protaction
-
మహాకాయ.. అభయమీయవయా!
సకల జీవకోటికీ వరాలను అనుగ్రహించవయా వరసిద్ధి వినాయకా.. శుభాలను కటాక్షించవయా పార్వతీప్రియసుతా.. విఘ్నాలను తొలగించవయా విఘ్నరాజా.. స్థితిగతులను మార్చవయా గణేశా.. ఐహిక సుఖాల నుంచి విముక్తి ప్రసాదించవయా మహాకాయా.. తెలియక చేసిన పాపాలను హరించవయా మూషిక వాహనా.. మొర ఆలకించి అభయమీయవయా సిద్ధి, బుద్ధి సమేత గణపయ్యా. కాణిపాకం(యాదమరి): కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయం బ్రహ్మోత్సవశోభను సంతరించుకుంది. చవితి వేడుకలకు అంగరంగ వైభవంగా ముస్తాబైంది. కళ్లుమిరుమిట్లు గొలిపే విద్యుద్దీపాలు.. సుగంధ పరిమళాలను వెదజల్లే సుమమాలికలతో కనువిందు చేస్తోంది. 21 రోజులపాటు ఏకాంతంగా సాగే ఉత్సవాలకు ఆలయ యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. కోవిడ్ నిబంధనలను పకడ్బందీగా అమలు చేస్తోంది. భక్తులు భౌతికదూరం పాటిస్తూ స్వామివారిని దర్శించుకునేలా ప్రత్యేక క్యూలను ఏర్పాటు చేసింది. కొరత లేకుండా గణనాథుని లడ్డూ ప్రసాదాలను తయారు చేసింది. ప్రత్యేక ఏర్పాట్లు బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం వేర్వేరు క్యూలను ఏర్పాటు చేశారు. అందులో రూ.50, రూ.100 దర్శన టికెట్ కొనుగోలు చేసిన వారికి విడిగా ఆలయం వెలుపల నుంచి క్యూ నిర్మించారు. వీఐపీలు, చంటిబిడ్డ తల్లులు, వృద్ధులు, దివ్యాంగుల కోసం మరోవైపు క్యూ ఏర్పాటు చేశారు. స్వామివారి దర్శనానికి వేచి ఉన్న భక్తులు ఇబ్బంది పడకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. క్యూలో లైట్లు, ఫ్యాన్లు, శానిటైజర్, తాగునీటి సౌకర్యం కల్పించారు. భక్తులకు అన్నదానం బ్రహ్మోత్సవం సందర్భంగా ఆలయంలో 5వేల మంది భక్తులకు అన్నదానం నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు. అయితే కోవిడ్ కారణంగా భక్తులకు భోజన ప్యాకెట్లు పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. సిద్ధంగా ప్రసాదం బ్రహ్మోత్సవాలకు విచ్చేస్తున్న భక్తులకు కొరత లేకుండా స్వామివారి ప్రసాదం అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు 60 వేల రూ.15 లడ్డూలు, 5వేల రూ.75 లడ్డూలు, 2వేల రూ.150 లడ్డూలను సిద్ధం చేశారు. భక్తుల సెల్ఫోన్లు భద్రపరిచేందుకు, పాదరక్షలు పెట్టుకునేందుకు పలుచోట్ల ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. స్వామివారి దర్శనానంతరం భక్తులకు పులిహోర, చక్కెర పొంగలిని పంపిణీ చేయనున్నారు. సామాన్య భక్తులకే తొలి ప్రాధాన్యం చవితి రోజున కేవలం సామాన్య భక్తులనే స్వామి వారి దర్శనానికి అనుమతిస్తున్నామని ఆలయ అధికారులు తెలిపారు. వీఐపీలు 11వ తేదీన దర్శనానికి రావాలని స్పష్టం చేశారు. కోవిడ్ కారణంగా వాహనసేవలు, అభిషేకాలకు 50 మంది ఉభయదారులకు మాత్రమే అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. గణేశ దీక్ష చేపట్టేవారి కోసం వరదరాజస్వామివారి ఆలయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. భారీ బందోబస్తు బ్రహ్మోత్సవాల సందర్భంగా డీఎస్పీ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు కలి్పంచారు. నలుగురు సీఐలు, 9 మంది ఎస్ఐలు, 130 మంది సిబ్బందిని బందోబస్తుకు నియమించారు. ఆలయ పరిసరాల్లో 32 సీసీ కెమెరాలను అమర్చారు. భక్తుల వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. ప్రశాంతంగా చవితి వేడుకలు ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకోవాలని తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ వెంకట అప్పలనాయుడు కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గురువారం తిరుపతిలోని వినాయక సాగర్‌లో నిమజ్జన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాల మేరకు బహిరంగ ప్రదేశాల్లో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయకూడదని స్పష్టం చేశారు. పూజా కార్యక్రమంలో ఐదుగురికి మించి పాల్గొనకూడదని చెప్పారు. చవితి మండపాల వద్ద డీజే సౌండ్స్‌కు అనుమతి లేదని తెలిపారు. -
దక్షిణాదికి ఉగ్రముప్పు
పుణే/తిరువనంతపురం/అమరావతి: దక్షిణాది రాష్ట్రాల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశాలున్నట్లు తమకు సమాచారం ఉందని సదరన్ కమాండ్ జీవోసీ(జనరల్ ఆఫీసర్ కమాండర్ ఇన్ చీఫ్) లెఫ్టినెంట్ జనరల్ ఎస్కే సైనీ వెల్లడించారు. పుణేలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో సరిహద్దుల్లోని సర్ క్రీక్ లేన్ వద్ద ఇటీవల గుర్తు తెలియని పడవలను స్వాధీనం చేసుకున్నాం. ఇవి దేశంలోకి దొంగచాటుగా ప్రవేశించిన ఉగ్రవాదులవేనని అనుమానిస్తున్నాం. దీంతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో ఉగ్రదాడులకు అవకాశం ఉందంటూ మాకు సమాచారం అందింది. దీతో సర్ క్రీక్ ప్రాంతంలో అప్రమత్తంగా ఉన్నాం’అని తెలిపారు. రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు చెన్నైలో మాట్లాడుతూ.. ఆర్మీ సదరన్ కమాండ్ పరిధిలోకి గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలు కూడా వస్తాయి. అందుకే, జనరల్ సైనీ తెలిపిన ప్రకారం ఉగ్ర దాడి హెచ్చరికలు దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకతోపాటు గుజరాత్ లోని కొన్ని ప్రాంతాలకు కూడా వర్తిస్తాయి’అని వివరణ ఇచ్చారు. దక్షిణాదిన ఉగ్రదాడుల హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని 974 కిలోమీటర్ల తీర ప్రాంతం వెంబడి గస్తీని పెంచినట్లు ఏపీ అదనపు డీజీపీ(శాంతి భద్రతలు) రవిశంకర్ అయ్యనార్ తెలిపారు. ముఖ్యమైన ప్రాంతాల్లో ఏపీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌ను మోహరించినట్లు వివరించారు. ‘కీలక సంస్థలు, వ్యవస్థ లున్న చోట పరిస్థితులపై తీరప్రాంత పోలీస్ స్టేషన్లతోపాటు ఎస్పీఎఫ్ విభాగాన్ని మా కంట్రోల్ రూం అప్రమత్తం చేస్తోంది. ముఖ్యం గా, ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవేంకటే శ్వరాలయం, శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశాం’అని అన్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విమానా శ్రయాల వద్ద అప్రమత్తంగా ఉండాలని, జన సమ్మ ర్థం ఉండే ప్రాంతాలపై నిఘా ఉంచాలని పోలీసు లను కేరళ డీజీపీ లోకనాథ్ బెహరా కోరారు. -
వన్యప్రాణులకు రక్ష
మెదక్‌జోన్: జిల్లాలో కరువు విలయతాండవం చేస్తుండటం, మరో వైపు వేసవి సమీపిస్తుండటంతో అటవీప్రాంతంలోని చెట్లు చేమలు, పచ్చనిగడ్డి ఎండిపోయింది. దీంతో వన్యప్రాణులకు ఆహారం దొరకని పరిస్థితి నెలకొంది. అటవీశాఖ అధికారులు ప్రత్యేకంగా మూగజీవాల కోసం ప్రత్యేకమైన దాణాను అందిస్తూ వాటిని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. మెదక్ – కామరెడ్డి జిల్లాల సరిహద్దులోని హవేళిఘణాపూర్ మండల పరిధిలోని పోచారం శివారు బోధన్ రహదారి పక్కన మెదక్ పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో అభయారణ్యం ఉంది. ఇక్కడ ప్రత్యేకంగా జింకల ప్రత్యుత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో రెండు డీర్ బీడింగ్(డీబీసీ)లు ఉన్నాయి. డీబీసీ–1లో 125 హెక్టార్ల అడవి ఉండగా డీబీసీ–2లో 39 హెక్టార్ల అడవి ఉంది. వీటిచుట్టూ కంచెను సైతం ఏర్పాటు చేసి వాటిలో జింకలను పెంచుతున్నారు. జింకలతో పాటు మరికొన్ని రకాల శాఖాహర జంతువులున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం జింకలు 450, నీల్గాయిలు 45, సాంబార్లు 25, అడవిపందులు 1500, నెమళ్లతో పాటు అనేకరకాల పక్షులున్నాయి. కాగా ఇందులోని జంతువులు మొత్తం శాఖాహరం జంతువులే. వర్షాకాలంలో చెట్ల ఆకులతో పాటు అడవిలో సహజసిద్ధంగా పెరిగే గడ్డిని ఆహారంగా తీసుకుంటాయి. వేసవికాలం రాగానే అడవిలోని చెట్లకు ఆకులు రాలిపోవటంతో పాటు గడ్డి ఎండిపోతోంది. డీబీసీల చుట్టూ కంచె వేయడంతో అవి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంటోంది. దీంతో ప్రతి సంవత్సరం వేసవిలో సుమారు 5 నుంచి 6 మాసాల వరకు వీటికి దాన (మేత) పెడతారు. ఇది ప్రతిఏటా మార్చి మొదటి వారంలో ప్రారంభిస్తారు. కానీ ఈయేడు ఫిబ్రవరి 2వ తేదీ నుంచే అందిస్తున్నారు. ఈ ఏడాది చెప్పుకోదగ్గ వర్షాలు లేకపోవటంతో చెట్ల ఆకులతోపాటు గడ్డిసైతం త్వరగా ఎండిపోయింది. దీంతో ప్రతిరోజు 2.5 క్వింటాళ్ల దాన పెడుతున్నారు. అంతే కాకుండా డీబీసీ–1లో 3 హెక్టార్లలో గడ్డిని పెంచుతున్నారు. అభయారణ్యంలోనే.. అభయారణ్యంలో డీబీసీల్లోనే జంతువులకు తాగునీటికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అడవిలో చెక్‌డ్యాంలతో పాటు కుంటలను తవ్వించి అందులో బోర్లు వేయించారు. బోరునీటిని చెక్‌డ్యాంలు, కుంటల్లో నింపుతున్నారు. ఇవి కాకుండా సాసర్ ఫీట్లు సైతం నిర్మించారు. తాగునీటికి ఇబ్బంది రాకుండా వాటిలో నీటిని నింపుతున్నారు. అడవిలోని ఒక్క బోరు మోటార్‌కు సోలార్(పవర్)ను ఏర్పాటు చేశారు. డీబీసీ–1 పక్కనే పోచారం ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టు నిండితే బ్యాక్‌వాటర్ డీబీసీ–1లోకి కొంతమేర వస్తుంది. ఆ నీటిని సైతం అటవీశాఖ అధికారులు జంతువుల తాగునీటి కోసం ఉపయోగిస్తుంటారు. పర్యాటకుల తాకిడి... పోచారం అభయారణ్యం(జింకల ప్రత్యుత్పత్తికేంద్రం) హైదరాబాద్‌కు కేవలం 80 కిలోమీటర్ల దూరం ఉండటంతో వీకెండ్లో పర్యాటకులు పెద్ద ఎత్తున వచ్చి జంతువులకు తిలకిస్తున్నారు. ముఖ్యంగా డీబీసీ–1లో జింకల గుంపులు అధికం ఇందులో 4.5 కిలోమీటర్ల మట్టిరోడ్డును వేశారు. పర్యాటకులు ఇందులో పర్యటించాలంటే వాహనానికి రూ. 100 చెల్లించి ఒక్కో వ్యక్తికి రూ. 20 చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. వారివెంట ఒక గైడ్‌ను లోపలికి పంపిస్తారు. అభయారణ్యంలో కాలుపెట్టగానే చంగుచంగున దుముకుతూ జింకలు కళ్లముందే కదలాడుతుంటే పొరవిప్పి నాట్యం చేసే నెమళ్ల వయ్యారం, గుర్రం కన్నా ఎత్తులో ఉండే నీల్గాయిల గాంభీరం, పొదలమాటున నక్కినక్కి చూసే కొండగొర్ల దాగుడు మూతలతో అభయారణ్యం నిండా జంతువుల సందడి కనిపిస్తాయి. కాగా వీటిని తిలకించేందుకు చాలా జిల్లాల నుంచి పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తుంటారు. అంతేకాకుండా ఈ అభయరణ్యానికి ఆనుకుని పోచారం ప్రాజెక్టు సైతం చుట్టూ కొండలు, గుట్టల మధ్య ఉన్న ఈ ప్రాజెక్టు ఎంతో సహజ సిద్ధంగా ఉంది. ముందుగానే ఇస్తున్నాం.. అభయారణ్యంలోని జింకల ప్రత్యుత్పత్తి కేంద్రంలోని జింకలకు 2వ తేదీ నుంచి దాన పెడుతున్నాం. గడ్డినిసైతం పెంచి మేతగా వేస్తున్నాం. ఈయేడు వర్షాకాలంలో సరైన వర్షాలు లేకపోవడంతో చెట్ల ఆకులతో పాటు గడ్డి ఎండిపోవటంతో కాస్త ముందుగానే దాన ఇవ్వాల్సి వస్తోంది. రెండు డీబీసీల్లో నిత్యం 2.5 క్వింటాళ్ల దాన అవసరం పడుతోంది. –కృష్ణమూర్తి , బీట్ ఆఫీసర్ -
ఫుల్ ప్రొటక్షన్
పాతికమంది పోలీసులు, దాదాపు నలభై మంది బౌన్సర్స్ రజనీకాంత్‌కు ప్రొటక్షన్‌గా ఉన్నారు. ఇది సినిమాలోని సీన్ కాదండీ బాబు. రియల్ సీన్. సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ఉన్న క్రేజ్ అలాంటిది. ‘పిజ్జా’ ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న సినిమా ‘పేట్టా’. సిమ్రాన్, త్రిష కథానాయికలుగా నటిస్తున్నారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ, విజయ్ సేతుపతి, బాబీ సింహా కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ చిన్నది కాదు. దాదాపు నెల రోజుల పాటు సాగుతుంది. ఈ షెడ్యూల్లోనే ప్రధాన తారాగణంతో పాటు సుమారు 500 మంది బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సీన్స్‌ను కూడా చిత్రీకరిస్తున్నారు. లక్నోలోనే కాకుండా వారణాసి, సోన్‌బాద్రా ఏరియాల్లో కూడా షూటింగ్ ప్లాన్ చేశారు. అలాగే సినిమాకు సంబంధించిన ఫొటోలు లీక్ అవుతున్నాయని సెట్లోకి సెల్ ఫోన్స్‌ను నిషేధించారట టీమ్. సూపర్ స్టార్‌కి ఫుల్ ప్రొటక్షన్ ఏర్పాటు చేశారట.. అనిరు«ద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ కానుందని కోలీవుడ్ టాక్. -
పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట
ఎల్కతుర్తి : రక్షణ కల్పించాలని ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు ప్రేమజంట మంగళవారం ఎల్కతుర్తిలో విలేకరులతో మాట్లాడింది. కమలాపూర్ మండల కేంద్రానికి చెందిన మౌటం నాగలక్ష్మి, కొండి ధనుంజయ ఆరు సం వత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఈనెల 20న హైదరాబాద్‌లోని ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకున్నారు. దీంతో నాగలక్ష్మి తల్లిదండ్రులు కమలాపూర్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టారు. 21వ తేదీన ధనుంజయ ఇంటిపై నాగలక్ష్మి బంధువులు దాడి చేశారు. తమపై దాడి చేసే అవకాశాలు ఉన్నాయని, తమకు రక్షణ కల్పించాలని ధనుంజయ, నాగలక్ష్మి ఈ సందర్భంగా సీఐ రవికుమార్‌ను కోరారు. -
బీజేపీ ప్రభుత్వంలో మైనార్టీలకు రక్షణ కరువు
కడప కార్పొరేషన్ : బీజేపీ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీ వర్గాలపై దాడులు పెరిగిపోయాయని, మహిళలు, పిల్లల మాన ప్రాణాలకు రక్షణ కరువైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బి. కిషోర్ కుమార్ ధ్వజమెత్తారు. బుధవారం స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జమ్ముకాశ్మీర్‌లో 8 ఏళ్ల ఆసిఫాను ఆరుగురు వ్యక్తులు దేవాలయంలో బంధించి అత్యాచారం చేసి హత్య చేయడం అత్యంత కిరాతకమన్నారు. ఆ సంఘటనకు మతం రంగు పులిమి దోషులకు మద్దతుగా న్యాయవాదులు, బీజేపీ మంత్రులు ర్యాలీ చేయడంపై ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలన్నారు. దేశంలో సాగుతున్న రాక్షస పాలనకు ఇది ప్రత్యక్ష నిదర్శనమన్నారు. ఆసిఫాపై లైంగిక దాడికి పాల్పడిన వారిని బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ చేశారు. దళితులకు ఉక్కు కవచం లాంటి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో సుప్రీం కోర్టు మార్పులు చేయడం అత్యంత దుర్మార్గమన్నారు. సుప్రీం తీర్పును నిరసిస్తూ దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనల్లో 25 మంది చనిపోతే, ప్రభుత్వం 11 మంది మాత్రమే చనిపోయినట్లు చెబుతోందన్నారు. దేశంలో జరుగుతున్న ఈ పరిణామాలపై కలిసి వచ్చే అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలను కలుపుకొని ఈనెల 23వ తేది సోమవారం సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. ఆ సదస్సులో అన్ని అంశాలపై చర్చించి ఆందోళనా కార్యక్రమాలకు రూపకల్పన చేస్తామని తెలిపారు. వైఎస్ఆర్సీపీ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు విజయ్‌కుమార్(బూస్ట్), దళిత నాయకులు ఎం.సుబ్బరాయుడు, పీజీ గంగయ్య, పి.శ్రీనివాసులు, కె. మునెయ్య పాల్గొన్నారు. -
నాటిన ప్రతి మొక్కను కాపాడుకుంటాం
పరిరక్షణకు నోడల్ అధికారుల నియామకం వరంగల్ సీపీ సుధీర్‌బాబు కమిషనరేట్ పరేడ్ మైదానంలో హరితహారం వరంగల్æ: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసుల మంతా నాటిన ప్రతి మొక్కను కాపాడుకుంటామని సీపీ సుధీర్‌బాబు అన్నారు. పోలీస్ కమిషనరేట్ కా ర్యాలయంలోని పరేడ్ మైదానంలో బుధవారం సీపీ పది లక్షల మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా చేపట్టిన హరితహారంలో భాగంగా గత నెల 8వ తేదీ నుంచి మొక్కలు నాటుతున్నామన్నారు. పోలీ సు అధికారులు, సిబ్బంది సమష్టిగా కార్యక్రమాన్ని విజయవంతం చేశారని, 10 లక్షల మొక్కను కమిషనరేట్ పరిధిలో నాటినట్లు తెలిపారు. తెలంగాణ రా ష్ట్ర వృక్షం జమ్మి చెట్టును పరిరక్షించాలన్న ధ్యేయం తో.. 2వేల జమ్మి మొక్కలను దేవాలయ ప్రాంగణా ల్లో నాటించామన్నారు. ఇప్పటి వరకు మామునూరు పోలీసు డివిజన్ పరిధిలో 3,96,546, కాజీపేట పరి ధిలో 3,26,775, వరంగల్ పరిధిలో 1,66,880, హన్మకొండ పరిధిలో 1,03,926, క్రైం, ట్రాఫిక్ విభాగాలు 17,400 మొక్కలు నాటారన్నారు. మొత్తం 10 లక్షల మొక్కలు కమిషనరేట్ పరిధిలో నాటించినట్లు వివరించారు. నాటిన ప్రతి మొక్కకు ట్రీగార్డును ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక నోడల్ అధికారిని నియమించి, మొక్కల రక్షణ బాధ్యతలను అప్పగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏసీపీలు వెంకటేశ్వర్రావు, ఈశ్వర్రావు, సీఐలు కిషన్, రాజిరెడ్డి, విష్ణుమూర్తి, ఆర్ఐలు శ్రీనివాస్, నాగయ్య, ఆర్ఎస్సైలు శ్రీధర్, సంపత్, యాదగిరి, తాహేర్, వేణు, శివకేశవులు, రమేష్, సిటీ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు అశోక్ పాల్గొన్నారు.