రాష్ట్రంలోనే బాన్సువాడ ఫస్ట్
Published Tue, Aug 9 2016 11:37 PM | Last Updated on Tue, Sep 18 2018 6:30 PM
హరితహారం అమలులో మొదటి స్థానం
మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడి
బాన్సువాడ టౌన్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న తెలంగాణకు హరితహారంలో బాన్సువాడ నియోజకవర్గం మొదటి స్థానంలో ఉందని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. మరితహారం అమలుపై ఫారెస్ట్, మునిసిపల్, ఎక్సైజ్ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు బీఆర్ మీనా, గోపాల్, అజయ్ మిశ్రా మంగళవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బాన్సువాడ తహసీల్ కార్యాలయంలో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. పడావుగా ఉన్న రెవెన్యూ భూముల్లో, ఫారెస్ట్ భూముల్లో బండ్ ప్లాంటేషన్ మొక్కలను నాటాలని, నాటిన మొక్కలకు ట్రీ గార్డుల ఏర్పాటుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. అనంతరం పోచారం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 3.35 కోట్ల మొక్కల లక్షల లక్ష్యం కాగా, ఈ నెల 8 వరకు 3,31,315 మొక్కలు నాటామని అన్నారు. జిల్లాలో 90 శాతం మొక్కలను నాటినట్లు వివరించారు. బాన్సువాడ, బీర్కూర్, వర్ని, కోటగిరి, పిట్లం, నిజాంసాగర్, వేల్పూర్, డిచ్‌పల్లి, భీమ్‌గల్, ఆర్మూర్ మండలాల్లో వంద శాతం మొక్కలు నాటినట్లు, ఇటీవల గిరిరాజ్ కళాశాల విద్యార్థులతో సర్వే చేయించామని, అందులో 95 శాతం అనుకులంగా వచ్చిందన్నారు. మొక్కలు నాటే కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని, మార్చి వరకు మొక్కలను నాటాలని ఆయన సూచించారు. మొక్కలను నాటడమే కాదు వాటిని సంరక్షించాలని, అందుకోసం ట్రీగార్డులు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. టీఆర్‌ఎస్ నేతలు కృష్ణారెడ్డి, ఎజాస్, అలిమోద్దీన్‌బాబా, ఆర్‌ఐలు సంగమేశ్వర్, వసీం, వీఆర్వోలు సాయిబాబా, లక్ష్మికాంత్, ఏపీఎం గంగాధర్, ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మి తదితరులు ఆయన వెంట ఉన్నారు.
Advertisement
Advertisement