
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ అతి పెద్ద వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్ర లిమిటెడ్ అమెరికా ఇ-వెహికల్ మార్కెట్‌పై కన్నేసింది. ఈ నేపథ‍్యంలో అక్కడొక నిర్మాణ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది.ప్రపంచ ఆటోమొబైల్ డెట్రాయిట్‌లో భారీ పెట్టుబడితో తొలి ఉద్పాదక ప్లాంట్‌ను తెరిచింది. తద్వారా 25 సంవత్సరాల్లో తొలి ఆటోమోటివ్ ప్రొడక్షన్ సౌకర్యాన్ని నెలకొల్పింది. అంతేకాదు ఈ ప్లాంట్‌ద్వారా అక్కడ 250 ఉద్యోగాలను కూడా సంస్థ కల్పించనుంది.
ఎం అండ్‌ఎం అమెరికా ఎలక్ట్రానిక్ వాహనాల మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో డెట్రాయిట్‌లో 230 మిలియన్ డాలర్ల పెట్టుబడితో ఒక ప్లాంటును నిర్మించింది. అమెరికాలో ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తెచ్చే క్రమంలో అటానమస్ ట్రాక్టర్లు, కార్లపై ప్రయోగాలు నిర్వహిస్తున్నామని ఎం అండ్‌ఎం చైర్మన్ ఆనంద్ మహీంద్రా ప్రకటించారు. వాహనాల అమ్మకాలను ప్రారంభించడానికి ఇదే సరైన సమమని ఛైర్మన్ తెలిపారు. 2020 నాటికి, కంపెనీ 600 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలని, మరో 400 ఉద్యోగాలు సృష్టించాలని కంపెనీ భావిస్తున్నట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment