dig prabhakarrao
-
సిద్ధేశ్వరస్వామి ఆలయంలో డీఐజీ పూజలు
అమరాపురం : మండలంలో వెలసిన హేమావతి సిద్ధేశ్వరస్వామి ఆలయాన్ని డీఐజీ ప్రభాకర్‌రావు శనివారం సందర్శించారు. అర్చకులు, సర్పంచు సదాశివ, గ్రామపెద్దలు ప్రకాష్, కుమారస్వామి తదితరులు డీఐజీకి స్వాగతం పలికారు. అనంతరం మానవాకారంలో ఉన్న సిద్ధేశ్వరస్వామికి ప్రత్యేకంగా పూజలు చేశారు. అనంతరం కాలభైరవేశ్వరస్వామి, దొడ్డేశ్వరస్వామి ఆలయాల్లో పూజలు చేయించారు. ఆలయ విశిష్టతను అర్చకులు డీఐజీకి వివరించారు. పెనుకొండ డీఎస్పీ సుబ్బారావు, మడకశిర సీఐ దేవానంద్, ఎస్ఐ వెంకటస్వామి, సిబ్బంది పాల్గొన్నారు. -
సెంట్రల్ జైలును సందర్శించిన డీఐజీ
పోచమ్మమైదాన్ : వరంగల్ కేంద్ర కారాగారాన్ని డీఐజీ టి.ప్రభాకర్‌రావు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు జైళ్ల శాఖ డీఐజీ కేశవనాయుడు, పర్యవేక్షణాధికారి న్యూటన్ తదితరులు డీఐజీకి స్వాగతం పలకగా.. ఆయన జైలులోని పలు విభాగాలను పరిశీలించారు. ఖైదీలకు కల్పిస్తున్న వసతులు, వారి రోజు వారీ కార్యకలాపాలు తెలుసుకున్నారు. అలాగే, ఖైదీలు తయారుచేస్తున్న ఉత్పత్తులను డీఐజీ పరిశీలించి అభినందించారు. కార్యక్రమంలో ఉప పర్యవేక్షణాధికారి శ్రీనివాస్, జైలర్లు అశోక్‌రెడ్డి, నరసింహాస్వామి, డిప్యూటీ జైలర్లు సుభాష్, లక్ష్మీనారాయణ, సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు. -
వరంగల్ రేంజ్లో 40 లక్షల మెుక్కలు నాటాం
డీఐజీ ప్రభాకర్‌రావు కాళేశ్వరం : రెండో విడత హరితహారంలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వరంగల్ రేంజ్ పరిధిలోని వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజమాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 40 లక్షల మెుక్కలు నాటామని డీఐజీ ప్రభాకర్‌రావు తెలిపారు. మహదేవపూర్‌లో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటు చేసిన ‘సైరన్ కూత–హరితం మోత’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. మెుక్కలు నాటేవారిని ప్రోత్సహించాలని, నరికేవారిని సహించొద్దని ప్రజలు, అధికారులకు సూచించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 12 లక్షల మెుక్కలు నాటామని తెలిపారు. మహదేవపూర్‌లో సైరన్ ఆన్ చేయగానే అందరూ కలిసి 22,600 మెుక్కలు నాటడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో గోదావరిఖని ఏఎస్పీ విష్ణు ఎస్.వారియర్, డీఎఫ్‌వో రవికిరణ్, సర్పంచ్ కోట రాజబాబు, ఎంపీపీ వసంత, జెడ్పీటీసీ హసీనాబాను, సింగిల్‌విండో చైర్మన్ శ్రీపతి బాపు, ఎంపీటీసీ చాగర్ల రమాదేవి, ఎంఈవో రాజయ్య, కాటారం సీఐ సదన్‌కుమార్, ఎస్సైలు కృష్ణారెడ్డి, రమేశ్, వెంకటేశ్వరారవు, ప్రభుత్వ, ప్రవేటు పాఠశాలల హెచ్ఎంలు, నాయకులు,స్వచ్ఛంద సంస్థల సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.