దేవరకద్ర: గూరకొండ పాఠశాల ఆవరణలో మొక్కను నాటుతున్న కలెక్టర్ శ్రీదేవి
నాటిన ప్రతిమొక్కను బతికించాలి
Published Wed, Aug 3 2016 11:48 PM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
దేవరకద్ర : హరితహారంలో నాటిన ప్రతి మొక్కను బ తికిస్తేనే కార్యక్రమం, లక్ష్యం విజయవంతమైనట్లని క లెక్టర్ టీకే.శ్రీదేవి అన్నారు. బుధవారం మండలంలో ని గూరకొండ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల అ వరణలో జెడ్పీ సీఈఓ లక్ష్మీనారాయణతో కలిసి కలెక్టర్ మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మొక్కలు నాటితే కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి మానవుడు మొక్కలు నాటి సంరక్షిం చడం సామాజిక బాధ్యతగా భావించాలని కోరారు.
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చే పట్టిందని, ఇందుకోసం కోట్ల ప్రజాధనం కేటాయిం చిందని, అందరు భాగస్వాములైతేనే ప్రయోజనం చేకూరుతుందన్నారు. విద్యార్థులు, పాఠశాలలు, ఇంటి ఆవరణలో, రైతులు పొలం గట్ల వెంట, యువకులు రహదారుల వెంట మొక్కలు నాటడానికి ముందుకు రావాలని కోరారు. అధికారులు నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయడానికి కృషి చేయాలన్నారు. అనంతరం విద్యార్థులచే కలెక్టర్ హరిత హారంపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఇవీ.గోపాల్, మార్కెట్ చైర్మన్ జట్టి నర్సింహారెడ్డి, ఎంపీడీఓ భాగ్యలక్ష్మీ, ఏపీఓ లత, హెచ్‌ఎం గోపాల్‌రెడ్డి, సర్పంచ్ కాలే బుచ్చన్న, శ్రీకాంత్‌యాదవ్, దాసరి లక్ష్మమ్మ పాల్గొన్నారు.
Advertisement
Advertisement