్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ సంతోష్ కుమార్ సింగ్ తెలిపారు. ధన్‌బాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్‌కు చెందిన నిపుణులు కూడా సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. వీరితోపాటు పంజాబ్‌కు చెందిన గని ప్రమాదాల నిపుణుడు జస్వంత్ సింగ్ గిల్ కూడా సాయంగా అక్కడికి వచ్చారు. శక్తివంతమైన కిర్లోస్కర్ మోటార్లతో నీటిని తోడే ప్రక్రియ ఆదివారం ప్రారంభం కానుందని అధికారులు అంటున్నారు. కూలీల బతుకులు కూల్చింది సాహిబ్ అలీతోపాటు గని తవ్వకాల్లో పాల్గొంటున్న వారంతా నిరుపేదలు.. రిక్షా తొక్కుతూ, బరువులు మోస్తూ జీవనం సాగించేవారు. ఈ పనుల్లో సంపాదన కుటుంబపోషణకు సరిపోక కూలీ ఆశతో ప్రమాదకరమైన గని పనిలో చేరారు. అత్యంత ఇరుకైన, లోతైన గనిలో రోజంతా పనిచేస్తే రూ.2వేల వరకు చేతికందుతాయి. వేరే ప్రాంతాలకు చెందిన కార్మికులు రెండు మూడు వారాలపాటు ఈ పనిని కొనసాగించి, తిరిగి సొంతూళ్లకు వెళ్లిపోతారు. గనిలో గల్లంతైన వారిలో ఎక్కువ మంది పశ్చిమ గారో హిల్స్ జిల్లాకు చెందిన వారే. ఈ నెల 13వ తేదీన ప్రమాదం జరగ్గా గనిలో చిక్కుకున్న 15 మంది కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం 22వ తేదీన రూ.లక్ష చొప్పున తాత్కాలిక సాయం ప్రకటించింది. -
కిర్లోస్కర్ స్వచ్ఛంద సాయం
షిల్లాంగ్: మేఘాలయలోని బొగ్గుగనిలో రెండు వారాల కింద చిక్కుకున్న 15 మందిని రక్షించేందుకు కిర్లోస్కర్ సంస్థ స్వచ్ఛందంగా ముందుకొచ్చింది. ఆ గనిలోని నీటిని తోడేందుకు అవసరమైన 100 హెచ్‌పీ మోటార్లను తాము సమకూరుస్తామని తెలిపింది. గని వద్ద పరిస్థితులను అంచనా వేసి, వారిని కాపాడేందుకు కిర్లోస్కర్‌కు చెందిన రెండు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. కాగా, గని నుంచి నీటిని ఎంత తోడినా నీటి మట్టాలు తగ్గకపోవడంతో ఆ ప్రక్రియను అధికారులు శనివారం నిలిపేసిన విషయం తెలిసిందే. గనిలోని నీటిని తోడేందుకు రెండు 25 హెచ్‌పీ పంపులు సరిపోవట్లేదని, అంతకన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న పంపులు కావాల్సిందిగా మేఘాలయ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఎన్డీఆర్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ఎస్కే సింగ్ తెలిపారు. గని నుంచి దుర్గంధం వెలువడుతుండటంతో గనిలో చిక్కుకున్న వారు చనిపోయి ఉండొచ్చన్న మీడియా కథనాలను ఎన్డీఆర్ఎఫ్ ఖండించింది. వారిని రక్షించే చర్యలు చేపడుతున్న గువాహటిలోని ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. మైనర్లు చనిపోయి ఉంటారని, వారి దేహాలు కుళ్లిపోవడం ప్రారంభమైందని తాను చెప్పినట్లు వస్తున్న కథనాలను ఎస్కే సింగ్ తప్పుపట్టారు. 48 గంటలుగా నీటిని తోడే ప్రక్రియ నిలిచిపోవడంతో గనిలో నిలిచిపోయిన నీటి వల్ల ఆ దుర్గంధం వస్తుందని స్పష్టం చేశారు. చిక్కుకున్న వారిని కాపాడేందుకు రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కృషిచేస్తున్నాయన్నారు. -
డీల్స్..
కిర్లోస్కర్ చేతికి వీఎస్ఎల్ స్టీల్స్ పిగ్ ఐరన్ ప్లాంట్ న్యూఢిల్లీ: వీఎస్ఎల్ స్టీల్స్‌కు చెందిన పిగ్ ఐరన్(దుక్క ఇనుము) ప్లాంట్‌ను రూ.155 కోట్లకు కొనుగోలు చేయనున్నామని కిర్లోస్కర్ ఫై ఇండస్ట్రీస్ తెలిపింది. గురువారం జరిగిన బోర్డ్ మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం జరిగిందని పేర్కొంది. వీఎస్ఎల్ స్టీల్స్‌కు చెందిన పిగ్ ఐరన్ ప్లాంట్ సంబంధిత చర, స్థిర ఆస్తులన్నింటిని రూ.155 కోట్లకు కొనుగోలు చేయాలని డెరైక్టర్ల బోర్డ్ నిర్ణయించిందని తెలిపింది. ఐడియా కూషర్ని కొనుగోలు చేసిన కాగ్నిజంట్ న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ సేవల దిగ్గజ కంపెనీ కాగ్నిజంట్ అమెరికాకు చెందిన ఐడియా కూషర్ కంపెనీని కొనుగోలు చేసింది. డిజిటల్ టెక్నాలజీ విభాగాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు ఐడియా కూషర్ను కొనుగోలు చేశామని కాగ్నిజంట్ పేర్కొంది. అయితే కొనుగోలుకు సంబంధించిన ఆర్థిక వివరాలను కాగ్నిజంట్ వెల్లడించలేదు. ప్రొటొటైపింగ్ ఉత్పత్తుల డిజైనింగ్, వ్యాపార విధానాల్లో ప్రత్యేకీకరణ సాధించిన ఐడియా కూషర్ ఇక కాగ్నిజంట్ డిజిటల్ వర్క్స్‌లో భాగమవుతుంది.