
సిద్ధేశ్వరస్వామి ఆలయంలో డీఐజీ పూజలు
అమరాపురం : మండలంలో వెలసిన హేమావతి సిద్ధేశ్వరస్వామి ఆలయాన్ని డీఐజీ ప్రభాకర్‌రావు శనివారం సందర్శించారు. అర్చకులు, సర్పంచు సదాశివ, గ్రామపెద్దలు ప్రకాష్, కుమారస్వామి తదితరులు డీఐజీకి స్వాగతం పలికారు. అనంతరం మానవాకారంలో ఉన్న సిద్ధేశ్వరస్వామికి ప్రత్యేకంగా పూజలు చేశారు.
అనంతరం కాలభైరవేశ్వరస్వామి, దొడ్డేశ్వరస్వామి ఆలయాల్లో పూజలు చేయించారు. ఆలయ విశిష్టతను అర్చకులు డీఐజీకి వివరించారు. పెనుకొండ డీఎస్పీ సుబ్బారావు, మడకశిర సీఐ దేవానంద్, ఎస్‌ఐ వెంకటస్వామి, సిబ్బంది పాల్గొన్నారు.