‘బాబు’కు మంచి బుద్ధి ప్రసాదించుస్వామీ
-
ఆలయాల్లో ‘కాపు’వర్గీయుల పూజలు
సాక్షిప్రతినిధి, కాకినాడ :
కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్త నిరసనల్లో భాగంగా మంగళవారం జిల్లాలో కాపు సామాజికవర్గీయులు ఆలయాల్లో పూజలు, అభిషేకాలు చేసి వినతిపత్రాలు అందచేశారు. కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ముద్రగడ ఆధ్వర్యంలో పలు దశల్లో ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే.ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా మోసం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంచి బుద్ది ప్రసాదించాలంటూ వారు ప్రార్థించారు. కాకినాడలోని భానుగుడి జంక్ష¯ŒS సమీపాన ఉన్న భానులింగేశ్వరస్వామి దేవాలయంలో కాపు జేఏసీ నాయకుడు వాసిరెడ్డి ఏసుదాసు, వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు ఫ్రూటీకుమార్, కాపు సద్భావనా సంఘం నాయకుడు బసవా ప్రభాకరరావు తదితరులు దేవుడికి వినతిపత్రం అందచేశారు. అమలాపురంలో రాష్ట్ర కాపు రిజర్వేష¯ŒS పోరాట సమితి అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తి, కాపు జేఏసీ నాయకులు నల్లా పవన్, మిండగుదిటి మోహన్, కలవకొలను తాతాజీ తదితరులు వెంకటేశ్వరస్వామి ఆలయం, గడియారస్తంభం సెంటర్‌లో లక్షీ్మగణపతి ఆలయంలో కొబ్బరికాయలు కొట్టి పూజలు నిర్వహించారు. రావులపాలెం కళావెంకట్రావు సెంటర్‌లో భక్తాంజనేయస్వామి ఆలయం వద్ద జేఏసీ నాయకుడు ఆకుల రామకృష్ణ ఆధ్వర్యంలో స్వామికి పూజలు చేశారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం బొమ్మూరు దోసాలమ్మ ఆలయంలో రూరల్ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ కో–ఆర్డినేటర్లు ఆకుల వీర్రాజు, గిరజాల బాబు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం గౌతమి ఘాట్ అయ్యప్పస్వామి ఆలయంలో చంద్రబాబుకు జ్ఞాపకశక్తి ప్రసాదించాలని నగర కాపు సంఘ అధ్యక్షుడు ఆకుల వీర్రాజు కొబ్బరికాయ కొట్టి దేవుని ప్రార్థించారు. కాపు నాయకులు నందెపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కడియంలో కాపు జేఏసీ ఆధ్వర్యంలో ఆలయాల్లో కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు.