నాటిన ప్రతి మొక్కను కాపాడుకుంటాం | planted every plant protaction | Sakshi
Sakshi News home page

నాటిన ప్రతి మొక్కను కాపాడుకుంటాం

Published Thu, Aug 11 2016 12:45 AM | Last Updated on Tue, Sep 18 2018 6:30 PM

planted every plant protaction

  • పరిరక్షణకు నోడల్‌ అధికారుల నియామకం
  • వరంగల్‌ సీపీ సుధీర్‌బాబు
  • కమిషనరేట్‌ పరేడ్‌ మైదానంలో హరితహారం
  • వరంగల్‌æ: వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పోలీసుల మంతా నాటిన ప్రతి మొక్కను కాపాడుకుంటామని
    సీపీ సుధీర్‌బాబు అన్నారు. పోలీస్‌ కమిషనరేట్‌ కా ర్యాలయంలోని పరేడ్‌ మైదానంలో బుధవారం సీపీ పది లక్షల మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా చేపట్టిన హరితహారంలో భాగంగా గత నెల 8వ తేదీ నుంచి మొక్కలు నాటుతున్నామన్నారు. పోలీ సు అధికారులు, సిబ్బంది సమష్టిగా కార్యక్రమాన్ని విజయవంతం చేశారని, 10 లక్షల మొక్కను కమిషనరేట్‌ పరిధిలో నాటినట్లు తెలిపారు. తెలంగాణ రా ష్ట్ర వృక్షం జమ్మి చెట్టును పరిరక్షించాలన్న ధ్యేయం తో.. 2వేల జమ్మి మొక్కలను దేవాలయ ప్రాంగణా ల్లో నాటించామన్నారు.
    ఇప్పటి వరకు మామునూరు పోలీసు డివిజన్‌ పరిధిలో 3,96,546, కాజీపేట పరి ధిలో 3,26,775, వరంగల్‌ పరిధిలో 1,66,880, హన్మకొండ పరిధిలో 1,03,926, క్రైం, ట్రాఫిక్‌ విభాగాలు 17,400 మొక్కలు నాటారన్నారు. మొత్తం 10 లక్షల మొక్కలు కమిషనరేట్‌ పరిధిలో నాటించినట్లు వివరించారు. నాటిన ప్రతి మొక్కకు ట్రీగార్డును ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో ఒక నోడల్‌ అధికారిని నియమించి, మొక్కల రక్షణ బాధ్యతలను అప్పగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏసీపీలు వెంకటేశ్వర్‌రావు, ఈశ్వర్‌రావు, సీఐలు కిషన్, రాజిరెడ్డి, విష్ణుమూర్తి, ఆర్‌ఐలు శ్రీనివాస్, నాగయ్య, ఆర్‌ఎస్సైలు శ్రీధర్, సంపత్, యాదగిరి, తాహేర్, వేణు, శివకేశవులు, రమేష్, సిటీ పోలీస్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు అశోక్‌ పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement