సెంట్రల్‌ జైలును సందర్శించిన డీఐజీ | DIG visited the Central Prison | Sakshi
Sakshi News home page

సెంట్రల్‌ జైలును సందర్శించిన డీఐజీ

Published Fri, Aug 5 2016 12:16 AM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM

DIG visited the Central Prison

పోచమ్మమైదాన్‌ : వరంగల్‌ కేంద్ర కారాగారాన్ని డీఐజీ టి.ప్రభాకర్‌రావు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు జైళ్ల శాఖ డీఐజీ కేశవనాయుడు, పర్యవేక్షణాధికారి న్యూటన్‌ తదితరులు డీఐజీకి స్వాగతం పలకగా.. ఆయన జైలులోని పలు విభాగాలను పరిశీలించారు. ఖైదీలకు కల్పిస్తున్న వసతులు, వారి రోజు వారీ కార్యకలాపాలు తెలుసుకున్నారు.
 
అలాగే, ఖైదీలు తయారుచేస్తున్న ఉత్పత్తులను డీఐజీ పరిశీలించి అభినందించారు. కార్యక్రమంలో ఉప పర్యవేక్షణాధికారి శ్రీనివాస్, జైలర్లు అశోక్‌రెడ్డి, నరసింహాస్వామి, డిప్యూటీ జైలర్లు సుభాష్, లక్ష్మీనారాయణ, సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement